కేరళలోని తిరువనంతపురం లోక్ సభ స్థానానికి పోటీ చేస్తున్న కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ తన నామినేషన్ పత్రాల్ని సమర్పించారు. అందులో తనకు రూ.35 కోట్ల ఆస్తులు ఉన్నట్లు తెలిపారు. కేంద్ర మాజీ మంత్రి అయిన శశిథరూర్... ఏప్రిల్ 23న జరిగే రెండో దశ ఎన్నికల్లో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. తన చరాస్థులు రూ.34,00,22,585 అని రాసిన థరూర్... దేశవ్యాప్తంగా వేర్వేరు బ్యాంకుల్లో, విదేశీ బ్యాంకుల్లో తనకు రూ.5.88 కోట్లకుపైగా డిపాజిట్లు ఉన్నాయని జిల్లా కలెక్టర్‌కు సమర్పించిన అఫిడవిట్లో వివరించారు. స్థిరాస్థులు మాత్రం రూ.1 కోటి విలువ చేస్తాయని తెలిపారు. ఐతే... థరూర్ సమర్పించిన అఫిడవిట్ అధికారులకు ఆసక్తి కలిగించింది. ఆయన... 2017-2018 ఆర్థిక సంవత్సరంలో... రూ.3,66,21,978 ఆదాయం వచ్చినట్లు తెలిపారు.
తన భార్య సునందా పుష్కర్ మరణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న శశిథరూర్ షేర్ల మార్కెట్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టారు. రూ.15 కోట్ల రూపాయలకుపైగా షేర్లు, బాండ్లు, మ్యూచువల్ ఫండ్స్ కొన్నట్లు తెలిపారు. తనకు రెండు కార్లు ఉన్నాయని తెలిపిన ఆయన... తన చేతిలో రూ.25,000 ఉన్నాయన్నారు.
ఎంపీ శాలరీ, ఐక్యరాజ్యసమితి పెన్షన్, పుస్తకాలు, ఆర్టికల్స్‌పై వచ్చే రాయల్టీ, తన ప్రసంగాలకు ఇచ్చే ఫీజును ఆదాయ మార్గాలుగా వివరించారు థరూర్. తనపై రెండు క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. 2014 ఎన్నికలప్పుడు తనకు రూ.23 కోట్ల ఆస్తులున్నట్లు థరూర్ తెలిపారు. అంటే ఐదేళ్లలో ఆయన ఆస్తులు రూ.12 కోట్లు పెరిగినట్లు అర్థమవుతోంది.
ఇవి కూడా చదవండి :
భారత్ మిషన్ శక్తి ప్రయోగం ప్రమాదకరం... స్పేస్ వ్యర్థాలతో వ్యోమగాములకు ఇబ్బందే... నాసా ప్రకటన
హ్యాట్రిక్ కొట్టిన టీంఇండియా... టెస్టుల్లో మళ్లీ ఛాంపియన్లుగా కోహ్లీ సేన
టాస్ బదులు ట్విట్టర్ పోల్... ఫోర్ కొడితే 8, సిక్స్ కొడితే 12... ఇది ఏప్రిల్ ఫూల్ కాదు... ఐసీసీ నిర్ణయాలు
భర్తపై దాడి చేసి... భార్యను గ్యాంగ్ రేప్ చేసి... హర్యానాలో నడిరోడ్డుపై అరాచకం...