ఏపీలో 25 నుంచి ‘మన పాలన మీ సూచన కార్యక్రమం’

తన ఏడాది పాలనపై ప్రజల నుంచి సూచనలు తీసుకోవాలని భావిస్తున్న ఏపీ సీఎం జగన్... ఇందుకోసం ఈ నెల 25 నుంచి ఐదు రోజుల పాటు మన పాలన మీ సూచన కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు.

news18-telugu
Updated: May 23, 2020, 6:52 PM IST
ఏపీలో 25 నుంచి ‘మన పాలన మీ సూచన కార్యక్రమం’
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి
  • Share this:
ఏడాది పాలనపై సమీక్షలు నిర్వహించుకునేందుకు సిద్ధమైన ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి... ఇందుకు సంబంధించి అధికారులతో సమావేశం కానున్నారు. అయితే తన ఏడాది పాలనపై ప్రజల నుంచి సూచనలు తీసుకోవాలని భావిస్తున్న ఏపీ సీఎం జగన్... ఇందుకోసం ఈ నెల 25 నుంచి ఐదు రోజుల పాటు మన పాలన మీ సూచన కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. ఈ విషయాన్ని ఏపీ ప్లానింగ్ డిపార్ట్‌మెంట్ సెక్రటరీ విజయ్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పనితీరుపై ప్రజల సూచనలు తెలుసుకుంటామని చెప్పారు. అందులో భాగంగా ఈ నెల 25న పాలన వ్యవస్థలో వచ్చిన వికేంద్రీకరణ, సచివాలయాలపై చర్చ ఉంటుందని తెలిపారు.26న వ్యవసాయ అనుబంధ రంగాల్లో రైతులకు జరిగిన మేలుపై చర్చ జరగనుంది. 27న విద్యార్థులకు కల్పించిన సౌకర్యాలపై లబ్ధిదారులు, నిపుణులతో చర్చ ఉంటుంది. 28న పరిశ్రమల వసతులపై చర్చిస్తామని, 29న ఆరోగ్యశ్రీలో వచ్చిన మార్పులపై చర్చ జరుగుతుందని ఆయన వివరించారు. ఏపీ సీఎం జగన్ తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుంచి ఈ కార్యక్రమంలో పాల్గొంటారని విజయ్ కుమార్ తెలిపారు.
First published: May 23, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading