హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు కమిటీ.. సభ్యులు వీళ్లే

ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు కమిటీ.. సభ్యులు వీళ్లే

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

AP New Districts: కొత్త జిల్లాల ఏర్పాటుకు వనరులు, తీసుకోవాల్సిన చర్యలపై కమిటీ అధ్యయనం చేయనుంది.

  ఏపీలో జిల్లాల పునర్విభజన చేపట్టి మొత్తం 25 జిల్లాలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కొద్దిరోజుల క్రితం జరిగిన కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకుంది. ఇందుకు తగ్గట్టుగానే కొత్త జిల్లాల ఏర్పాటుకు తొలి అడుగు పడింది. జిల్లాల పునర్విభజనపై కమిటీ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సీఎస్ నీలం సాహ్ని అధ్యక్షతన ఏర్పాటైన కమిటీలో ఆరుగురు సభ్యులు ఉంటారు. ఇందులో సీసీఎల్ఏ కమిషనర్, జీఏడీ కార్యదర్శి, ప్రణాళికశాఖ కార్యదర్శి, సీఎంవో అధికారి, ప్రిన్సిపల్ ఫైన్సాన్స్ సెక్రటరీ సభ్యలుగా కొనసాగుతారు. కొత్త జిల్లాల ఏర్పాటుకు వనరులు, తీసుకోవాల్సిన చర్యలపై కమిటీ అధ్యయనం చేయనుంది. దీంతో పాటు జిల్లాల సరిహద్దులు, జిల్లాలో వనరుల సమతూకం సహా ఇతర అంశాలపై కమిటీ చర్చించనుంది. ఈ కమిటీ మూడు నెలల్లో నివేదిక సమర్పించాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.

  AP New districts, committee on ap new district, Andhra Pradesh, Neelam Saahni, ఏపీ కొత్త జిల్లాలు, ఏపీ కొత్త జిల్లాల ఏర్పాటుపై కమిటీ, నీలం సాహ్ని, ఏపీ న్యూస్
  ఏపీ సీఎస్ నీలం సాహ్ని

  ఒక్కో లోక్ సభ నియోజకవర్గం ఒక్కో జిల్లాగా ఏర్పాటు చేయాలనే ఉద్దేశ్యంతో ఏపీ ప్రభుత్వం ఈ కమిటీని ఏర్పాటు చేసినట్టు స్పష్టంగా అర్థమవుతోంది. ప్రభుత్వం సూచించిన విధంగానే కమిటీ నివేదిక రూపొందిస్తే... ఏపీలో మొత్తం 25 జిల్లాలు ఏర్పాటు కావడం దాదాపు ఖాయమే. అయితే ఏపీలోని ఆ ఒక్క లోక్ సభ నియోజకవర్గం విషయంలో మాత్రం జగన్ సర్కార్ రెండో ఆలోచన చేస్తోందనే వాదన వినిపిస్తోంది. అదే విశాఖలోని అరకు లోక్ సభ నియోజకవర్గం.

  విస్తీర్ణం పరంగా అది పెద్ద లోక్ సభ నియోజకవర్గంగా గుర్తింపు తెచ్చుకున్న అరకు పార్లమెంట్ స్థానం మొత్తం నాలుగు జిల్లాల్లో విస్తరించింది. నియోజకవర్గంలోని పాలకొండ శ్రీకాకుళం జిల్లాలో ఉండగా, సాలూరు, కురుపాం, పార్వతీపురం నియోజకవర్గాలు విజయనగరం జిల్లాలో ఉన్నాయి. అరకు, పాడేరు విశాఖపట్నం జిల్లాలో కొనసాగుతుండగా, రంపచోడవరం మాత్రం తూర్పు గోదావరి జిల్లా పరిధిలో ఉంది. ఇలా ఒక లోక్ సభ నియోజకవర్గం నాలుగు జిల్లాల్లో విస్తరించి ఉండటం... అందులోనూ ఈ నియోజకవర్గంలో గిరిజన జనాభా ఎక్కువ ఉండటంతో అరకు జిల్లా ఏర్పాటు విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే దానిపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది.

  AP New districts, committee on ap new district, Andhra Pradesh, Neelam Saahni, ఏపీ కొత్త జిల్లాలు, ఏపీ కొత్త జిల్లాల ఏర్పాటుపై కమిటీ, నీలం సాహ్ని, ఏపీ న్యూస్
  సీఎం జగన్(ఫైల్ ఫోటో)

  అయితే అరకు జిల్లా అంశంపై కేబినెట్‌లోనే కొందరు సీఎం జగన్ దృష్టికి తీసుకొచ్చారని తెలుస్తోంది. అరకు జిల్లా భౌగోళికంగా ఎక్కువ విస్తీర్ణంపై చర్చ జరగ్గా... అరకును రెండు జిల్లాలు చేసేందుకు అధ్యయనం చేయాలని సీఎం జగన్ అధ్యయన కమిటీకి సూచించారని తెలుస్తోంది. వెనుకబడ్డ ప్రాంతాల అభివృద్ధే లక్ష్యంగా కొత్త జిల్లాల ఏర్పాటు ఉండాలని ఆయన చెప్పినట్టు సమాచారం. దీంతో మిగతా జిల్లాల ఏర్పాటు సంగతి ఎలా ఉన్నా... అరకు విషయంలో మాత్రం ప్రభుత్వం కాస్త భిన్నమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది.

  Published by:Kishore Akkaladevi
  First published:

  Tags: Andhra Pradesh, AP new districts

  ఉత్తమ కథలు