హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Andhra Pradesh: ఆరోగ్యశ్రీ,104, 108 వాహనాలపై సీఎం జగన్ కీలక ఆదేశాలు

Andhra Pradesh: ఆరోగ్యశ్రీ,104, 108 వాహనాలపై సీఎం జగన్ కీలక ఆదేశాలు

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (ఫైల్)

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (ఫైల్)

CM YS Jagan: ఆరోగ్య శ్రీ కింద సేవలు అందించడంలో ఎలాంటి ఇబ్బందులు రాకూడదని, క్రమం తప్పకుండా ఎంప్యానెల్‌ ఆస్పత్రులకు బిల్లులు చెల్లించేలా చూడాలని సీఎం జగన్ ఆదేశించారు.

  వైద్య ఖర్చుల కోసం పేదలు పెద్ద మొత్తంలో డబ్బులు ఖర్చు చేయాల్సిన పరిస్థితి తలెత్తకూడదని సీఎం జగన్ అన్నారు. వేయి రూపాయల దాటితే ఉచితంగా చికిత్స అందించాలనే ప్రభుత్వ విధానం సమర్థవంతంగా అమలు కావాలంటే... సిబ్బందికి పూర్తి అవగాహన కల్పించడం చాలా అవసరమని ఆయన అన్నారు. ఆరోగ్యశ్రీలో లబ్ధిదారుల ఫీడ్‌ బ్యాక్‌ తీసుకోవాలని సూచించారు. వైద్య ఆరోగ్యశాఖలో నాడు–నేడుపై క్యాంపు కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు.ఆరోగ్య ఆసరా అందిందా లేదా తనిఖీ చేయాలని.. ఎంపానెల్‌ ఆస్పత్రిలో ఏదైనా సమస్యవస్తే రియల్‌ టైం డేటా ఉన్నతస్థాయికి రావాలని సీఎం జగన్ స్పష్టం చేశారు. దీనికోసం ప్రత్యేకంగా యాప్‌ రూపొందించామన్న అధికారులు సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లారు. ప్రతి ఆరోగ్య మిత్ర వద్దా తప్పనిసరిగా ఫోన్‌ ఉంచాలని అధికారులను జగన్‌ ఆదేశించారు.

  ఆరోగ్య శ్రీ కింద సేవలు అందించడంలో ఎలాంటి ఇబ్బందులు రాకూడదని, క్రమం తప్పకుండా ఎంప్యానెల్‌ ఆస్పత్రులకు బిల్లులు చెల్లించేలా చూడాలన్నారు. 104, 108 వాహనాలు ఎప్పటికీ కొత్తగానే కనిపించాలని అన్నారు. వాటి నిర్వహణలో ఎప్పుడూ రాజీ పడొద్దని.. వాహనాల కండిషన్, వాటి నిర్వహణ అత్యంత ముఖ్యమని అధికారులకు వివరించారు.

  పశ్చిమ గోదావరి జిల్లా పూళ్ల, కొమరవోలు గ్రామాల్లో ప్రజలు అకస్మాత్తుగా అస్వస్థతకు గురైన ఘటనలపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. వివిధ ప్రఖ్యాత సంస్థల పరీక్షలు, వాటి ఫలితాలను అడిగి తెలుసుకున్నారు. తాగునీరు సురక్షితమంటూ పరీక్షా ఫలితాలు వచ్చాయని.. దీంతోపాటు పూళ్లలో ఆహార పదార్థాలు కూడా సురక్షితమేనంటూ ఫలితాలు వచ్చాయని అధికారులు జగన్‌కు వివరించారు. కొమరవోలులో ఆహార పదార్థాలపై పరీక్షల ఫలితాలు ఇంకా రావాల్సి ఉందని అన్నారు. అయితే ప్రజలు అస్వస్ధతకు గురైన గ్రామాల్లో ధైర్యాన్నిచ్చే ప్రయత్నాలు చేయాలని తెలిపారు. పాత వైద్యకళాశాల్లో అభివృద్ధి పనులు, కొత్త కాలేజీల నిర్మాణాలకు సంబంధించి ఏప్రిల్‌ 15 కల్లా టెండర్ల ప్రక్రియ పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలి. ఆస్పత్రులకోసం భూ సమీకరణను వీలైనంత త్వరగా పూర్తి చేయాలి. ఆ తర్వాత పనులు చురుగ్గా మొదలుపెట్టాలన్నారు.

  Published by:Kishore Akkaladevi
  First published:

  Tags: Aarogyasri, Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy

  ఉత్తమ కథలు