రాష్ట్రంలో అటవిక రాజ్యం నడుస్తోంది.. తులసీరెడ్డి ఘాటు వ్యాఖ్యలు

కక్ష సాధింపుతో నిరంకుశ ధోరణిలో డాక్టర్‌ను సస్పెండ్ చేశారని పేర్కొన్నారు. ఆయన నిరసన చేస్తుంటే.. ట్రాఫిక్ పోలీసులు చేతులు కట్టి లాఠీతో కొట్టి తీసుకుపోవడమనేది సభ్య సమాజం తలదించుకునేలా ఉందని మండిపడ్డారు.

news18-telugu
Updated: May 17, 2020, 4:22 PM IST
రాష్ట్రంలో అటవిక రాజ్యం నడుస్తోంది.. తులసీరెడ్డి ఘాటు వ్యాఖ్యలు
తులసి రెడ్డి
  • Share this:
కడప జిల్లా వేంపల్లె నర్సీపట్నానికి చెందిన డాక్టర్ సుధాకర్ పట్ల ట్రాఫిక్ పోలీసులు ప్రదర్శించిన తీరు బాధాకరమని కాంగ్రెస్ వర్కింగ్ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి అన్నారు. డాక్టర్ సుధాకర్‌ను ప్రభుత్వం సస్పెండ్ చేయడాన్ని తప్పుపట్టారు. కక్ష సాధింపుతో నిరంకుశ ధోరణిలో డాక్టర్‌ను సస్పెండ్ చేశారని పేర్కొన్నారు. ఆయన నిరసన చేస్తుంటే.. ట్రాఫిక్ పోలీసులు చేతులు కట్టి లాఠీతో కొట్టి తీసుకుపోవడమనేది సభ్య సమాజం తలదించుకునేలా ఉందని మండిపడ్డారు. రాష్ట్రంలో అటవిక రాజ్యం, రౌడీ రాజ్యం సాగుతోందని తెలిపారు. డాక్టర్ సుధాకర్ సస్పెన్షన్‌ను వెంటనే ఎత్తివేయాలని కాంగ్రెస్ పార్టీ తరపున డిమాండ్ చేశారు. అతడికి మెరుగైన వైద్యం అందించి భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలన్నారు. అలాగే శ్రీకాకుళం జిల్లా నుంచి చిత్తూరు జిల్లా వరకు ప్రతి విద్యుత్ వినియోగదారుడికి గతం కంటే రెండు మూడు రెట్లు ఎక్కువ విద్యుత్ బిల్లులు వచ్చాయని చెప్పారు. శ్లాబు రేట్లలో తేడా వల్ల విద్యుత్ బిల్లుల్లో మార్పు వచ్చిందన్నారు.

మార్చి, ఏప్రిల్, మే, జూన్ మాసాలకు సంబంధించి విద్యుత్ బిల్లులు మాపీ చేయాలని పేర్కొన్నారు. ఆర్టీసీకి సంబంధించి 7600 మందిని తొలగించడం అనేది చాలా దుర్మార్గమైన విషయమని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.20లక్షల కోట్లలో పేద ప్రజలకు ఇరవై పైసలు కూడా అందడం లేదన్నారు. ప్రభుత్వం ఒక వడ్డీ వ్యాపారుల్లా కాకుండా కన్నతల్లిలా ప్రజలను ఆదుకోవాలని సూచించారు.
Published by: Narsimha Badhini
First published: May 17, 2020, 4:11 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading