అమరావతి పెయిడ్ ఆర్టిస్ట్స్ వ్యవహారంపై టాలీవుడ్లోని వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. తనపై పోసాని కృష్ణమురళి చేసిన విమర్శలకు వైసీపీ నేత, svbc ఛైర్మన్ పృథ్వీ కౌంటర్ ఇచ్చారు. అమరావతి ఆందోళనలపై వైసీపీ రాష్ట్ర కార్యదర్శి హోదాలోనే మాట్లాడానని స్పష్టం చేశారు. అమరావతి ఆందోళనల్లో పెయిడ్ ఆర్టిస్టులు ఉన్నారని మరోసారి కామెంట్ చేశారు. వారికి క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదని.. ఎవరికీ సంజాయిషీ చెప్పాల్సిన అవసరం కూడా లేదని తెగేసి చెప్పారు. రైతులను తాను అవమాన పరచలేదని.. కేవలం బినామీ రైతులైన పెయిడ్ ఆర్టిస్టులపై మాత్రమే విమర్శలు చేశానని క్లారిటీ ఇచ్చారు. రైతులంటే తనకు గౌరవం ఉందన్నారు పృథ్వీ రాజ్. అమరావతిలో బినామీ రైతులు మీకు కనబడలేదా అంటూ పోసానిపై విమర్శలు గుప్పించారు.
గురువారం 30 ఇయర్స్ పృథ్వీ రాజ్ మీద నటుడు పోసాని కృష్ణమురళి తీవ్రంగా మండిపడ్డారు. రాజధానిలో రైతులు, మహిళల మీద పృథ్వీ అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధానిలో రైతుల ఆందోళనలను ఉద్దేశించి పృథ్వీ ఇటీవల మాట్లాడుతూ.. ‘రైతులు ఎవరైనా ఆడి కార్లలో తిరుగుతారా?, బంగారు గాజులు వేసుకుని ధర్నాలు చేస్తారా?’ అంటూ విమర్శలు గుప్పించారు. అయితే, ఈ వ్యాఖ్యలను పోసాని ఖండించారు. రైతులకు కార్లు ఉండకూడదా? అని ప్రశ్నించారు. పొలం పనిచేసే మహిళలు బంగారు గాజులు కొనుక్కోకూడదనా? అని నిలదీశారు. రైతులను పెయిడ్ ఆర్టిస్టులు అన్నంతుకు పృథ్వీ సిగ్గు పడాలని.. పృథ్వీకి ఏ మాత్రం నైతిక విలువలు ఉన్నా వెంటనే రాజధానిలో మహిళలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తాజాగా పోసాని వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు పృథ్వీ రాజ్.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Comedian prudhvi raj, Posani Krishna Murali, Tollywood, Ysrcp