Nara Lokesh : టీడీపీ యువ నాయకుడు నారా లోకేష్ (Nara Lokesh) 'యువగళం' పాదయాత్రలో అపశృతి చోటు చేసుకుంది. పాదయాత్రకు బందోబస్తు విధుల్లో ఉన్న హెడ్ కానిస్టేబుల్ రమేష్ గుండెపోటుకు గురయ్యారు. దీనితో అతడిని హుటాహుటీన చిత్తూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ హెడ్ కానిస్టేబుల్ రమేష్ మృతి చెందారు. కాగా పాదయాత్ర ప్రారంభం రోజే నందమూరి తారకరత్న కూడా గుండెపోటుకు గురి కాగా..బెంగళూరులోని నారాయణ హృదయాలయంలో చికిత్స అందిస్తున్న విషయం తెలిసిందే.
లోకేష్ (Nara Lokesh) చేపట్టిన యువగళం పాదయాత్ర 14వ రోజు నెల్లూరు నియోజకవర్గంలో కొనసాగుతుంది. ఈరోజు ఉదయం 8 గంటలకు ఆత్మకూరు ముత్యాలమ్మ ఆలయ ఆవరణ నుండి పాదయాత్ర స్టార్ట్ అయింది. ఇక అక్కడి నుంచి సంసిరెడ్డిపల్లెకు పాదయాత్ర చేరుకునే క్రమంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నారా లోకేష్ నుండి మైక్ పోలీసులు మైక్ లాక్కున్నారు. అంతేకాదు లోకేష్ నిలబడ్డ స్టూల్ ను సైతం లాక్కునేందుకు పోలీసులు యత్నించారు. ఈ క్రమంలో పోలీసులకు, టీడీపీ శ్రేణులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అయితే పోలీసుల తీరుపై నారా లోకేష్ (Nara lokesh) స్టూల్ పై నిలబడి నిరసన తెలిపాడు. చేతిలో రాజ్యాంగాన్ని పట్టుకొని..రాజ్యాంగం ఇచ్చిన హక్కును హరించడానికి మీరెవరంటూ పోలీసులను నిలదీశారు. మా గ్రామం వచ్చినప్పుడు మాట్లాడొద్దని అనడానికి పోలీసులకు ఏం హక్కు ఉందని లోకేష్ (Nara lokesh) పోలీసులను ప్రశ్నించారు.
ఈ క్రమంలో పోలీసులు, ప్రభుత్వ తీరుపై లోకేష్ తీవ్ర విమర్శలు చేశారు. ప్రజలతో మాట్లాడకుండా పాదయాత్ర చేయాలంట. 'సైకో జగన్ కొత్త రూల్ పెట్టినట్టున్నాడు. పోలీసులు మైక్ లాగేసుకున్నారు. కార్యకర్తలను కొడుతున్నారు. పోలీసు జులుంను ఖండిస్తూ నారా లోకేష్ గారు స్టూల్ పై నిలబడి నిరసన తెలుపుతుంటే...ఆ స్టూల్ ను కూడా లాగేసే ప్రయత్నం చేయడం ఎంత దారుణం అని' లోకేష్ మండిపడ్డారు.
ప్రజలతో మాట్లాడకుండా పాదయాత్ర చేయాలంట. సైకో జగన్ కొత్త రూల్ పెట్టినట్టున్నాడు. పోలీసులు మైక్ లాగేసుకున్నారు. కార్యకర్తలను కొడుతున్నారు. పోలీసు జులుంను ఖండిస్తూ నారా లోకేష్ గారు స్టూల్ పై నిలబడి నిరసన తెలుపుతుంటే... ఆ స్టూల్ ను కూడా లాగేసే ప్రయత్నం చేయడం ఎంత దారుణం అని లోకేష్ (Nara Lokesh) మండిపడ్డారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Ap, AP News, Nara Lokesh, TDP