CM YS JAGAN TO LAUNCH JAGANANNA THODU SCHEME ON MONDAY AS GOVERNMENT PROVIDING ZERO INTEREST LOANS TO STREET VENDORS FULL DETAILS HERE PRN
Jagananna Thodu: మరో పథకానికి సిద్ధమైన ఏపీ ప్రభుత్వం.. వడ్డీ లేకుండానే రూ.10వేలు.. అర్హతలు ఇవే..!
సీఎం జగన్ (ఫైల్)
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వం మరో పథకం అమలుకు సిద్ధమైంది. ఈ ఏడాది ఇప్పటికే ఈబీసీ నేస్తం (EBC Nestham), రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ, జగనన్న చేదోడు పథకాలను (Jagananna Chedodu scheme) అమలు చేసిన ప్రభుత్వం.. మరో పథకం కింద వడ్డీలేని రుణం అందించనుంది.
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వం మరో పథకం అమలుకు సిద్ధమైంది. ఈ ఏడాది ఇప్పటికే ఈబీసీ నేస్తం (EBC Nestham), రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ, జగనన్న చేదోడు పథకాలను (Jagananna Chedodu scheme) అమలు చేసిన ప్రభుత్వం.. మరో పథకం కింద వడ్డీలేని రుణం అందించనుంది. నిరుపేదలైన చిరు వ్యాపారులు, హస్త కళాకారులు, సంప్రదాయ చేతి వృత్తుల వారికి ఒక్కొక్కరికి జగనన్న తోటు పథకం కింద ఏటా రూ.10 వేల చొప్పున వడ్డీ లేని రుణాన్ని అందిస్తోంది. పూర్తి వడ్డీ భారాన్ని ప్రభుత్వమే భరిస్తూ ఒక్కొక్కరికీ రూ.10 వేల చొప్పున 5,10,462 మంది చిరు వ్యాపారులకు రూ. 510.46 కోట్ల వడ్డీ లేని రుణాలు, రూ.16.16 కోట్ల వడ్డీ రీఇంబర్స్మెంట్ కలిపి మొత్తం రూ. 526.62 కోట్లను సీఎం జగన్ బటన్ నొక్కి నేరుగా లబ్ధిదారుల ఖాతాలో జమ చేయనున్నారు.
ఇప్పటివరకు 14,16,091 మంది లబ్ధిదారులకు అందించిన వడ్డీ లేని రుణాలు రూ. 1,416 కోట్లు కాగా.. లబ్ధిదారుల తరపున బ్యాంకులకు తిరిగి చెల్లించిన వడ్డీ రూ. 32.51 కోట్లుగా ఉంది. చిరు వ్యాపారులు రోజువారీ పెట్టుబడి ఖర్చుల కోసం వడ్డీ వ్యాపారుల చుట్టూ తిరగాల్సిన దుస్ధితి లేకుండా, వారి పరిస్ధితి మార్చాలన్న సమున్నత లక్ష్యంతో అర్హులైన ప్రతి ఒక్కరికి వడ్డీ లేని రుణాలు అందిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
లబ్ధిదారులు బ్యాంకులకు కట్టిన వడ్డీ మొత్తాన్ని ప్రతి ఆరు నెలలకోసారి నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ అయ్యేలా ప్రభుత్వమే చెల్లిస్తోంది. రుణం తీరిన తర్వాత లబ్ధిదారులు మళ్ళీ వడ్డీలేని రుణం పొందడానికి అర్హులు. వారికి బ్యాంకులు మళ్ళీ వడ్డీలేని రుణాలు ఇస్తాయని ప్రభుత్వం వెల్లడించింది.
వీరందరికీ జగనన్న తోడు
గ్రామాలు, పట్టణాల్లో సుమారు 5 అడుగుల పొడవు, 5 అడుగుల వెడల్పు స్ధలంలో శాశ్వత లేక తాత్కాలిక షాపులు ఏర్పాటు చేసుకున్న వారు పథకానికి అర్హులుగా ప్రభుత్వం పేర్కొంది. ఫుట్‌పాత్‌ల మీద, వీధుల్లో తోపుడు బండ్ల మీద వస్తువులు, కూరగాయలు, పండ్లు, ఆహార పదార్ధాలు అమ్ముకుని జీవించే వారు, రోడ్ల పక్కన టిఫిన్ సెంటర్లు నిర్వహించేవారు, గంపలు, బుట్టలలో వస్తువులు అమ్మేవారు, సైకిల్, మోటర్ సైకిళ్ళు, ఆటోలపై వెళ్ళి వ్యాపారం చేసుకునేవారికి వడ్డీలేని రుణం అందనుంది. అలాగే చేనేత మరియు సంప్రదాయ చేతివృత్తుల కళాకారులైన ఇత్తడి పని చేసేవారు, బొబ్బలివీణ, ఏటికొప్పాక, కొండపల్లి బొమ్మలు, కలంకారీ, తోలుబొమ్మలు, ఇతర సామాగ్రి తయారీదారులు, లేస్ వర్క్స్, కుమ్మరి తదితర వృత్తులపై ఆధారపడి జీవిస్తున్న వ్యక్తులకు కూడా పథకం వర్తిస్తుందని ప్రభుత్వం తెలిపింది.
అర్హత ఉండీ, జాబితాలో పేర్లు నమోదు కానివారు కంగారు పడాల్సిన పనిలేదని ప్రభుత్వం తెలిపింది. సదరు వ్యక్తులు గ్రామ, వార్డు వలంటీర్లను సంప్రదించవచ్చు లేదా సమీప గ్రామ, వార్డు సచివాలయాలకు వెళ్ళి దరఖాస్తు చేసుకోవచ్చని స్పష్టం చేసింది.
Published by:Purna Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.