తొలి ఏడాది సంక్షేమం... సీఎం జగన్ నాలుగేళ్ల లక్ష్యాన్ని వెల్లడించిన వైసీపీ

ఏపీ ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించి ఈ రోజుకు ఏడాది పూర్తయింది. ఈ సందర్భంగా వైసీపీ ఫుల్ హ్యాపీగా ఉంది.

news18-telugu
Updated: May 23, 2020, 4:07 PM IST
తొలి ఏడాది సంక్షేమం... సీఎం జగన్ నాలుగేళ్ల లక్ష్యాన్ని వెల్లడించిన వైసీపీ
సీఎం జగన్
  • Share this:
ప్రజలకు సేవ చేయగల సత్తా, మొండి ధైర్యం ఉన్న నేత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అని పార్టీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. తొలి ఏడాది పాలన సంక్షేమం దిశగా సాగిందని, ఇంకా నాలుగేళ్లలో ప్రజలకు ఎలా మంచి చేయాలనే దానిపై అలోచన చేస్తున్నారని, వచ్చే నాలుగేళ్లలో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ప్రథమ స్థానంలో ఉంచాలని ముఖ్యమంత్రి చూస్తున్నారన్నారు. ప్రజలకు ఏ కష్టం వచ్చినా వెంటనే స్పందించే గుణం సీఎం జగన్‌దని కొనియాడారు. వైఎస్సార్‌సీపీకి ప్రజలు అఖండమైన విజయాన్ని అందించి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి విగ్రహానికి పార్టీ నేతలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో సజ్జల రామకృష్ణారెడ్డి, ఇతర పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Corona virus, Chandrababu naidu, tdp, sajjala Ramakrishna reddy, ysrcp, ap news, కరోనా వైరస్, చంద్రబాబునాయుడు, సజ్జల రామకృష్ణారెడ్డి, వైసీపీ, టీడీపీ ఏపీ న్యూస్
సజ్జల రామకృష్ణారెడ్డి(ఫైల్ ఫోటో)


‘సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలనే కాకుండా ఇవ్వని హామీలను కూడా సీఎం జగన్ అమలు చేశారు. విద్య వైద్య రంగానికి పెద్ద పీట వేశారు. కార్పొరేట్ వ్యవస్థకు దీటుగా విద్య వైద్య రంగాన్ని సీఎం జగన్ రూపొందిస్తున్నారు. పేదల పిల్లల కోసం ఇంగ్లీషు మీడియం విద్యను తీసుకొచ్చారు. పేదలకు ఇళ్ళు స్థలాలు ఇస్తున్నారు. టీడీపీ హయాంలో టీడీపీ వాళ్ళకే పథకాలు అందేవి. సీఎం జగన్‌ పాలనలో అర్హులైన వారందరికీ పథకాలు అందుతున్నాయి. పాలన ఎలా ఉండాలో జగన్‌మోహన్‌రెడ్డి చూపించారు. ఎల్జీ పాలిమర్స్ విషయంలో బాధితులను ముఖ్యమంత్రి పెద్ద మనసుతో ఆదుకున్నారు.’ అని సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు.

ఏడాది పూర్తయిన రోజు పార్టీ జెండా ఆవిష్కరణలతో పాటు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించాలని తొలుత భావించామని, అయితే కరోనా నేపథ్యంలో రాజకీయ పరమైన కార్యక్రమాలు నిర్వహించడం మంచిది కాదని, జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు చేపట్ట వద్దని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు.
First published: May 23, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading