హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Andhra Pradesh: మత్తు వదిలించండి.. ఎస్‌ఈబీ అధికారులకు సీఎం జగన్ ఆదేశాలు.. అక్రమ ఇసుకపై ప్రత్యేక ఫోకస్

Andhra Pradesh: మత్తు వదిలించండి.. ఎస్‌ఈబీ అధికారులకు సీఎం జగన్ ఆదేశాలు.. అక్రమ ఇసుకపై ప్రత్యేక ఫోకస్

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి

AP CM Jagan: అక్రమ మద్యం.. మత్తు పదార్థాల రావాణపై సీఎం జగన్ సీరియస్ అయ్యారు. ఎక్సైజ్ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. అలాంటి వారిని ఉపేక్షించవద్దని.. కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. ఇసుక అక్రమ రావాణపైనా సీఎం సీరియస్ అయ్యారు.

ఇంకా చదవండి ...

AP CM Jagan On Special Enforcement Bureau:  అక్రమంగా మద్యం తయారీ, రవాణాపైన ఉక్కుపాదం మోపాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (CM Jagan Mohan Reddy) ఆదేశించారు. మద్యం అక్రమ రవాణా, తయారీకి పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవడానికి ఇదివరకే చట్టాన్ని తీసుకు వచ్చామని, దీన్ని అమలు చేయాలని ఆదేశించారు. స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో (Special Enforcement Bureau)పై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం సమీక్షా సమావేశం నిర్వహించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్‌ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో కార్యకలాపాల ప్రగతిపై అధికారులు సీఎం వైఎస్‌ జగన్‌కు వివరాలు అందించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ కీలక కామెంట్స్ చేశారు. మద్య నియంత్రణలో భాగంగా రేట్లను పెంచామని, మూడింట ఒక వంతు దుకాణాలను మూసివేశామని ముఖ్యమంత్రి చెప్పారు. బెల్టుషాపు లను తీసేశాం. పర్మిట్‌రూమ్‌లను మూసివేయించాం. లిక్కర్‌ సేల్స్‌ నెలకు 34 లక్షల కేసుల నుంచి 21 లక్షల కేసులకు తగ్గాయి. బీరు సేల్స్‌ నెలకు 17 లక్షల కేసుల నుంచి 7 లక్షలకు తగ్గాయి. ఇలాంటి సందర్భంలో అక్రమంగా రవాణా అవుతున్న మద్యాన్ని, మద్యం తయారీని అధికారులు అడ్డుకోవాలని పిలుపు ఇచ్చారు. గంజాయి సాగు, రవాణాను అరికట్టాలని సీఎం ఆదేశించారు. క్రమం తప్పకుండా దాడులు నిర్వహించాలని.. పోలీసు విభాగాల సమన్వయంతో పనిచేయాలని సూచించారు. డ్రగ్స్‌కు వ్యతిరేకంగా విశ్వవిద్యాలయాలు, కాలేజీల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఏ కాలేజీలోనైనా అలాంటి ఉదంతాలు కనిపిస్తే.. అక్కడ ప్రత్యేక దృష్టిపెట్టాలన్న సీఎం ఆదేశించారు. ఆరోగ్యానికి అత్యంత హానికరంగా మారిన గుట్కా విక్రయాలు, రవాణాపైన ఫోకస్ పెట్టాలని సూచించారు.

ఇసుక ఎక్కువ ధరకు అమ్మితే చర్యలు

మరోవైపు ఇసుక అక్రమ రావాణపైనా కీలక ఆదేశాలు జారీ చేశారు. నిర్దేశించిన రేట్లకన్నా ఇసుకను ఎక్కువ ధరకు అమ్మితే చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ సూచించారు. ఎస్‌ఈబీ కాల్‌సెంటర్‌ నంబర్‌పై బాగా ప్రచారం చేయాలని, అధిక రేట్లకు ఎవరైనా అమ్మితే వెంటనే వినియోగదారులు ఆ నంబర్‌కు కాల్‌చేసేలా ప్రచారం చేయాలని ఆదేశించారు. వచ్చే కాల్స్‌పై సత్వరమే స్పందించి అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.

ఇదీ చదవండి: ఆంధ్రప్రదేశ్ లో వింత ఆచారం.. ఇలా పెళ్లి చేస్తే పంటలు బాగా పండుతాయంట..?

సంబంధిత జిల్లాల వారీగా ఈ ప్రచారం చేయాలని.. ఆ జిల్లాల్లో రేట్ల వివరాలను తెలియజేస్తూ అడ్వర్టైజ్‌మెంట్ ఇవ్వాలని పేర్కొన్నారు. వర్షాలు తగ్గుముఖం పట్టగానే మరిన్ని రీచ్‌లు, డిపోల సంఖ్య పెంచేలా చూడాలన్న సీఎం ఆదేశించారు. క్రమం తప్పకుండా అధికారులు దీనిపై పర్యవేక్షణ చేయాలన్నారు. ఆ జిల్లాల్లో రేట్ల వివరాలను తెలియజేస్తూ అడ్వర్టైజ్‌మెంట్ ఇవ్వాలని, అంతకన్నా ఎక్కువ ధరకు ఎవరైనా విక్రయిస్తే తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీచేశారు.

ఇదీ చదవండి: అమెరికా వెళ్లాలనుకునే స్టూడెంట్స్‌కు శుభవార్త.. ఏయూలో అమెరికన్‌ కార్నర్‌ సందడి

ఇసుక అక్రమ రవాణా

ఏపీలో ఇప్పటి వరకు ఇసుక అక్రమ రవాణాకు సంబంధించి 12,211 కేసులు నమోదయ్యాయని అధికారులు వివరించారు. 22,769 మంది నిందితులను అరెస్ట్ చేశామన్నారు. 5,72,372 టన్నుల ఇసుక స్వాధీనం చేసుకున్నామని.. 16,365 వాహనాలు జప్తు చేశామన్నారు. అలాగే గంజాయి రవాణాకు సంబంధించి 220 కేసులు నమోదు చేశామన్నారు. ఇప్పటి వరకు 384 మంది అరెస్టు చేసినట్టు అధికారులు సీఎంకు వివరించారు.

First published: