మాజీ మంత్రి వట్టి వసంతకుమార్ (70) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన... విశాఖలోని అపోలో ఆస్పత్రిలో ట్రీట్‌మెంట్ పొందుతూ తుదిశ్వాస విడిచారు. వట్టి వసంతకుమార్ స్వగ్రామం.. పశ్చిమ గోదావరి జిల్లా.. భీమడోలు మండలం.. పూళ్ల. 1955లో పుట్టిన ఆయన... 1978లో ఆంధ్రా యూనివర్శిటీ నుంచి.. ఎంబీఏ చేశారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆయన.. మొదటి నుంచి రాజకీయాల్లో ఎంతో ఆసక్తి చూపించారు. పార్టీలో ఎన్నో పదవుల్లో పనిచేసిన ఆయన... 2004 అసెంబ్లీ ఎన్నికల్లో... ఉంగుటూరు నియోజకవర్గం నుంచి... ఎమ్మెల్యేగా గెలిచారు. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మరోసారి గెలిచి.. మంత్రి పదవి చేపట్టారు. పర్యాటక, క్రీడా, గ్రామీణాభివృద్ధి శాఖల్ని నిర్వహించారు.
ఏపీ విభజన తర్వాత.. క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉన్న వట్టి... ఎన్నికల్లో పోటీ చెయ్యలేదు. ఐతే... రాజకీయాల్లో ఉన్నంతకాలం... మాజీ ముఖ్యమంత్రులు వైఎస్ రాజశేఖర రెడ్డి, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి పాలనా కాలంలో మంత్రిగా పనిచేశారు. ఆయన మృతితో కాంగ్రెస్ శ్రేణులు.. విషాదంలో మునిగిపోయాయి.
కొంతకాలం కిందట వట్టి వసంతకుమార్ భార్య మరణించారు. దాంతో ఆయన రాజకీయాలకు పూర్తిగా దూరం అయ్యారు. ఆ తర్వాత అనారోగ్య సమస్యలు తలెత్తాయి. ఈమధ్యే ఆయనకు కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ జరిగినట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా రాజకీయాల్లో ఆయన కాంగ్రెస్‌కి లాయలిస్టుగా ఉన్నారు. ముక్కుసూటిగా మాట్లాడే ఆయన... ఏ విషయంలోనైనా తన అభిప్రాయాన్ని కుండబద్ధలు కొట్టేవారు. అందువల్లే ఆయనంటే మాజీ ముఖ్యమంత్రులు ఎంతో నమ్మకంతో ఉండేవారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.