ఇసుక విషయంలో ఇలా చేయండి... సీఎం జగన్ కీలక ఆదేశాలు

ప్రతీకాత్మక చిత్రం

ఇసుక రీచ్‌ల్లో అక్రమాలు లేకుండా చూడాలని... బుకింగ్‌ టైం మధ్యాహ్నం 12 గంటలనుంచి సాయంత్రం 6 గంటలవరకూ ఉంచాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు.

 • Share this:
  ఏపీ సీఎం జగన్ ఇసుక సరఫరాపై అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. బల్క్‌ ఆర్డర్‌కు సరైన నిర్వచనం ఇవ్వాలని అధికారులకు స్పష్టం చేశారు. డిపోల్లో ఇసుకను బాగా అందుబాటులో పెట్టాలని అన్నారు. పోర్టల్‌ నుంచి బల్క్‌ ఆర్డర్లను తొలగించాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. బల్క్‌ ఆర్డర్లకు అనుమతులను జాయింట్ కలెక్టర్లకు అప్పగించాలని అన్నారు. పోర్టల్‌ ఆన్‌ చేయగానే.. వెంటనే నిల్వలు అయిపోతున్నాయన్న భావన పోగొట్టాలని సూచించారు. ప్రభుత్వ నిర్మాణాలకు సంబంధించి బల్క్‌ బుకింగ్‌ ఉంటే... సూపరింటెండెంట్‌ ఇంజినీర్, జేసీల ద్వారా అనుమతులు ఇవ్వాలని తెలిపారు.

  గ్రామ సచివాలయాలు, వార్డు సచివాలయాల ద్వారా ఇసుక బుకింగ్‌ను చేసుకునే అవకాశం ఇవ్వాలని తెలిపారు. డిపోల నుంచే ఇసుక సరఫరా చేయాలని.. నియోజకవర్గానికి ఒకటే రేటు ఉండేలా చూడాలని సీఎం జగన్ స్పష్టం చేశారు. ఇసుక రీచ్‌ల్లో అక్రమాలు లేకుండా చూడాలని... బుకింగ్‌ టైం మధ్యాహ్నం 12 గంటలనుంచి సాయంత్రం 6 గంటలవరకూ ఉంచాలని ఆదేశించారు. చిన్న చిన్న నదులనుంచి పక్కనే ఆనుకుని గ్రామాలకు ఎడ్లబళ్లద్వారా సొంత అవసరాలకు ఉచితంగా ఇసుకను తీసుకెళ్లడానికి అనుమతించాలని సూచించారు.

  అయితే పంచాయతీ సెక్రటరీ నుంచి రిజిస్ట్రేషన్‌ తప్పనిసరి చేస్తామనఅ అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. ఎడ్ల బళ్లద్వారా తీసుకెళ్లి.. వేరేచోట నిల్వచేసి అక్రమంగా తరలిస్తే మాత్రం చర్యలు తీసుకుంటామని చెప్పారు. కరోనా వైరస్‌ కారణంగా రీచ్‌లన్నీ మూతబడ్డాయన్న అధికారులు.. ఇప్పుడిప్పుడే మళ్లీ రీచ్‌లు ప్రారంభమవుతున్నాయని తెలిపారు. వారం, పదిరోజుల్లో రోజుకు 3 లక్షల టన్నులు ఉత్పత్తిని చేరుకునేందుకు ప్రయత్నిస్తున్నామని వివరించారు.
  Published by:Kishore Akkaladevi
  First published: