కేంద్రానికి సీఎం జగన్ కొత్త రిక్వెస్ట్...

ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాతో జరిగిన సమావేశంలో ఆయన మరోసారి పాత ప్రతిపాదన తెరపైకి తీసుకొచ్చారని తెలుస్తోంది.

news18-telugu
Updated: February 15, 2020, 5:42 PM IST
కేంద్రానికి సీఎం జగన్ కొత్త రిక్వెస్ట్...
ప్రధాని మోదీతో సీఎం జగన్(ఫైల్ ఫోటో)
  • Share this:
కొద్దిరోజుల క్రితం ప్రధాని నరేంద్రమోదీని కలిసిన ఏపీ సీఎం వైఎస్ జగన్... నిన్న హోంమంత్రి అమిత్ షాను కలిసి అనేక అంశాలపై చర్చించారు. నేడు కూడా ఢిల్లీలోనే ఉండి పలువురు కేంద్రమంత్రులను కలిసిన ఏపీ ముఖ్యమంత్రి... రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పెండింగ్ అంశాలపై వివరించారు. మిగతా అంశాల సంగతి ఎలా ఉన్నా... ప్రధాని, హోంమంత్రితో జరిగిన భేటీలో ఏపీ సీఎం వైఎస్ జగన్ తన పాత రిక్వెస్ట్‌ను మరోసారి తెరపైకి తీసుకొచ్చారని వార్తలు వినిపిస్తున్నాయి. ఏపీలో అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్ర ఇంటలిజెన్స్ చీఫ్‌గా స్టీఫెన్ రవీంద్రను ఎంపిక చేసుకోవాలని భావించిన సీఎం జగన్... తెలంగాణలో ఉన్న ఆయనను ఏపీకి తీసుకొచ్చేందుకు కేంద్ర స్థాయిలో ప్రయత్నాలు చేశారు.

అయితే అందుకు నిబంధనలు అనుకూలించదనే కారణంగా... ఏపీ సీఎం విజ్ఞప్తిపై కేంద్ర హోంశాఖ ఏ నిర్ణయం తీసుకోలేదు. ఆ అంశాన్ని పెండింగ్‌లో పెట్టింది. కేంద్రం తనను ఏపీకి పంపిస్తుందని భావించిన స్టీఫెన్ రవీంద్ర... చాలాకాలం ఎదురుచూసి మళ్లీ తెలంగాణలోనే విధుల్లో చేరారు. అయితే తాజాగా మరోసారి స్టీఫెన్ రవీంద్ర కోసం సీఎం జగన్ ఢిల్లీలో మరోసారి లాబీయింగ్ మొదలుపెట్టారనే ప్రచారం జరుగుతోంది.

కేంద్రానికి సీఎం జగన్ కొత్త రిక్వెస్ట్... | Cm ys jagan new request to pm modi and amit shah on ips Stephen ravindra transfer to ap
స్టీఫెన్ రవీంద్ర(ఫైల్ ఫోటో)


ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాతో జరిగిన సమావేశంలో ఆయన మరోసారి ఈ ప్రతిపాదన తెరపైకి తీసుకొచ్చారని తెలుస్తోంది. అయితే దీనిపై కేంద్రం ఏ రకంగా స్పందిస్తున్నది తెలియాల్సి ఉంది. స్టీఫెన్ రవీంద్రతో పాటు ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మీ సైతం ఏపీకి వెళ్లేందుకు ఢిల్లీ స్థాయిలో తనవంతు ప్రయత్నాలు చేశారు. అయితే ఆమె కూడా ఇందులో సక్సెస్ కాలేకపోయారు. ఈ నేపథ్యంలో స్టీఫెన్ రవీంద్ర కోసం సీఎం జగన్ చేస్తున్న తాజా ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయో చూడాలి.

First published: February 15, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు