హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Vijayawada: నిన్నమంత్రికి.. అదే రోజు అర్చకులకు అవమానం.. ఇప్పుడు భవానీలతో వివాదం.. కొండపై ఏం జరుగుతోంది?

Vijayawada: నిన్నమంత్రికి.. అదే రోజు అర్చకులకు అవమానం.. ఇప్పుడు భవానీలతో వివాదం.. కొండపై ఏం జరుగుతోంది?

ఇంద్రకీలాద్రిపై వరుస వివాదాలు

ఇంద్రకీలాద్రిపై వరుస వివాదాలు

Vijayawada: ఓ వైపు ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు సందడిగా సాగుతున్నాయి. అయితే ఇదే సమయంలో వివాదాలు వెంటాడుతున్నాయి. నిన్న మంత్రి ముత్యాల నాయుడికి అవమానం జరిగింది. ఆ వెంటనే అర్చకులు నిరసనకు దిగారు. ఇప్పుడు భవానీ మాలదారుల వివాదం మొదలైంది.. ఎందుకు ఇలా జరుగుతోంది.

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Vijayawada, India

  Anna Raghu, Sr.Correspondent, News18, Amaravati.

  ప్రముఖ పుణ్యక్షేత్రం విజయవాడ (Vijayawada) కనకదుర్గ (Kanaka Durga) పుణ్యక్షేత్రం సందడిగా మారింది. దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతోంది. రోజుకో రూపంలో అమ్మవారు భక్తులకు దర్శనం ఇస్తూ అనుగ్రహిస్తున్నారు. దీంతో అమ్మవారిని పూజించేందుకు.. ఆమె దర్శన భాగ్యం పొందేందుకు భారీ సంఖ్యలో భక్తులు ఇంద్రకీలాద్రికి చేరుకుంటున్నారు. ఇలా ఓ వైపు కొండపై భక్తి భావం వెల్లివిరుస్తుంటే.. అదే సమయంలో వరుస వివాదాలు వెంటాడుతున్నాయి. నిన్న డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు (Budi Mutyala Naidu) కు ఘోర అవమానం జరిగింది. ఆయన్ను గేటు దగ్గరే.. భద్రతా సిబ్బంది నిలిపివేశారు. దీంతో ఈవో భ్రమరాంభ (EO Bramaramba) స్వయంగా వచ్చి వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. మరోవైపు స్థానాచార్యులు.. అర్చకులకు డ్యూటీ గుర్తింపు కార్డులు ఉన్నా కొండపైకి అనుమంతిచకపోవడం వివాదాస్పదమైంది. దీనిపై వారంతా నిరసనకు దిగారు. తాజాగా ఇప్పుడు భవానీ మాల విషయంలో వివాదం మొదలైంది.

  అసలు వివాదం ఏంటంటే? తాజాగా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గురువారం ఆలయ వైదిక కమిటీ, ఆలయ స్థానాచార్య విష్ణుబొట్ల శివ ప్రసాద్ శర్మ ఆలయ మీడియా వేదికనుండి ఇరుముడుల విరమణ, హోమగుండం విషయాలపై మాట్లాడుతూ కాలచక్రంలో వసంత ఋతువుకు, శరత్ ఋతువుకు మధ్య విషఘడియలు గల ఋతువులుగా చెప్పడం జరిగిందన్నారు. ఆ విషఘడియల ప్రభావం భూమి మీద లేకుండా కాపాడే శక్తిఅయిన దుర్గమ్మను దర్శిస్తే దుర్గతులు నశిస్తాయని, అదే విధంగా వసంత ఋతువులో వసంత నవరాత్రులు, శరత్ ఋతువులో శరన్నవరాత్రులు నిర్వహించడం జరుగుతుందన్నారు.

  నవరాత్రుల తరువాత దశమి రోజు ఆయుధ పూజలు చేస్తుంటారు. ఆశ్రమంలోనే చివరి రెండు రోజులు భక్తులు అధికంగా రావడం, చివరి రెండు రోజుల్లో భవానీ మాలవేసుకున్న మాలధారులు ప్రత్యేక ఇరుముడిగుండములు ఏర్పాటు చేయవలసిందిగా కోరారు. మాలధారులు దీక్ష చేయుటకు కంచి పరమాచార్యుల వారు నిర్ణయించిన ప్రకారం మాలధారణ ఎందుకు చేయాలి ఎలా చేయాలి ఎప్పుడు చేయాలన్నది ఒక ప్రామాణికత ఉండడంతో శరత్ ఋతువులో శక్తి రూపమైన అమ్మవారిని నవరాత్రులూ పూజించడం జరుగుతున్నదన్నారు.

  ఇదీ చదవండి: కొడాలి నానికి ఏమైంది..? అలా ఎందుకు చేశారు..? మనస్థాపం చెందారా..?

  ఈపద్ధతిని సుమారు 41 సంవత్సరముల క్రితం 1981వ సంవత్సరం నుండి  శ్రీముఖంగా తీసుకురావడం, 1982 నుండి 9 మందితో మొదలైన  మాలధారణలు ప్రస్తుతం 9 లక్షల మందివరకూ మాలధారణలు ఈ కార్తీక మాసంలో  చేయడం  జరుగుతోందన్నారు. శరన్నవరాత్రులు కదా మాలధారణ వేస్తే బాగుంటుంది అని మాలధారణ చేయడం జరుగుతోందన్నారు.  ఇందుకు ఎవరి అభ్యంతరం ఉండదు.  మాలధారణ చక్కగా చేసుకోవచ్చునని చెప్పారు.

  ఇదీ చదవండి : ప్రభాస్ కు మంత్రి రోజా హామీ.. రెండు ఎకరాల స్థలం కేటాయింపు..!

  శాస్త్ర ప్రకారం దేవీ భాగవత పురాణం,  శాంతి కమలాకారం వంటి ఆగమపరమైన విశేష గ్రంధాలలో వివరించిన ప్రకారం శక్తి రూపమైన అమ్మవారిని ఆరాధించడం జరుగుతోందన్నారు.  అందువల్ల ఇరుముడిగుండం ఎప్పుడు పడితే అప్పుడు పెట్టడానికి వీలు లేనందున కార్తీక పౌర్ణమితో మొదలుపెట్టి 40 రోజులు ఆచరిస్తామన్నారు.  ఆ 40 రోజుల్లో చివరి 5 రోజుల్లో శతచండీ హోమం నిర్వహించి ఇరుముడిగుండం ప్రారంభం చేస్తామన్నారు.

  అలాగే ఈ సంవత్సరం కూడా కార్తీక మాసంలో దీక్షలు తీసుకున్నప్పుడు మార్గసిరశుద్ధ షష్టి నుంచి దశమి వరకు మార్గసిరబహుళ సప్తమి, అష్టమి, నవమి, దశమి ఇలాగ 5 రోజులు పాటు భవాని దీక్ష హోమగుండం పెట్టి ఇరుముడులు సమర్పించడం జారుతుగుతోంది.  కావున భవాని మాలధారులు అందరూ కూడా సహకరించి సామాన్య భక్తులకు కూడా దర్శనం చేసుకోవడానికి సహకరించి కార్తీక మాసంలో ఇరుముడి దీక్షలు తీసుకున్నప్పుడు సంకల్పంలో భవానీ దీక్ష సంకల్ప సిద్ధిరస్తు మంత్ర ఆవాహన జరుగుతుంది కావున ఆసమయంలో  మాత్రమే పాటిస్తే బాగుంటుందని  కోరుతున్నామన్నారు.

  ఇదీ చదవండి: ఒంటరిగా ఉంటున్నారా.. మీకో గుడ్ న్యూస్.. కార్డులు ఇవ్వాలని ప్రభుత్వ నిర్ణయం

  అయితే దీనిపై భవానీ మాలధార చేసిన వారు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఎప్పుడూ ఈ సమయంలోనూ దీక్షలు తీసేవాళ్లమని.. ఇప్పుడు ఎందుకు కొత్త నిబంధనలు పెడుతున్నారంటూ నిలదీస్తున్నారు. కేవలం రద్దీ కారణంగా ఇలాంటి నిబంధనలు పెట్టడం దారుణం అని మండిపడుతున్నారు.

  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, Dussehra 2022, Vijayawada, Vijayawada Kanaka Durga

  ఉత్తమ కథలు