ఢిల్లీ నుంచి హుటాహుటిన వచ్చిన సీఎం జగన్... నమ్మినబంటు చనిపోవడంతో...

ముఖ్యమంత్రి వ్యక్తిగత సహాయకుడు నారాయణ అనారోగ్యంతో మృతి చెందారు. ఈ వార్త తెలిసిన వెంటనే సీఎం జగన్ ఏపీకి తిరుగు పయనయ్యారు.

news18-telugu
Updated: December 6, 2019, 11:15 AM IST
ఢిల్లీ నుంచి హుటాహుటిన వచ్చిన సీఎం జగన్... నమ్మినబంటు చనిపోవడంతో...
సీఎం జగన్
  • Share this:
ప్రధాని నరేంద్రమోదీ సహా పలువురు కేంద్రమంత్రులను కలిసేందుకు ఢిల్లీ వెళ్లిన ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి... అర్థాంతరంగా తన పర్యటన ముగించుకుని రాష్ట్రానికి తిరుగు పయనమయ్యారు. ముఖ్యమంత్రి వ్యక్తిగత సహాయకుడు నారాయణ అనారోగ్యంతో మృతి చెందారు. ఈ వార్త తెలిసిన వెంటనే సీఎం జగన్ ఏపీకి తిరుగు పయనయ్యారు. ఢిల్లీ పర్యటనను అర్థంతరంగా ముగించుకున్నారు. ఢిల్లీ నుంచి నేరుగా కడప ఎయిర్‌పోర్టుకు రానున్న సీఎం జగన్... అక్కడ నుంచి నేరుగా నారాయణ స్వగ్రామానికి వెళ్లనున్నారు. ఈ మధ్యాహ్నం 3:30 గంటల ప్రాంతంలో నారాయణ స్వగ్రామం అనంతపురం జిల్లా దిగువపల్లెకు సీఎం జగన్ చేరుకోనున్నారు.

Ap cm ys jagan, jagan assistant Narayana, delhi tour, ap news, Kadapa, anantapuram, ఏపీ సీఎం జగన్, జగన్ అసిస్టెంట్ నారాయణ, ఢిల్లీ టూర్, కడప, అనంతపురం
పాదయాత్ర సందర్భంగా జగన్‌తో ఉన్న నారాయణ


నారాయణ అంత్యక్రియలు పూర్తయిన తరువాత సీఎం జగన్ తాడేపల్లికు చేరుకోనున్నారు. నిన్న ఢిల్లీ వెళ్లిన సీఎం జగన్ హోంమంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు. నేడు మరికొందరు కేంద్రమంత్రులను ఆయన కలవాల్సి ఉండగా... కుటుంబ సన్నిహితుడు నారాయణ మరణంతో సీఎం జగన్ ఢిల్లీ పర్యటన ముగిసింది.First published: December 6, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>