AP Weather Report: వరుణ దేవుడు దూకుడు చూపిస్తున్నాడు. తెలుగు రాష్ట్రాల (Telugu States)ను భారీ వానలు ముంచెత్తుతున్నాయి. తూర్పు మధ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాలలో ఏర్పడి ఉన్న ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా మారిందని అమరావతి (Amaravathi) వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. దీంతో అది ఇంకాస్త బలపడి రాగల 12 గంటలలో తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఆ తరువాత 48 గంటలలో ఇది పశ్చిమ-వాయువ్య దిశగా ఒడిశా తీరం వైపు ప్రయాణించే అవకాశం ఉందన్నారు. ఇక ఉపరితల ఆవర్తనం దక్షిణ కోస్తాంధ్ర, దాని పరిసర ప్రాంతాలలో సగటు సముద్రమట్టానికి 1.5 కిలోమీటర్ల నుంచి 2.1 కిలోమీటర్ల ఎత్తుల మధ్య విస్తరించి ఉందన్నారు. రాయలసీమ (Rayalaseema) నుంచి కొమరిన్ ప్రాంతం వరకు సగటు సముద్రమట్టం నుండి 0.9 కిలోమీటర్ల ఎత్తు వరకు ఏర్పడిన ‘ఉపరితల ద్రోణి’ బలహీనపడిందని అధికారులు తెలిపారు. అలాగే.. తెలంగాణ, దాని పరిసర ప్రాంతాలలో సగటు సముద్రమట్టానికి 3.1 కిలోమీటర్ల నుంచి 4.5 కిలోమీటర్ల ఎత్తుల మధ్య ఏర్పడిన ‘ఉపరితల ఆవర్తనం’ బలహీనపడిందన్నారు.
తాజా అల్ప పీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh), తెలంగాణ (Telangana) ల్లో భారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశం ఉందన్న వాతావరణ కేంద్రం అధికారులు.. ఆ మేరకు రాగల మూడు రోజులకు సంబంధించి వాతావరణ నివేదికను ప్రకటించారు. దీని ప్రకారం.. ఇవాళ ఉత్తర కోస్తాంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్ని ప్రదేశాలలో కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉత్తరాంధ్రలో భారీ వర్షలు కురిసే అవకాశం ఉంది. శ్రీకాకుళం (Srikakulam), విజయనగరం (Viziangaram)జిల్లాలలో ఈ మూడు రోజుల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది.
ఇదీ చదవండి: కదులుతోన్న డొంక.. ప్రధాన నిందితులు అరెస్ట్.. స్కామ్ ఎలా చేశారంటే..?
శనివారం నాడు ఉత్తర కోస్తాంధ్రాలో ఉరుములు, మెరుపులుతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలా ప్రదేశాలలో కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం, తూర్పుగోదావరి జిల్లాలలో భారీవర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. ఆదివారం కూడా ఇలాంటి వాతావరణ పరిస్థితులు ఉంటాయని అధికారులు పేర్కొన్నారు. ఆ రోజు ఉత్తర కోస్తాంధ్రాలో ఉరుములు, మెరుపులుతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురుసే అవకాశం ఉంది.
విశాఖపట్టణం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాలలో భారీ నుండి అతిభారీవర్షాలు కురుస్తాయన్నారు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలలో అక్కడక్కడ భారీవర్షాలు కురిసే అవకాశం ఉంది. దక్షిణ కోస్తాంధ్రాలో ఇవాళ, రేపు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే ఛాన్స్ ఉంది. ఆదివారం నాడు దక్షిణ కోస్తాంధ్రాలో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలా ప్రదేశాల్లో కురిసే అవకాశం ఉంది.
కృష్ణా, గుంటూరు జిల్లాలలో భారీ నుండి అతి భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. రాయలసీమలోనూ అదే పరిస్థితి ఉండనుందన్నారు. ఇవాళ రాయలసీమలో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్ని ప్రదేశాల్లో కురిసే అవకాశం ఉంది. శనివారం, ఆదివారం నాడు రాయలసీమతో పాటు.. తెలంగాణలోని పలు జిల్లాల్లో పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Heavy Rains, Rains, Weather report