హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

సీఆర్డీయేపై జగన్ సమీక్ష... అమరావతి రైతుల్లో ఉత్కంఠ

సీఆర్డీయేపై జగన్ సమీక్ష... అమరావతి రైతుల్లో ఉత్కంఠ

సీఎం జగన్ సీఆర్డీయే(క్యాపిటల్ రీజనల్ డెవలప్‌మెంట్ అథారిటీ)పై సమీక్ష నిర్వహిస్తుండటంతో... అమరావతికి భూములు ఇచ్చిన రైతులపై ఆయన కీలకమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.

    అమరావతి నుంచి రాజధానిని తరలించవద్దంటూ కొద్ది రోజులుగా అమరావతి ప్రాంతంలో ఆందోళనలు పెద్ద ఎత్తున జరుగుతున్న విషయం తెలిసిందే. రాజధానికి భూములు ఇచ్చిన రైతులు... తమ పరిస్థితి ఏమవుతుందనే అంశంపై ఆందోళన చెందుతున్నారు. అయితే అమరావతికి భూములు ఇచ్చిన రైతుల విషయంలో ప్రభుత్వం ఏ రకమైన నిర్ణయం తీసుకుంటుందనే అంశంపై మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. ఈ నేపథ్యంలో సీఎం జగన్ సీఆర్డీయే(క్యాపిటల్ రీజనల్ డెవలప్‌మెంట్ అథారిటీ)పై సమీక్ష నిర్వహిస్తుండటంతో... అమరావతికి భూములు ఇచ్చిన రైతులపై ఆయన కీలకమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. గతంలో సీఆర్డీయే సమావేశం తరువాతే ఏపీలో మూడు రాజధానులు ఏర్పాటు చేస్తామని ఏపీ సీఎం జగన్ ప్రకటించారు. గత సీఆర్డీయే సమావేశంలో అమరావతిలో పెండింగ్‌లో ఉన్న నిర్మాణాలను పూర్తి చేయాలని అధికారులకు స్పష్టం చేశారు. అయితే ఈ సారి ఆయన సీఆర్డీయే రివ్యూ మీటింగ్‌లో ఏం చెబుతారనే దానిపై ఆసక్తి నెలకొంది.

    First published:

    Tags: Amaravati, Ap cm ys jagan mohan reddy, Crda

    ఉత్తమ కథలు