హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

TDP Internal War: పార్టీని నడిపించాల్సిన బాధ్యత ఆ ఇద్దరిదే? వర్గ పోరుతో ఢీ అంటే ఢీ అంటున్నారు.? కారణం ఏంటి..?

TDP Internal War: పార్టీని నడిపించాల్సిన బాధ్యత ఆ ఇద్దరిదే? వర్గ పోరుతో ఢీ అంటే ఢీ అంటున్నారు.? కారణం ఏంటి..?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

TDP Internal War: ఒకరు ప్రస్తుత అధ్యక్షుడు.. మరొకరు మాజీ అధ్యక్షుడు.. రాష్ట్రంలో పార్టీని నడిపించాల్సిన బాధ్యత కూడా వారిద్దరిదే.. కానీ ఆ ఇద్దరే ఇప్పుడు పార్టీని కష్టాల్లోకి నెడుతున్నారు.. దీంతో తెలుగు తమ్ముళ్లు పరేషాన్ అవుతున్నారా..? ఇంతకీ వారిద్దరి మధ్య గొడవలకు కారణం ఏంటి..?

ఇంకా చదవండి ...

TDP Internal War: గత ఎన్నికలముందు ఆ జిల్లాల్లో తెలుగు దేశం పార్టీ (Telugu Desam Party)దే ఆదిపత్యం.. ఆ జిల్లా టీడీపీ కంచుకోట లాంటింది. జాతీయ స్థాయి నేతలను అందించింది ఆ జిల్లా.. అలాంటి జిల్లాలో గత ఎన్నికల్లో టీడీపీ కేవలం రెండు సీట్లకే పరిమితం అయ్యింది. ఫ్యాన్ గాలీ ముందు సైకిల్ నిలబడలేకపోయింది.  అధికారం కోల్పోయిన తరువాత పార్టీ నేతలు మరింత కష్టపడాల్సి ఉంటుంది. కానీ అక్కడ నేతల్లో అధికారం కోల్పోయినా మార్పు రావడంలేదా? ఆధిపత్య పోరుతో పార్టీ ప్రతిష్ట మంటగలుపుతున్నారా? కీలక నేతలే సొంతగూటిలో చీలికలకు కారణం అవుతున్నారా..? పార్టీ ఇమేజ్ డ్యామేజ్ అవుతున్నా.. స్వార్థంగా ఆలోచిస్తున్నారా..? ఇంతకీ ఎవరా నాయకులు.. తెరవెనుక వేస్తున్న ఎత్తుగడలేంటి?

తెలుగు దేశం పార్టీకి కంచుకోట సిక్కోలు జిల్లా. పార్టీ ఆవిర్భావం నుంచి ఇక్కడి ప్రజలు అండగా ఉండి.. మెజార్టీ స్థానాలు కట్టబెడుతున్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ (YCP) గాలిలో చాలా జిల్లాల్లో క్వీన్ స్వీప్ అయినా.. ఈ జిల్లా నుంచి ఒక ఎంపీ.. ఇద్దరు ఎమ్మెల్యేలు టీడీపీ నుంచి గెలిచారు. ఇంకొన్నిచోట్ల స్వల్ప ఓట్ల తేడాతో టీడీపీ అభ్యర్థులు ఓడిపోయారు. పార్టీకి గట్టిపట్టున్న శ్రీకాకుళం జిల్లా (Srikakulam District)పై చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) కూడా అంతే ప్రేమను చూపిస్తున్నారు. అధికారంలో ఉన్నా.. లేకున్నా.. స్థానిక నేతలకు ప్రాధాన్యం తగ్గడం లేదు. ఏపీ టీడీపీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన ఇద్దరు నాయకులు శ్రీకాకుళం జిల్లా  (Srikakulam)కు చెందిన వారే. ప్రస్తుత ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు (Atchannaidu), గత అధ్యక్షుడు కిమిడి కళావెంకట్రావు (Kimidi Kala Venkata Rao) ఇద్దరూ జిల్లాలో రాజకీయంగా బలం ఉన్న నాయకులే. అధిష్టానం నమ్మి బాధ్యతలు అప్పగించింది. అలాంటప్పుడు పార్టీ కష్టల్లో ఉంటే.. గాడిలో పెట్టాల్సిన బాధ్యత ఆ ఇద్దరు నేతల.. కానీ వారిద్దరి మధ్య కోల్డ్ వార్ తో తెలుగు తమ్ముళ్లు ఇబ్బంది పడుతున్నారు.

ఇదీ చదవండి : ఏపీలో ఉన్నామా..? ఉక్రైన్ లో ఉన్నామా..? సర్కార్ ను ప్రశ్నించిన లోకేష్

అచ్చెన్న, కళావెంకట్రావుల మధ్య టామ్‌ అండ్‌ జెర్రీ పోరాటం టీడీపీకి కూడా తలనొప్పిగా మారిందట. ఎప్పటి నుంచో ఇద్దర మధ్య ఆధిపత్యపోరు ఉన్నా.. ప్రస్తుతం అది ముదిరింది అంటున్నారు. జిల్లా రాజకీయాలను తన కనుసన్నల్లో నడపాలని అచ్చెన్న తెరవెనక పావులు కుదుపుతున్నరన్నది కళా వర్గం టాక్. అవే పార్టీలో దుమారం రేపుతున్నాయి. అధికారపార్టీ వర్సెస్‌ విపక్ష పార్టీగా ఉండాల్సిన రాజకీయం.. సొంతపార్టీ నేతల మధ్య వర్గ పోరుగా మారింది.

ఇదీ చదవండి : ఆయనతో అంత ఈజీ కాదా..? పోలీసులకు సవాల్ విసురుతున్న మాజీ మంత్రి

కళా వర్గానికి చెందిన కొందరు కీలక నేతలను అచ్చెన్న టార్గెట్ చేస్తూ వెనక గోతులు తవ్వుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఎచ్చెర్ల, పాలకొండ, శ్రీకాకుళం, రాజాం నియెజకవర్గాలలో పార్టీ బాధ్యులుగా ఉన్నవారికి అచ్చెన్నఎసరు పెడుతున్నట్టు కళావర్గం ఆరోపిస్తోంది. రాజాం మినహా మిగతాచోట్ల ఉన్న పార్టీ ఇంఛార్జ్‌లు కళావెంకట్రావు అనుచరులుగా ముద్ర ఉంది. దీంతో వారందర్నీ అచ్చెన్న పక్కన పెడుతున్నారన్నది వారి వాదన. అయితే ఈ రివర్స్‌ పాలిటిక్స్ కొనసాగినంత కాలం టీడీపీ జిల్లాలో కుదటపడదని తెలుగు తమ్ముళ్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

First published:

Tags: Andhra Pradesh, AP News, Kinjarapu Atchannaidu, Srikakulam, TDP

ఉత్తమ కథలు