ఆ నాలుగు పదవులు వారికే... తేల్చేసిన సీఎం జగన్

నాలుగు ఎమ్మెల్సీ స్థానాలను సీఎం జగన్ ఎవరికి కేటాయిస్తారనే దానిపై ఆసక్తి నెలకొంది.

news18-telugu
Updated: July 13, 2020, 6:35 AM IST
ఆ నాలుగు పదవులు వారికే... తేల్చేసిన సీఎం జగన్
సీఎం జగన్(ఫైల్ ఫోటో)
  • Share this:
ఏపీ శాసనమండలిలో ఖాళీగా ఉన్న నాలుగు ఎమ్మెల్సీ పదవులు ఎవరికి దక్కబోతున్నాయనే దానిపై సీఎం జగన్ ఓ క్లారిటీకి వచ్చినట్టు తెలుస్తోంది. ఇటీవల రాజ్యసభకు వెళ్లిన మాజీమంత్రులు పిల్లి సుభాష్ చంద్రబోస్‌, మోపిదేవి వెంకటరమణతో పాటు కంతేటి సత్యనారాయణరాజు, రత్నాబాయి పదవీకాలం ముగిసింది. వీటిలో రెండు గవర్నర్ కోటాలోని పదవులు. వాటికి ఎన్నికలు అవసరం లేదు. ప్రభుత్వం ఎవరిని నామినేట్ చేస్తే... వాళ్లు ఎమ్మెల్సీ అవుతారు. దీంతో ఈ నాలుగు ఎమ్మెల్సీ స్థానాలను సీఎం జగన్ ఎవరికి కేటాయిస్తారనే దానిపై ఆసక్తి నెలకొంది.

అయితే గవర్నర్ కోటాలో ఎంపిక చేసే రెండు స్థానాల్లో ఒకటి ఎస్సీలకు, ఒకటి మైనార్టీలకు కేటాయించాలని ఫిక్సయిన సీఎం జగన్... మాజీమంత్రులు పిల్లి సుభాష్ చంద్రబోస్‌, మోపిదేవి వెంకటరమణ రాజీనామాలతో ఖాళీ అయిన స్థానాలను బీసీ వర్గాలకు కేటాయించాలని దాదాపుగా నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. బోస్, మోపిదేవి రాజీనామా వల్ల ఖాళీ అయిన వాటిలో ఒక స్థానం పదవీ కాలం కేవలం 9 నెలలే ఉంది. మరో ఎమ్మెల్సీ పదవీ కాలం రెండేళ్ల పాటు ఉంటుంది. అయితే ఈ రెండు స్థానాలను దక్కించుకోబోయే అభ్యర్థులు ఎవరనేది మాత్రం తెలియాల్సి ఉంది.
Published by: Kishore Akkaladevi
First published: July 13, 2020, 6:35 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading