COMMUNISTS PARTIES NOT PARTICIPATE PAWAN KALYAN VISHAKHA LONG MARCH TA
జనసేనాని పవన్ కళ్యాణ్‌కు మరో భారీ షాక్..
పవన్ కల్యాణ్ (twitter/photo)
తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమస్యను పరిష్కరించడంలో మధ్యవర్తిత్వం వహిస్తానని చెప్పిన జనసేనాని పవన్ కళ్యాణ్ తెలంగాణ సీఎం కేసీఆర్ అపాయింట్మెంట్ కోసం ప్రయత్నిస్తే తీవ్ర నిరాశే ఎదురైంది. తాజాగా పవన్ కళ్యాణ్‌కు మరో భారీ షాక్ తగిలింది.
తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమస్యను పరిష్కరించడంలో మధ్యవర్తిత్వం వహిస్తానని చెప్పిన జనసేనాని పవన్ కళ్యాణ్ తెలంగాణ సీఎం కేసీఆర్ అపాయింట్మెంట్ కోసం ప్రయత్నిస్తే తీవ్ర నిరాశే ఎదురైంది. ఆ తర్వాత కేటీఆర్, ఇతర మంత్రుల అపాయింట్ కోసం ప్రయత్నించిన లాభం లేకపోయింది. తెలంగాణ ప్రభుత్వ పెద్దలతో మాట్లాడాలనుకున్న పవన్ కళ్యాణ్‌కు పెద్ద షాక్ తగిలింది. ఇది మరిచిపోయకముందే.. జనసేనానికి మరో భారీ షాక్ తగిలింది. ఈ ఆదివారం ఇసుక పాలసీ విషయమై విశాఖ పట్నంలో తలపెట్టిన లాంగ్ మార్చ్‌కు రాలేమని చెప్పి కామ్రేడ్లు జనసేనాని షాక్ ఇచ్చారు. జనసేన తలపెట్టిన ఈ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్.. టీడీపీ, బీజేపీ మద్దతు కోరారు. అంతేకాదు ఆయా పార్టీలకు చెందిన నేతలు ఈ లాంగ్ మార్చ్‌లో పాల్గొనబోతున్నట్టు ప్రకటించారు. జనసేన తలపెట్టిన ఈ కార్యక్రమానికి భారతీయ జనతా పార్టీ హాజరుకానుండంతో కమ్యూనిస్టు పార్టీలు.. బీజేపీలో వేదికను పంచుకునే ప్రసక్తి లేదనన్నారు. అందుకే పవన్ కళ్యాణ్ తలపెట్టిన లాంగ్ మార్చ్‌కు రాలేమని పవన్ కళ్యాణ్‌కు లేఖ విడుదల చేసారు.
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.