ఆ విషయంలో జగన్ కంటే చంద్రబాబే బెస్ట్... కార్మికుల మాట

Andhra Pradesh : ఏపీలో ఇసుక కొరత ఎఫెక్ట్ భవన నిర్మాణ కార్మికులపై ఎంతలా పడిందో చూస్తూనే ఉన్నాం. ఏకంగా కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇదే సమయంలో మరో పిడుగు కూడా వారిపై పడింది. అదేంటో తెలుసుకుందాం.

news18-telugu
Updated: November 3, 2019, 8:13 AM IST
ఆ విషయంలో జగన్ కంటే చంద్రబాబే బెస్ట్... కార్మికుల మాట
చంద్రబాబు, జగన్
  • Share this:
Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్‌లో ఇసుక కొరత ఇప్పుడు ఏర్పడింది. దీని కంటే ముందు మరో సమస్యతో బాధపడుతున్నారు భవన నిర్మాణ కార్మికులు. అదే రూ.5 భోజనం. ఏపీలో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు... అన్నా క్యాంటీన్ పథకం ద్వారా... పేద ప్రజలకు రూ.5కే భోజనం పెట్టింది. ఐతే... ఎన్నికల తర్వాత వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే... ఈ పథకంలో గోల్‌మాల్ జరిగిందంటూ... పథకాన్ని ఆగస్టులో రద్దు చేసింది. అంతే... ఇక అప్పటి నుంచీ భవన నిర్మాణ కార్మికులు, కూలీలు, పేద ప్రజలకు రూ.5 భోజనం లేకుండా పోయింది. అందువల్ల వారికి భోజనాలకు ఒక్కో కుటుంబానికీ నెలకు అదనంగా... రూ.3000 నుంచీ రూ.5000 దాకా ఖర్చవుతోంది. పైగా... అన్నా క్యాంటీన్లు ఉన్నప్పుడు... కూలీలు, కార్మికులు... ఏ పనిలో ఉన్నా... వెంటనే వచ్చి... పప్పు, సాంబార్, కూరతో మంచి భోజనం తినేందుకు వీలయ్యేది. ఇప్పుడు అలాంటి సదుపాయం లేకపోవడంతో... ఉదయాన్నే కూలి పనులకు వెళ్లేవారికి... వంట చేసుకొని వెళ్లేందుకు వీలు లేకపోవడంతో... మధ్యాహ్నం వేళ ఏ పచ్చడి అన్నమో తినాల్సి వస్తోంది. అలా కాదని మంచి భోజనం తినాలంటే... కనీసం రూ.50 వదిలిపోతున్నాయి. ఈ సమస్య భవన నిర్మాణ కార్మికుల జీవితాలపై పెద్ద ప్రభావమే చూపింది. తాజాగా దీని ఇసుక కొరత సమస్య తోడై... చివరకు చేతిలో డబ్బుల్లేక వారు ఆత్మహత్యలు చేసుకోవడానికీ వెనకాడని దుస్థితి తలెత్తుతోంది.


అన్నా క్యాంటీన్లు ఎందుకు రద్దు చేశారు : టీడీపీ ప్రభుత్వం అన్నా క్యాంటీన్ల పేరుతో రూ.150 కోట్ల స్కాంకి పాల్పడిందన్నది వైసీపీ ఆరోపణ. ఎన్నికల ముందు ప్రజలను ప్రలోభ పెట్టేందుకు చంద్రబాబు ప్రభుత్వం కేవలం 32 రోజులు నిర్వహించిన అన్న క్యాంటీన్లలో రూ.150 కోట్ల స్కాం జరిగిందన్నది వైసీపీ ఆరోపణ. పేదలకు తక్కువ ధరకు భోజనం పెట్టే పథకంలో కూడా దోచుకున్నారని అప్పట్లో వైసీపీ నేత విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. రూ.2 లక్షలతో నిర్మించే క్యాంటీన్‌కు రూ.30-రూ.50 లక్షలు ఖర్చెందుకయ్యిందని ఆయన ప్రశ్నించారు. ఈ కారణంగానే ప్రభుత్వం అన్నా క్యాంటీన్లను రద్దు చేసింది. ఐతే... వీటి స్థానంలో రాజన్న క్యాంటీన్లను జనవరి 1 లేదా సంక్రాంతి నుంచీ తేవాలనుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై అధికారికంగా ఎలాంటి సమాచారమూ లేదు.
రూ.5 భోజనం విషయంలో సీఎం జగన్ కంటే చంద్రబాబే తమకు మేలు చేశారని భవన నిర్మాణ కార్మికులు అంటున్నారు. ఐతే... వైసీపీ ప్రభుత్వం కొత్తగా వచ్చింది కాబట్టి... ఇలాంటి విమర్శలు రావడం సహజమే. వీలైనంత త్వరగా అటు ఇసుక, ఇటు రూ.5 భోజనం వంటి అంశాలకు పరిష్కారం చూపించగలిగితే... ఇలాంటి విమర్శలకు చెక్ పెట్టినట్లవుతుంది. అవినీతి లేని పాలన అందించడమే లక్ష్యమంటున్న ప్రభుత్వం... ఆ పాలన అందించే క్రమంలో ఎదురయ్యే సవాళ్లను త్వరగా పరిష్కరించడం కూడా ముఖ్యమన్న వాదన వినిపిస్తోంది.

 

Pics : డిజైనర్ డ్రెస్సుల్లో ఇరగదీస్తున్న అతుల్య
ఇవి కూడా చదవండి :

పోలీసులకు షాక్... సెలవులు రద్దు

IND vs BAN | నేడు ఇండియా బంగ్లాదేశ్ తొలి టీ20... పొగే సమస్య

కేసీఆర్ లెక్క తప్పింది... అంత చిన్న లాజిక్ ఎలా మిస్సయ్యారో...

నేడే లాంగ్ మార్చ్... సిద్ధమైన జన సైనికులు... ఇసుక తుఫానేనా?

Diabetes Diet : డయాబెటిస్ ఉన్నవారు శీతాకాలంలో తినగలిగే పండ్లు

First published: November 3, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>