Home /News /andhra-pradesh /

CM YS JAGAN TO LAUNCH DISHA VEHICLES AND MOBILE REST ROOMS FOR WOMEN POLICE IN ANDHRA PRADESH FULL DETAILS HERE PRN

Disha Vehicles in AP: మహిళలకు మరో గుడ్ న్యూస్.. రంగంలోకి దిశ వాహనాలు.. ప్రారంభించనున్న సీఎం జగన్

సీఎం జగన్ (ఫైల్)

సీఎం జగన్ (ఫైల్)

మహిళల భద్రత కోసం ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వం మరో ముందడుగు వేయనుంది. ఇప్పటికే దిశ యాప్ (Disha App), దిశ పోలీస్ స్టేషన్లతో వారికి రక్షణ కల్పిస్తున్న ప్రభుత్వం.. దిశ ఫోర్ వీలర్స్ ను అందుబాటులోకి తీసుకొస్తోంది.

    మహిళల భద్రత కోసం ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వం మరో ముందడుగు వేయనుంది. ఇప్పటికే దిశ యాప్ (Disha App), దిశ పోలీస్ స్టేషన్లతో వారికి రక్షణ కల్పిస్తున్న ప్రభుత్వం.. దిశ ఫోర్ వీలర్స్ ను అందుబాటులోకి తీసుకొస్తోంది. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు మరింత చేరువ కావడానికి మరియు మహిళలకు పటిష్టమైన భద్రతను కల్పించడంలో భాగంగా క్షేత్ర స్థాయిలో నేరాలను అరికట్టడం కోసం విజిబుల్ పోలీసింగ్‌ను మెరుగుపరచడం కోసం ఆంధ్ర ప్రదేశ్ పోలీస్ శాఖ దిశ పెట్రోలింగ్‌ ను ప్రారంభించింది.ఇప్పటికే అన్ని పోలీస్ స్టేషన్లకు 900 ద్విచక్ర స్కూటర్లు ప్రభుత్వం అందజేసింది. మహిళలు మరియు పిల్లలకు మరింత సురక్షితమైన వాతావరణాన్ని కల్పించడంతో పాటు పెట్రోలింగ్ ద్వారా ఆపదలో ఉన్న మహిళలు, చిన్నారులకు అవసరమైన సహాయం అందించడం కోసం ఈ వాహనాలను వినియోగిస్తున్నారు. తాజాగా ఫోర్ వీలర్ వాహనాలను కూడా అందించేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. మొత్తం 163 వాహనాలను సీఎం జగన్ బుధవారం లాంఛనంగా ప్రారంభించనున్నారు.

    ఈ వాహనాలన్ని జిల్లా యూనిట్ కంట్రోల్ రూం నుండి నేరుగా ప్రత్యక్ష పర్యవేక్షణకు అనుగుణంగా ప్రత్యేక GPS ట్రాకింగ్ వ్యవస్థతో కూడి ఉంటుంది. మహిళలు, పిల్లలపై జరిగే నేరాలను అరికట్టడానికి ఈ పెట్రోలింగ్ వాహనాలు జనసంచారం తక్కువ ఉన్న సమస్యాత్మక ప్రాంతాలలో నేరం జరిగేందుకు అవకాశం ఉన్న అన్ని ప్రదేశాలలో నిరంతరం పెట్రోలింగ్ నిర్వహిస్తాయి.

    ఇది: తిరుమల లాక్ డౌన్ కు రెండేళ్లు.. శ్రీవారి ఆలయం అప్పుడు.. ఇప్పుడు..


    ప్రస్తుతం ఉన్న 900 ద్విచక్ర వాహనాలు, 163 ఫోర్ వీలర్ దిశ పెట్రోలింగ్ వాహనాలతో పాటు, అత్యవసర పరిస్థితుల్లో పౌరులకు సత్వర ప్రతిస్పందన కోసం 3,000కు పైగా ఎమర్జెన్సీ వాహనాలను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 18 పోలీస్ యూనిట్లలో ఏర్పాటు చేసిన దిశ కంట్రోల్ రూంతో పాటు పోలీస్ ప్రధాన కార్యాలయంలోని కంట్రోల్ రూంకి అనుసంధానించినట్లు ప్రభుత్వం తెలిపింది. దీని ద్వారా మహిళలు తమ మొబైల్ ఫోన్ లో దిశ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకున్నా అనంతరం ఏదైనా సమస్యను ఉత్పన్నమైనప్పుడు తమ చేతిలోని SOS లేదా మొబైల్ ను షేక్ చేయడం ద్వారా భాదితుల వద్దకు చేరుకునే పోలీసులు సమయం పట్టణ ప్రాంతాల్లో ప్రతిస్పందన సమయం 4-5 నిమిషాలు అదే గ్రామీణ ప్రాంతాల్లో 8-10 నిమిషాలకు తగ్గినట్లు వెల్లడించింది. ఇప్పటికే దిశ మొబైల్ అప్లికేషన్ ను 1.16 మంది మహిళలు తమ మొబైల్ ఫోన్ లలో డౌన్ లోడ్ చేసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది.

    ఇది చదవండి: జగన్ సర్కార్ కు షాక్.. ప్రత్యేక హోదాపై తేల్చేసిన కేంద్రం.. పార్లమెంట్ సాక్షిగా..


    దిశ మొబైల్ రెస్ట్ రూమ్స్
    బహిరంగ ప్రదేశాల్లో విధులు నిర్వహించే మహిళా పోలీసుల ఇబ్బందులు పరిష్కరించేందుకు ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. క్షేత్ర స్థాయి విధుల్లో ఉన్న మహిళా పోలీసుల ప్రాథమిక సౌకర్యాలకు కల్పనలో భాగంగా 30 మొబైల్ రెస్ట్ రూంలను ప్రత్యేకంగా రూపొందించి 18 మొబైల్ రెస్ట్ రూంలను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు ప్రభుత్వం వెల్లడించింది.
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, Ap government, Disha police station

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు