హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Sirivennela Seetharama Sastry: సిరివెన్నెల కుటుంబానికి అండగా ఏపీ ప్రభుత్వం.. సీఎం జగన్ కీలక ఆదేశాలు

Sirivennela Seetharama Sastry: సిరివెన్నెల కుటుంబానికి అండగా ఏపీ ప్రభుత్వం.. సీఎం జగన్ కీలక ఆదేశాలు

సిరివెన్నెల కుటుంబానికి అండగా ఏపీ ప్రభుత్వం

సిరివెన్నెల కుటుంబానికి అండగా ఏపీ ప్రభుత్వం

సిరివెన్నెల సీతారామశాస్త్రి కుటుంబానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Andhra Pradesh Government) అండగా నిలిచింది. ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (AP CM YS Jagan Mohan Reddy) అధికారులకు ఆదేశాలిచ్చారు.

  ప్రఖ్యాత గేయ సిరివెన్నెల సీతారామశాస్త్రి (Sirivennela Sitarama Sashtry) ఊపిరితిత్తుల క్యాన్సర్ తో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. బుధవారం ఉదయం హైదరాబాద్ లోని మహాప్రస్థానం శ్మశానవాటికలో కుటుంబ సభ్యులు, సినీ ప్రముఖుల మధ్య ఆయన అంత్యక్రియలు జరిగాయి. ఇదిలా ఉంటే సిరివెన్నెల సీతారామశాస్త్రి కుటుంబానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Andhra Pradesh Government) అండగా నిలిచింది. ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (AP CM YS Jagan Mohan Reddy) అధికారులకు ఆదేశాలిచ్చారు. ఆస్పత్రి ఖర్చుల భారం ఆకుటుంబంపై పడకుండా చూడాలని సీఎం ఇచ్చిన ఆదేశాలమేరకు ఆస్పత్రి యాజమాన్యంతో మాట్లాడారు. ఆయన వైద్యానికి అయిన మొత్తం ఖర్చులను ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి చెల్లిస్తున్నామని అధికారులు వెల్లడించారు. అలాగే సిరివెన్నెల కుటుంబానికి ఏపీలో ఒక స్థలాన్ని ఇచ్చేలా పరిశీలన చేయాలని సీఎం ఆదేశించినట్లు అధికారులు తెలిపారు.

  సీఎం జగన్ కు సిరివెన్నల కుటుంబం కృతజ్ఞతలు

  తమ కుటుంబానికి అండగా నిలిచిన ఏపీ సీఎం వైఎస్ జగన్ కు సిరివెన్నల సీతారామశాస్త్రి కుటుంబం కృతజ్ఞతలు తెలిపింది. ఈ మేరకు ఆయన పెద్దకుమారుడు సాయి యోగేశ్వర్ ఓ ప్రకటన విడుదల చేశారు. “నవంబర్ 30న ఉదయం 10 గంటలకు కిమ్స్ ఆసుపత్రిలో ఉన్న మాకు సీఎం కార్యాలయం నుండి శాస్త్రిగారి ఆరోగ్య పరిస్థితులపై ఎంక్వయిరీ చేస్తూ ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఆసుపత్రి ఖర్చులన్ని భరించమని సీఎం జగన్ ఆదేశించినట్లుగా తెలియజేశారు. సిరివెన్నెల అదే రోజు సాయంత్రం 4.07 గంటలకు స్వర్గస్తులైనారు. సీఎం జగన్ తమ సంతాపాన్ని తెలియజేశారు. శాస్త్రిగారి అంత్యక్రియలకు ఏపీ మంత్రి హాజరై, ఆసుపత్రి ఖర్చులన్నీ భరిస్తూ.. మేము కట్టిన అడ్వాన్స్‌ని కూడా తిరిగి ఇచ్చేలా ఆదేశాలు జారీ అయ్యాయని తెలియజేశారు. సిరివెన్నెలగారి పట్ల ఇంత ప్రేమానురాగాలు చూపించి, మా కుటుంబానికి అండగా నిలిచిన ఏపీ సీఎం జగన్ కు మా కుటుంబమంతా కృతజ్ఞతలు తెలియజేస్తోంది.” అని పేర్కొన్నారు.

  ‘సిరివెన్నెల’ విషయానికొస్తే.. పదాలతో ప్రయోగాలు చేయడం ఆయనకు పెన్నుతో పెట్టిన విద్య.. తెలుగు సినిమా పాటల పూదోటలో విరిసిన ఒకానొక పారిజాతపుష్పం. అక్షరాలనే కిరణాలు, పదాలనే తేజాలను సృష్టించారు. తన పాటలతో అక్షర సేద్యం చేసే కవి కర్షకుడు. అతని పాట ప్రతి నోటా అనేలా ఉంటాయి. అతని రాక తెలుగు సినిమా పాటకు ఏరువాక. సీతారామశాస్త్రి మరణంతో తెలుగు సినీ సాహిత్య లోకం మూగబోయిందనే చెప్పాలి.

  తెలుగులో దాదాపు అందరి హీరోలకు అద్భుతమైన సాహిత్యాన్ని అందించారు. 2019 ఏడాదికి గాను కేంద్రం ఆయన్ని పద్మశ్రీతో గౌరవించడం తెలుగు సాహిత్యానికి దక్కిన గౌరవంగా భావించాలి. సీతారామశాస్త్రి విడుదలకు సిద్ధంగా ఉన్న రాజమౌళి ’ఆర్ఆర్ఆర్’సినిమాలో ‘దోస్తి’ సాంగ్ రాసారు ఈయన. అటు ‘శ్యామ్ సింగరాయ్’ తో పాటు పలు చిత్రాల్లో ఒకటి రెండు చిత్రాల్లో ఆయన గేయ పరిమళాలను ఆస్వాదించవచ్చు. ఈ యేడాది విడుదలైన వెంకటేష్ నారప్పలో రెండు పాటలు రాసారు సిరివెన్నెల. కొండపొలంలోనూ ఈయన పాటలు రచించారు. ఏదేమైనా ఆయన మరణం తెలుగు చిత్ర పరిశ్రమకు తీరిని లోటు అని చెప్పాలి.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, Ap government, Sirivennela Seetharama Sastry

  ఉత్తమ కథలు