Home /News /andhra-pradesh /

COMPENSATION TO NIVAR CYCLONE VICTIMS WILL BE GIVEN BEFORE JANUARY 2021 SAYS CM YS JAGAN MOHAN REDDY AK

Cyclone Nivar: అప్పటిలోగా నివర్ తుపాను బాధితులకు పరిహారం.. సీఎం జగన్ ఆదేశాలు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

AP Cabinet Decision: రాష్ట్రంలో భారీ వర్షాలు, నివర్ తుపానుపై కేబినెట్‌లో ప్రత్యేక చర్చ జరిగింది. నష్టపరిహారం పై అంచనాలను డిసెంబర్ 15 నాటికి పూర్తి చేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు.

    ఏపీలో నివర్ తుపాను కారణంగా నష్టపోయిన వారిని సాధ్యమైనంత తొందరగా ఆదుకుని సాయం చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఏపీ కేబినెట్ భేటీలో సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో భారీ వర్షాలు, నివర్ తుపానుపై కేబినెట్‌లో ప్రత్యేక చర్చ జరిగింది.నష్టపరిహారం పై అంచనాలను డిసెంబర్ 15 నాటికి పూర్తి చేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా తుపాను కారణంగా వచ్చిన వర్షాలకు ముగ్గురు మృతి చెందారు. వీరికి కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకలకు అనుగుణంగా పరిహారం చెల్లించాలని సీఎం జగన్ స్పష్టం చేశారు. ఇక ప్రాధమికంగా భారీ వర్షాలు, వరదల కారణంగా 40 వేల హెక్టార్లలో పంట నష్టం వాటిల్లిందని అధికారులు అంచనా వేశారు. వీరికి జనవరి 2021 నాటికి పరిహారం చెల్లించాలని సీఎం జగన్ సూచించారు. పంట నష్టం వాటిల్లిన ప్రాంతాల్లోని రైతులకు 80 శాతం సబ్సిడీపై విత్తనాలు అందజేయాలని సీఎం జగన్ ఆదేశించారు.

    ఇక నివర్ తుపాను ఏపీలో భారీ బీభత్సం సృష్టించింది. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు 8 జిల్లాలు వణికిపోయాయి. చిత్తూరు, నెల్లూరు, కడప జిల్లాలు తుపాను ధాటికి విలవిలలాడగా ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ఈ ప్రభావం కనిపించింది. తుఫాన్ ప్రభావం చిత్తూరు జిల్లాపై ఎక్కువగా కనిపించింది..తిరుపతి సహా తూర్పు మండలాల్లో పెద్దఎత్తున నీరు చేరింది. తిరుమలలోని శ్రీవారి ఆలయం పరిసరాల్లో వరద పారింది. గూడూరు-మనుబోలు మధ్యలో ఆదిశంకర కాలేజీ దగ్గర చెన్నై-కోల్‌కత జాతీయ రహదారిపై రాకపోకలు స్తంభించాయి. వెంకటగిరి-రాపూరు మార్గంలో లింగసముద్రం వద్ద వంతెన కూలిపోగా.. మన్నేగుంట, వెంకటగిరిపాళెం-కోట మార్గాల్లో వంతెనలు కొట్టుకుపోయాయి.. పలు గ్రామాలు నీట మునిగాయి. అక్కడక్కడా స్తంభాలు నేలకూలి విద్యుత్తుశాఖకు సుమారు నష్టం వాటిల్లింది.

    గూడూరు పట్టణ పరిసరాలు జలదిగ్బంధంలో చిక్కుకుంటున్నాయి. కడప జిల్లా రాయచోటి, రాజంపేట, రైల్వేకోడూరు, బద్వేలు, కమలాపురం నియోజకవర్గాల్లో రెండు రోజులుగా భారీ వర్షాలు పడ్డాయి. మిగిలిన ప్రాంతాల్లోనూ ఎడతెరిపి లేకుండా మోస్తరు వర్షపాతం నమోదైంది. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలకు పంట నష్టం జరిగింది. అలాగే లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఇటు ప్రకాశం జిల్లాను వర్షాలు ముంచెత్తాయి. కుండపోత వానలతో జనజీవనం స్తంభించింది. ఉలవపాడు, కందుకూరు, కొత్తపట్నం,నాగులుప్పలపాడులో భారీ వర్షాలు కురిశాయి.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, Cyclone Nivar

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు