HOME »NEWS »ANDHRA PRADESH »concerns among tribals with the supreme court ruling on go no 3 bn

గిరిజనులకు గుడ్ న్యూస్.. సీఎం జగన్ కీలక నిర్ణయం

గిరిజనులకు గుడ్ న్యూస్.. సీఎం జగన్ కీలక నిర్ణయం
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి

ఎస్టీ ప్రాంతాల్లో ఉపాధ్యాయ పోస్టుల్లో ఎస్టీలకు వంద శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెచ్చిన జీవోను ఇటీవల సుప్రీం కోర్టు కొట్టేసింది. అయితే ఆ తీర్పు వల్ల గిరిజన వర్గాల్లో ఆందోళన నెలకొంది.

  • Share this:
    గిరిజనులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఎస్టీ ప్రాంతాల్లో ఉపాధ్యాయ పోస్టుల్లో ఎస్టీలకు వంద శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెచ్చిన జీవోను ఇటీవల సుప్రీం కోర్టు కొట్టేసింది. అయితే ఆ తీర్పు వల్ల గిరిజన వర్గాల్లో ఆందోళన నెలకొంది. ఈ అంశాన్ని డిప్యూటీ సీఎం పుష్ఫశ్రీవాణి, గిరిజన ఎమ్మెల్యేలు సీఎం జగన్ దృష్టికి తీసుకొచ్చారు. ఈ అంశంపై సీఎం సమీక్ష నిర్వహిస్తూ గిరిజనుల ప్రయోజనాలు కాపాడాలని అధికారులను ఆదేశించారు. ఈ విషయంపై అడ్వకేట్ జనరల్ శ్రీరామ్‌తో సీఎం జగన్ సమీక్షించారు. సుప్రీం కోర్టును క్షుణ్ణంగా అధ్యయనం చేసి న్యాయపరంగా తీసుకోవాల్సిన చర్యలపై ఆలోచన చేయాలని సీఎం నిర్దేశించారు. ఉమ్మడి రాష్ట్రంలో విడుదల చేసిన జీవో కావడం వల్ల తీర్పు ప్రభావం ఇరు రాష్ట్రాలపై ఉంటుందని సీఎం అభిప్రాయపడ్డారు. అందువల్ల తెలంగాణ ప్రభుత్వంతోనూ సమన్వయం చేసుకుని ముందడుగు వేయాలని సీఎం ఆదేశించారు.
    Published by:Narsimha Badhini
    First published:May 10, 2020, 19:14 IST