ఏపీ సీఎం వైఎస్ జగన్పై కాంగ్రెస్ నేత తులసీ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సిగ్గుంటే సీఎం పదవికి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. గ్రామ పంచాయతీ కార్యాలయాలకు వైసీపీ రంగుల అంశంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు సందర్భంగా స్పందించిన ఆయన... వైసీపీ ప్రభుత్వం తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. గతంలో నీలం సంజీవరెడ్డి, జనార్ధన్ రెడ్డి ఒక సంఘటనలో ఓ కేసులో కోర్టు మందలించిందని సీఎం పదవులకు రాజీనామా చేశారని గుర్తు చేశారు. అసలైన నాయకులంటే వారేనన్న తులసీ రెడ్డి.. వైసీపీ ప్రభుత్వానికి ఏ మాత్రం సిగ్గున్నా తక్షణం వైఎస్ జగన్ రాజీనామా చేయాలని స్పష్టం చేశారు.
తులసి రెడ్డి
ఏపీలో గ్రామ పంచాయతీ కార్యాలయాల రంగుల వ్యవహారంపై సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వానికి గట్టి షాక్ తగిలింది. నాలుగు వారాల్లోగా రంగులు తొలగించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కార్యాలయాలకు వేసిన రంగులు వైసీపీ జెండా రంగులు కాదని వాదనలు వినిపించగా.. నాలుగు వారాల్లో వేసిన రంగులు తొలగించక పోతే కోర్టు ధిక్కరణగా పరిగణించాల్సి ఉంటుందని ఆదేశించింది. ప్రభుత్వ కార్యాలయాల రంగులపై రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన జీవో 623 రద్దు చేసింది. కాగా, జగన్ సర్కారుకు హైకోర్టులోనూ చుక్కెదురైన సంగతి తెలిసిందే. స్థానికల ఎన్నికల నోటిఫికేషన్ సమయంలో హైకోర్టులో విచారణ జరగ్గా.. ఆ రంగులను తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది. ఆ తర్వాత అదనంగా కాషాయ రంగును చేర్చుతూ రంగులు వేసినా లాభం లేకపోయింది. ఇప్పుడు సుప్రీం కోర్టు ఏకంగా గట్టి షాక్ ఇచ్చింది.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.