హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

పట్టుబట్టి సాధించిన బాలయ్య...విశాఖ లోక్‌సభ సీటు చిన్నల్లుడిదే

పట్టుబట్టి సాధించిన బాలయ్య...విశాఖ లోక్‌సభ సీటు చిన్నల్లుడిదే

శ్రీభరత్

శ్రీభరత్

చివరి నిమిషంలో విశాఖపట్నం లోక్‌సభ అభ్యర్థిగా నందమూరి బాలకృష్ణ చిన్నల్లుడు శ్రీభరత్ పేరు తెరమీదకు వచ్చింది. గత రెండ్రోజులుగా జరుగుతున్న ప్రచారాన్ని నిజం చేస్తూ...టీడీపీ ప్రకటించిన 25 మంది అభ్యర్థుల జాబితాలో చోటు దక్కించుకున్నాడు.

    విశాఖపట్నం లోక్‌సభ నియోజకవర్గం నుంచి టిడిపి అభ్యర్థిగా నందమూరి బాలకృష్ణ చిన్నల్లుడు శ్రీభరత్ పేరును ఖరారు చేశారు. నందమూరి బాలకృష్ణ చిన్న కుమార్తె  తేజస్వి భర్త భరత్...గీతం యూనివర్సిటీ ఎంవీవీఎస్ మూర్తికి మనుమడు. విశాఖ టిక్కెట్‌ను తన చిన్నల్లుడికి ఇప్పించుకునేందుకు ఏపీ సీఎం చంద్రబాబుపై నందమూరి బాలకృష్ణ ఒత్తిడి తీసుకొస్తున్నట్లు రెండ్రోజుల క్రితం ప్రచారం జరిగింది. చివరి నిమిషంలో భరత్ పేరు తెరమీదకు వచ్చినా...పార్టీ టిక్కెట్ సాధించడంలో సఫలీకృతమయ్యారు. విశాఖ జిల్లా టీడీపీ నేతలు కూడా శ్రీభరత్ వైపే మొగ్గుచూపారు.  విశాఖ టిక్కెట్‌ను శ్రీభరత్‌కు ఇవ్వాలని వారు పార్టీ అధిష్టానానికి సూచించారు. స్థానిక నేతలు కూడా భరత్ వైపే మొగ్గుచూపడంతో గత కొన్ని రోజులుగా జరుగుతున్న ప్రచారాన్ని నిజం చేస్తూ విశాఖ టిక్కెట్‌ను శ్రీభరత్ సొంతం చేసుకున్నాడు.


    విశాఖలో సోమవారం సమావేశమైన  జిల్లా టిడిపి నేతలు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు, విశాఖ అభ్యర్థిగా ఎవరిని ప్రకటించాలన్న అంశంపై చర్చించారు. ఈ సమావేశంలో మెజార్టీ నేతలు శ్రీభరత్ వైపే మొగ్గుచూపినట్లు తెలుస్తోంది.  ఈ సమావేశం అనంతరం గంటా మీడియాతో మాట్లాడుతూ..విశాఖ లోక్‌సభ స్థానానికి శ్రీభరత్‌ ఆసక్తిగా ఉన్న అంశాన్ని సియంకు తెలిపామన్నారు. జిల్లా నేతలు కూడా భరత్ వైపే మొగ్గుచూపడంతో టీడీపీ ప్రకటించిన 25 మంది లోక్‌సభ అభ్యర్థుల జాబితాలో భరత్ చోటు దక్కించుకున్నారు.


    విశాఖ లోక్‌సభ నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థిగా బరిలో నిలిచిన సినీ నిర్మాత-రియల్టర్ ఎంవీవీ సత్యనారాయణతో శ్రీభరత్ తలపడనున్నారు. 2014 ఎన్నికల్లో ఇక్కడ టీడీపీ మద్దతుతో బరిలో నిలిచిన బీజేపీ అభ్యర్థి కంభంపాటి హరిబాబు...వైసీపీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మపై విజయం సాధించారు. ఈ ఎన్నికల్లోనూ విశాఖలో పసుపు జెండా ఎగురవేస్తామని టీడీపీ నేతలు ధీమా వ్యక్తంచేస్తున్నారు.


    నందమూరి బాలకృష్ణ పెద్ద అల్లుడు నారా లోకేశ్ ఏపీ మంత్రిగా ఉండడం తెలిసిందే. ఇప్పుడు ఆయన చిన్నల్లుడు శ్రీభరత్ కూడా ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రవేశిస్తుండడం విశేషం.


     

    First published:

    Tags: Andhra Pradesh Assembly Election 2019, Andhra Pradesh Lok Sabha Elections 2019, Lok Sabha Election 2019, Tdp, Visakhapatnam S01p04

    ఉత్తమ కథలు