Home /News /andhra-pradesh /

CONO CARPUS PLANTS ARE VERY DANGEROUS FOR HUMANS AND ENVIRONMENT FULL DETAILS HERE PRN

Danger Trees: ఈ చెట్టు పెంచితే యమడేంజర్.. ప్రాణాలకే ముప్పు రావొచ్చు.. బీ కేర్ ఫుల్

కొనోకార్పస్ చెట్లు (Photo Credit: Face Book)

కొనోకార్పస్ చెట్లు (Photo Credit: Face Book)

Andhra Pradesh: పచ్చని చెట్లు.. ప్రగతికి మెట్లు అని పెద్దలు చెప్పారు.. అందుకే ప్రభుత్వాలు మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఉద్యమంలా చేపడుతున్నాయి. పచ్చని చెట్లతో గాలిలో ఆక్సిజన్ శాతం పెరిగి ఆరోగ్య సమస్యలు దూరమవుతాయి. ఐతే అన్ని రకాల చెట్లు మనకి మంచి చేస్తాయంటే పొరబాటే. మానవాళితో పాటు పర్యావరణానికి కూడా ముప్పుగా పరిణమిస్తాయి.

ఇంకా చదవండి ...
    పచ్చని చెట్లు.. ప్రగతికి మెట్లు అని పెద్దలు చెప్పారు.. అందుకే ప్రభుత్వాలు మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఉద్యమంలా చేపడుతున్నాయి. పచ్చని చెట్లతో గాలిలో ఆక్సిజన్ శాతం పెరిగి ఆరోగ్య సమస్యలు దూరమవుతాయి. ఐతే అన్ని రకాల చెట్లు మనకి మంచి చేస్తాయంటే పొరబాటే. మానవాళితో పాటు పర్యావరణానికి కూడా ముప్పుగా పరిణమిస్తాయి. ఆలాంటి ప్రమాదకరమైన మొక్కల్లో కోనో కార్పస్ అనే మొక్క ఒకటి. అందరికీ అర్ధమయ్యేలా చెప్పాలంటే ప్రస్తుతం రోడ్ల పక్కన, డివైడర్లపైనా విరివిగా ఈ మొక్కలను నాటుతున్నారు. పచ్చదనం, అందం కోసం ఈ మొక్కలను విరివిగా పెంచేస్తున్నారు. అందం సంగతి అటుంచితే వీటివల్ల జరిగే నష్టమే అధికమంటున్నారు నిపుణులు.

    ఈ చెట్లకు దుబాయ్ (Dubai) చెట్లు అనే పేరు కూడా ఉంది. ఇవి ఇక్కవగా అమెరికా ఖండంలోని తీరప్రాంతాల్లో పెరుగుతోంది. దీనికి వేగంగా పెరిగే లక్షణం ఉంది. అలాగే పచ్చగా అందంగా శంకు ఆకారంలో కపిస్తుంది. ముఖ్యంగా అరబ్ దేశాల్లో ఇళ్లపై దుమ్ముపడకుండా ఉండేందుకు ఈ చెట్లను పెంచుతారు. వేగంగా ఆకర్షణీయంగా పెరుగుతున్న ఈ మొక్కను నర్సరీల నిర్వాకరులు, ఇతర ల్యాండ్ స్కేప్ ఆర్టిస్టులు ఇండియాకు దిగుమతి చేశారు. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వెంచర్లు ఆకర్షణీయంగా కనిపించేందుకు ఈ మొక్కలనే ఎంచుకుంటున్నారు. ఆ తర్వాత రోడ్లు అందంగా కనిపిస్తాయనే ఉద్దేశంతో డివైడర్లు, ఫుట్ పాత్ ల పక్కన ఈ చెట్లను నాటుతున్నారు.

    ఇది చదవండి: ఏపీలో కోట్లు పలికిన బార్ లు.. ప్రభుత్వానికి భారీ ఆదాయం.. వివరాలివే..!


    ఐతే ఈ కోనో కార్పస్ మొక్కల వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. ఈ చెట్లు పూల నుంచి అధికంగా పుప్పొడి వస్తుంది. ఇది గాలిలో కలవడం, మనుషులు పీల్చుకుంటే శ్వాసకోశ సమస్యలు రాడవం జరుగుతోంది. ముఖ్యంగా శీతాకాలంలో ఈ సమస్య అధికంగా ఉంటోంది. ఇప్పటికే పలుదేశాలు ఈ మొక్కను నిషేధించాయి. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) పొరుగు రాష్ట్రమైన తెలంగాణ (Telangana) లోనూ ఈ మొక్కలు నాటడాన్ని నిషేధించారు. తొలుత ఈ మొక్కలను విరివిగా నాటినా ఆ తర్వాత వీటి వల్ల జరుగుతున్న నష్టాలను గ్రహించి నాటడాన్ని నిలిపేశారు.

    ఇది చదవండి: అంత్యక్రియలు చేసిన 41 రోజుల తర్వాత ప్రత్యక్షం.. ఫ్యామిలీ ఫ్యూజులు ఔట్.. 


    ఈ మొక్కల కారణంగా పర్యావర సమతౌల్యత కూడా దెబ్బతింటుందని నిపుణులు చెబుతున్నారు. ఈ మొక్కలు అటవీ ప్రాంతాల్లో పెరగడం వల్ల గడ్డిజాతి, ఇతర కలుపు మొక్కలు పెరగడం కష్టమవుతుందని తద్వార వన్య పాణాలకు ఆహారం దొరకదంటున్నారు. వన్యప్రాణుల సంఖ్య తగ్గింతే మాంసాహార జంతువులకు కూడా ఆహారం దొరక్క మనుగడ కష్టమవుతుందట. ఇదిలా ఉంటే కొనో కార్పస్ చెట్ల వల్ల ఇతర చెట్లు వేగంగా పెరగకపోవడంతో పక్షులకు గూళ్లు ఏర్పాటు చేసుకోవడం కూడా కష్టతరంగా మారుతుంది. దీంతో సరైన ఆవాసం లేక పునరుత్పత్తి జరగదని.. పక్షుల జాతులు కూడా అంతరించిపోయే ప్రమాదముందంటున్నారు.
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, Tree plantation

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు