ఏపీలో పట్టాలు తప్పిన కేరళ ఎక్స్‌ప్రెస్

news18-telugu
Updated: November 17, 2019, 9:02 AM IST
ఏపీలో పట్టాలు తప్పిన కేరళ ఎక్స్‌ప్రెస్
ఏపీలో పట్టాలు తప్పిన రైలు (ఫైల్ ఫోటో)
  • Share this:
హైదరాబాద్ కాచిగూడ రైలు ప్రమాదం మరిచిపోకముందే..ఏపీలో మరో ట్రైన్ యాక్సిడెంట్ జరిగింది. తిరుపతిలో కేరళ ఎక్స్ ప్రెస్ కు తృటిలో పెనుప్రమాదం తప్పింది. న్యూఢిల్లీ నుంచి త్రివేండం వెళుతున్న కేరళ ఎక్స్ ప్రెస్ తిరుపతి ఏర్పేడు రైల్వే స్టేషన్ కూతవేటు దూరంలో పట్టాలు తప్పింది. ప్యాంట్రి కార్ భోగి చక్రం విరిగిపోవడంతో పెను ప్రమాదం తప్పింది.ఈ ఘటనలో బీ2 బోగి పట్టాలు తప్పింది.

ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న రైల్వే సిబ్బంది మరమ్మత్తులు చేపట్టారు. అయితే ప్రమాదం పై రైల్వే ఉన్నతాధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ దర్యాప్తులో కేరళ ఎక్స్ ప్రెస్ లోకో పైలైట్ చాకిచక్యంగా ట్రైన్ నిలిపివేయడంతో ప్రమాదం తప్పిందన్నారు. లేదంటే భారీ ఎత్తున ప్రాణనష్టం జరిగి ఉండేదని రైల్వే పోలీసులు చెబుతున్నారు. ప్రమాదం నుంచి తృటిలో బయటపడటంతో ప్రయాణికులు సైతం ఊపిరి పీల్చుకున్నారు.
First published: November 17, 2019, 9:02 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading