Home /News /andhra-pradesh /

CM YS JAGAN NEED TO CONCENTRATE ON THE CONSTITUENCIES AS LEADERS SPLIT INTO GROUPS FULL DETAILS HERE PRN

YSRCP: వైసీపీకి తప్పని ఇంటిపోరు.. గెలిచిన చోట్లా వర్గ విభేదాలు.. ఇలా ఇయితే కష్టమేనా..?

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

2019 ఎన్నికల్లో టీడీపీ కి కంచుకోటలు అనుకునే నియోజకవర్గాలను కూడా వైసీపీ బద్దలు కొట్టింది. కొన్నిచోట్ల అయితే ప్రతిపక్షానికి పునాదులు కూడా లేకుండా చేసింది. ఐతే అంతటి ఘనవిజయం సాధించినా.. వైసీపీలో ఇంటిపోరు తప్పడం లేదు.

  2019 ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘనవిజయం సాధించింది. అందరి అంచనాలు, సర్వేలను తలకిందులు చేస్తూ రికార్డు మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. టీడీపీ(TDP) కి కంచుకోటలు అనుకునే నియోజకవర్గాలను కూడా వైసీపీ (YSRCP) బద్దలు కొట్టింది. కొన్నిచోట్ల అయితే ప్రతిపక్షానికి పునాదులు కూడా లేకుండా చేసింది. ఐతే అంతటి ఘనవిజయం సాధించినా.. వైసీపీలో ఇంటిపోరు తప్పడం లేదు. కొన్ని ముఖ్యమైన నియోజకవర్గాల్లో వర్గాలుగా విడిపోయిన నేతలు.. పార్టీకే ఎసరు తెచ్చేలా ఉన్నారన్న టాక్ వినిపిస్తోంది. పార్టీ అధిష్టానం వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టుకుంటే మొదటికే మోసం వస్తుందని కార్యకర్తలు, ద్వితీయశ్రేణి నాయకులు అభిప్రాయపడుతన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి నియోజకవర్గాలు దాదాపు 20 వరకు ఉన్నాయట.

  వైసీపీకి స్ట్రాంగ్ బేస్ ఉన్న చిత్తూరు జిల్లాలోనూ అసమ్మతి నేతలున్న నియోజకవర్గాలున్నాయి ముఖ్యంగా వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజా ప్రాతినిథ్యం వహిస్తున్న నగరిలో అసమ్మతి తీవ్రంగా ఉంది. ఇక్కడ ఐదు మండలాల్లోని నేతలు రోజాకు వ్యతిరేకంగా తిరుగుబావుటా ఎగురవేశారు. స్థానిక ఎన్నికల్లో రోజా వర్గాన్ని ఓడించేందుకు కూడా యత్నించారు. వచ్చే ఎన్నికల్లో రోజాకు టికెట్ రాకుడదనే లక్ష్యంతో రోజా అసమ్మతివర్గం పనిచేస్తోంది.

  ఇది చదవండి: వీళ్లను ఢీ కొట్టే నేతలు టీడీపీలో లేరా..? బాబు మేల్కోకుంటే ఆశలు వదులుకోవాల్సిందే..!


  ఇక గుంటూరు జిల్లా గురజాల నియోజకవర్గంలో ఇదే పరిస్థితి నెలకొంది. గతంలో ఇన్ ఛార్జ్ గా జంగా కృష్ణమూర్తి ఉండేవారు. కానీ చివరి నిముషంలో కాసు మహేష్ రెడ్డి టికెట్ దక్కించుకొని గెలిచారు. ప్రస్తుతం కృష్ణమూర్తికి ఎమ్మెల్సీ ఇవ్వడంతో ఇద్దరూ వేర్వేరుగా ఆఫీసులు పెట్టుకొని రాజకీయం చేస్తున్నారు. కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నేతలు కూడా రెండు వర్గాలుగా విడిపోయారు. పొన్నూరు పొన్నూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే కిలారు రోశయ్య, రావివెంకట రమణ మధ్య వార్ నడుస్తోంది. అలాగే చిలకలూరిపేటలో విడదల రజిని, మర్రి రాజేశఖర్ వర్గాలుగా పార్టీ విడిపోయింది. మర్రికి పదవి దక్కకపోవడంతో ఆయన వర్గం అసంతృప్తితో ఉంది.

  ఇది చదవండి: వైసీపీలో ఆ లక్కీఛాన్స్ దక్కించుకునే నేతలెవరు..? సీఎం జగన్ మనసులో ఉన్నది వాళ్లేనా..?


  అలాగే గుంటూరు వెస్ట్ వైసీపీ ఇన్ ఛార్జ్ చంద్రగిరి ఏసురత్నం, టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చిన మద్దాలి గిరి వర్గం వేర్వేరుగా రాజకీయాలు చేస్తోంది. వచ్చే ఎన్నికల్లో టికెట్ తమకంటే తమదనే ప్రచారం జరుగుతోంది. ఇక కృష్ణాజిల్లా గన్నవరం నియోజకవర్గంలో ఇదే పరిస్థితి నెలకొంది. ఎమ్మెల్యే వల్లభనేని వంశీ.. వైసీపీకి జై కొట్టడంతో ఇక్కడ పార్టీలో మూడు వర్గాలు తయారయ్యాయి. ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన యార్లగడ్డ వెంకట్రావు, సీనియర్ నేత దుట్టా రామచంద్రరావు వర్గాలుగా విడిపోయింది.

  ఇది చదవండి: పార్టీపై దృష్టిపెట్టిన సీఎం జగన్..? మూడు నెలల యాక్షన్ ప్లాన్ రెడీ..!


  సీఎం జగన్ సొంత జిల్లా అయిన కడప జిల్లాలోని ప్రొద్దటూరులో సిట్టింగ్ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి, ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ వర్గాలున్నాయి. ఎవరికి వారు వేర్వేరుగానే పనులు చేయించుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో రమేష్ కే టికెట్ అని ఆయన వర్గం ప్రచారం చేస్తుండగా.. రాచమల్లు వర్గం మాత్రం ఆ ప్రచారాన్ని కొట్టిపారేస్తోంది.

  ఇది చదవండి: పీఆర్సీపై తగ్గేదేలేదంటున్న ప్రభుత్వం.. ఫిబ్రవరిలో జీతాలు లేనట్టేనా..?


  ప్రకాశం జిల్లా జిల్లా కందుకూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే మహీధర్ రెడ్డి, ఎమ్మెల్సీ మాధవరావు వర్గంగా విడిపోయింది. చీరారలో కరణం బలరాం, ఆమంచి కృష్ణమోహన్ వర్గాలు ఢీ అంటే ఢీ అంటున్నాయి. దర్శిలో ఎమ్మెల్యే వేణుగోపాల్, మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి వర్గాలుగా విడిపోయాయి. గోదావరి జిల్లాలతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాల్లోని కొన్ని నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. సీఎం జగన్ త్వరలోనే పార్టీ నేతలతో సమీక్ష సమావేశాలు జరిపనున్నారనే వార్తలు వస్తున్న నేపథ్యంలో ముందుగా ఇలాంటి నియోజకవర్గాలపై దృష్టిపెట్టాలని పార్టీ నేతలు, కార్యకర్తలు కోరుతున్నారు.

  (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, AP Politics, Ysrcp

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు