బోటు ప్రమాద స్థలికి నేడు జగన్... ఘటనపై ప్రభుత్వం సీరియస్

Godavari Boat Tragedy : ఆంధ్రప్రదేశ్‌లోని కచ్చులూరు దగ్గర గోదావరి నదిలో లాంచీ బోల్తా పడిన ప్రమాదంలో మృతుల సంఖ్య 12కి చేరింది. మృతదేహాల్ని రాజమండ్రి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మరో 30 మంది వరకు గల్లంతైనట్టు తెలుస్తోంది.

Krishna Kumar N | news18-telugu
Updated: September 16, 2019, 6:03 AM IST
బోటు ప్రమాద స్థలికి నేడు జగన్... ఘటనపై ప్రభుత్వం సీరియస్
వైఎస్ జగన్
  • Share this:
Andhra Pradesh : తూర్పుగోదావరి జిల్లా... గోదావరిలో బోటు మునక ప్రమాదానికి సంబంధించి ఉదయం నుంచీ తిరిగి గాలింపు చర్యలు మొదలయ్యాయి. NDRF, SDRF, నేవీ, గజ ఈతగాళ్ల టీమ్స్ గాలింపు చర్యల్లు తలమునకలయ్యాయి. ప్రమాదం జరిగిన సమయంలో మొత్తం 60 నుంచీ 71 మంది దాకా ప్రయాణికులు బోటులో ఉన్నట్టు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఎంత మంది అన్నదానిపై క్లారిటీ లేదు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో... గోదావరి నది అత్యంత లోతుగా... 250 అడుగుల వరకూ ఉంటుందని చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో... ఏపీ సీఎం వైఎస్ జగన్... ఇవాళ ఘటనాస్థలికి వెళ్లబోతున్నా్రు. సహాయక చర్యలు ఎలా కొనసాగుతున్నాయో, అసలు ప్రమాదం ఎలా జరిగిందో, ఎందుకు జరిగిందో స్పష్టంగా తెలుసుకోనున్నారు. ఇకపై ఇలా జరగకుండా ఉండేందుకు ఏం చెయ్యాలన్న దానిపై ముఖ్యమంత్రి కచ్చితమైన ఆదేశాలు జారీ చేస్తారని తెలుస్తోంది. ఇప్పటికే జగన్... సహాయ చర్యలు వేగంగా చేపట్టాలని ఆదేశించారు. నేవీ, ONGC హెలికాప్టర్ల సాయం తీసుకోవాలని సూచించారు. సీఎం ఆదేశాలతో అందుబాటులో ఉన్న మంత్రులు ఘటనాస్థలికి వెళ్లి... సహాయ చర్యల్ని పర్యవేక్షించారు.

ప్రభుత్వ తక్షణ ఆదేశాలు ఇవీ :

- ఇకపై గోదావరిలో వెళ్లే అన్ని బోట్లూ ప్రయాణానికి అనుకూలమో కాదో పరిశీలిస్తారు.
- ప్రతీ బోటుకూ పూర్తిస్థాయి తనిఖీలు జరుగుతాయి.
- లైసెన్స్ ఉందా, లేదా, అది అప్‌డేటెడ్‌గా ఉందా లేదా అన్నది తెలుసుకుంటారు.
- బోటు నడిపేవారికీ, అందులో పనిచేసేవారికీ తగిన ట్రైనింగ్ ఇచ్చారో లేదో తెలుసుకుంటారు.
- బోట్లలో అన్ని సదుపాయాలూ ఉన్నాయో లేదో తెలుసుకుంటారు. ప్రమాదం జరిగితే, ప్రయాణికులను రక్షించేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నదీ స్పష్టంగా తెలుసుకుంటారు.- నిపుణుల కమిటీ ఒకటి... పూర్తిస్థాయి నివేదికను త్వరలో ముఖ్యమంత్రికి ఇవ్వనుంది.
First published: September 16, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading