Home /News /andhra-pradesh /

CM YS JAGAN TELLS GOOD NEWS FOR WORK FROM HOME EMPLOYS IN ANDHRA PRADESH AND TO FORM DIGITAL LIBRARIES IN EACH VILLAGE FULL DETAILS HERE PRN

Andhra Pradesh: వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగులకు సీఎం జగన్ గుడ్ న్యూస్... ఇకపై ప్రతి గ్రామంలో హై స్పీడ్ ఇంటర్నెట్…

ఏపీ సీఎం జగన్(ఫైల్ ఫొటో)

ఏపీ సీఎం జగన్(ఫైల్ ఫొటో)

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో వర్క్ ఫ్రమ్ హోమ్ (Work From Home) కాన్సెప్ట్ ను బలోపేతం చేసే దిశగా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) అధికారులను ఆదేశించారు.

  ఆంధ్రప్రదేశ్ లో వర్క్ ఫ్రమ్ హోమ్ కాన్సెప్ట్ ను బలోపేతం చేసే దిశగా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఐటీ, వైఎస్ఆర్ డిజిటల్ లైబ్రరీలపై తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో మంత్రులు, అధికారులతో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు సీఎం జగన్ కీలక ఆదేశాలిచ్చారు. ప్రస్తుతం ఐటీ కంపెనీల్లో అమలవుతున్న వర్క్ ఫ్రమ్ విధానాన్ని బలోపేతం చేసేలా సౌకర్యాలు మెరుగుపరచాలన్నారు. గ్రామాలకు మంచి సామర్ధ్యం ఉన్న ఇంటర్నెట్‌ను తీసుకెళ్లేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. ప్రైమరీ, సెకండరీ ఎడ్యుకేషన్‌తోపాటు గ్రాడ్యుయేట్‌ స్టూడెంట్స్‌కు ఉపయోగకరంగా ఉండేలా డిజిటల్‌ లైబ్రరీలను తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు. డిజిటల్‌ లైబ్రరీల్లో కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్టులతో పాటు అన్ని రకాల పోటీ పరీక్షలకు స్టడీ మెటీరియల్‌ అందుబాటులో ఉంచుతామన్నారు. అలాగే గ్రామ సచివాలయాలకు, రైతు భరోసా కేంద్రాలకూ ఇంటర్నెట్‌ కనెక్షన్‌ ఇవ్వాలన్నారు.

  ప్రతి గ్రామ పంచాయితీలోనూ డిజిటల్‌ లైబ్రరీలను ఏర్పాటు చేసి అక్కడి నుంచే పనిచేసుకునే సదుపాయం కల్పిస్తామని సీఎం జగన్ అన్నారు. మొదటి విడతలో రాష్ట్రవ్యాప్తంగా 4,530 డిజిటల్‌ లైబ్రరీల నిర్మాణం చేపడతామన్నారు. ఆగస్టు 15న పనులు మొదలుపెట్టేలా కార్యాచరణ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఆలోగా స్థలాలు గుర్తించి హేండ్‌ ఓవర్‌ చేయాలని సీఎం ఆదేశించారు. అదే సమయంలో డిసెంబర్‌ కల్లా డిజిటల్‌ లైబ్రరీల పనులు పూర్తయ్యేలా ప్రణాళిక వేసుకున్నామని అధికారులు సీఎంకు వివరించారు.

  తిరుమలకు వెళ్లే భక్తులకు అలర్ట్... అలా చేస్తే జరిమానా తప్పదు...


  డిజిటల్‌ లైబ్రరీలు– హై క్వాలిటీ ఇంటర్నెట్‌
  డిజిటల్‌ లైబ్రరీ బిల్డింగులో కనీస సదుపాయాలతో పాటు మూడు డెస్క్‌టాపులు, యూపీఎస్, డెస్క్‌టాప్‌ బార్‌కోడ్‌ ప్రింటర్, స్కానర్, లేజర్‌ ప్రింటర్‌, సాఫ్ట్‌వేర్, యాంటీ వైరస్‌ సాఫ్ట్‌వేర్, అన్‌లిమిలెడ్‌ బ్యాండ్‌విడ్త్‌ ఇంటర్నెట్‌ అందుబాటులో ఉంచాలని సీఎం జగన్ స్పష్టం చేశారు. స్టోరేజీకి సంబంధించి డేటా సెంటర్‌ల నిర్మాణం పూర్తి చేసి అందుబాటులో తీసుకురావాలని ఆదేశించారు. మౌలిక సదుపాయాల్లో భాగంగా 3 డెస్క్‌టాప్‌ టేబుల్స్, సిస్టం చెయిర్స్, విజిటర్‌ చెయిర్స్, ట్యూబులైట్స్, ఫ్యాన్‌లు, ఐరన్‌ రేక్స్‌, వార్తాపత్రికలు, మేగజైన్స్‌ డిజిటల్‌ లైబ్రరీల్లో ఏర్పాటు చేయాలని చెప్పారు. తొలివిడతలో భాగంగా 4530 డిజిటల్‌ లైబ్రరీల్లో కనీస సదుపాయాలు, కంప్యూటర్‌ పరికరాలకోసం దాదాపుగా రూ.140 కోట్లకుపైగా ఖర్చుచేయనున్నట్లు వెల్లడించారు.

  ఇది చదవండి: ఏపీలో మళ్లీ తప్పని లాక్ డౌన్.. మధ్యాహ్నం 2గంటల తర్వాత అంతా బంద్.. ఎక్కడంటే..!

  ఈ సమీక్షా సమావేశానికి పరిశ్రమలు, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ శాఖ మంత్రి మేకపాటి గౌతం రెడ్డి, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్స్‌ ముఖ్య కార్యదర్శి జి జయలక్ష్మి, ఇంధనశాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్‌ గిరిజా శంకర్, ఏపీఎస్‌ఎఫ్‌ఎల్‌ ఎండీ ఎం మధుసూధన్‌రెడ్డి, ఆంధ్రప్రదేశ్‌ టెక్నాలజీ సర్వీసెస్‌ ఎండీ ఎం నంద కిషోర్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.
  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, Work From Home

  తదుపరి వార్తలు