CM YS Jagan: సమగ్ర భూసర్వేపై అధికారులకు సీఎం జగన్ కీలక ఆదేశాలు

Andhra Pradesh News: గతంలో రికార్డులు ట్యాంపర్‌ చేయడానికి చాలా అవకాశం ఉండేదని, ఆ పరిస్థితి పూర్తిగా మారాలని సీఎం జగన్ అధికారులకు స్పష్టం చేశారు.

news18-telugu
Updated: October 22, 2020, 10:07 PM IST
CM YS Jagan: సమగ్ర భూసర్వేపై అధికారులకు సీఎం జగన్ కీలక ఆదేశాలు
సీఎం జగన్ (ఫైల్ ఫోటో)
  • Share this:
వచ్చే ఏడాది జనవరి 1న సమగ్ర భూసర్వే మొదలు కావాలని సీఎం జగన్ అధికారులకు స్పష్టం చేశారు. నిర్ణీత వ్యవధిలోగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని అన్నారు. వందేళ్ల తర్వాత సర్వే జరుగుతోందని.. దీనివల్ల రాష్ట్రంలో పక్కాగా భూరికార్డుల డిజిటలైజేషన్‌ అవుతుందని సీఎం జగన్ అన్నారు. రాష్ట్రంలో సమగ్ర భూ సర్వేపై సీఎం జగన్ సమీక్షా సమావేశం నిర్వహించారు. అత్యాధునిక టెక్నాలజీ, డ్రోన్‌లు, రోవర్స్‌ ఉపయోగించి దేశంలో తొలిసారిగా ఈ సర్వే నిర్వహిస్తున్నామని వెల్లడించారు. త్వరలోనే సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్లు కొనసాగుతాయి కాబట్టి, ఆ మేరకు సర్వేయర్లు కూడా ఉండాలని సీఎం జగన్ అధికారులకు సూచించారు.

గతంలో రికార్డులు ట్యాంపర్‌ చేయడానికి చాలా అవకాశం ఉండేదని, ఆ పరిస్థితి పూర్తిగా మారాలని సీఎం జగన్ అధికారులకు స్పష్టం చేశారు. ఎవ్వరు కూడా రికార్డులు తారుమారు చేసే అవకాశం లేకుండా డిజిటైజేషన్ జరుగుతుందని అన్నారు. వ్యవసాయ భూములు, గ్రామ కంఠాలు, మున్సిపాలిటీలలో ఈ సర్వే కొనసాగుతుందని అధికారులు సీఎం జగన్‌కు వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా1.22 లక్షల చదరపు కిలోమీటర్లలో సర్వే కొనసాగుతుందని, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తూ, పక్కాగా సర్వే చేస్తామని తెలిపారు. ప్రతి మండలంలో మూడు బృందాల చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి 4500 బృందాలు పని చేస్తాయని వెల్లడించారు. భౌగోళిక సమాచార వ్యవస్థ(జీఐఎస్‌) ద్వారా శాటిలైట్ ఫోటోలు పొందడం, ఆ ఇమేజ్‌ను ప్రాసెస్‌ చేయడం, క్షేత్రస్థాయి పరిశీలన, ఆ తర్వాత సమగ్ర సర్వే సెటిల్‌మెంట్‌ కొనసాగుతుందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.

డ్రోన్ల ద్వారా స్పష్టంగా గ్రామ కంఠాలను జీఐఎస్‌ ద్వారా ఫోటో తీస్తామని తెలిపారు. వచ్చే ఏడాది జనవరి 1న ప్రారంభమయ్యే సమగ్ర భూ సర్వే రెండేళ్లలో జనవరి 2023 నాటికి పూర్తవుతుందని సీఎం జగన్ దృష్టికి తీసుకొచ్చారు. మూడు దశల్లో సర్వే కొనసాగుతుందని వివరించారు. సమగ్ర భూసర్వే కోసం 70 కంటిన్యూస్‌లీ ఆపరేటింగ్ రిఫరెన్స్ స్టేషన్స్(బేస్‌ స్టేషన్లు) ఏర్పాటు చేయాల్సి ఉండగా, ఇప్పటికే కొన్నింటిని ఏర్పాటు చేశామని తెలిపారు. మొబైల్‌ కోర్టులు కూడా ఏర్పాటు అవుతున్నందున వివాదాలు కూడా ఎక్కడికక్కడే వేగంగా పరిష్కారమవుతాయని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు.
Published by: Kishore Akkaladevi
First published: October 22, 2020, 10:07 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading