కాంట్రాక్ట్ ఉద్యోగుల జీతాలపై సీఎం జగన్ కీలక నిర్ణయం

రెగ్యులర్‌ ఉద్యోగుల్లానే, సకాలంలో కాంట్రాక్టు ఉద్యోగులకు జీతాలు అందించాలని సీఎం జగన్‌ ఆదేశాలు జారీ చేశారు.

news18-telugu
Updated: July 13, 2020, 2:42 PM IST
కాంట్రాక్ట్ ఉద్యోగుల జీతాలపై సీఎం జగన్ కీలక నిర్ణయం
ఏపీ సీఎం జగన్
  • Share this:
వివిధ ప్రభుత్వ విభాగాల్లో పని చేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులకు సకాలంలో జీతాలు అందించాలని సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ విభాగాలతో పాటు వివిధ సొసైటీలు, విశ్వవిద్యాలయాల్లోని కాంట్రాక్టు ఉద్యోగులకు జీతాల విడుదలలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా సకాలానికే అందించాలని ఆదేశించారు. కాంట్రాక్టు ఉద్యోగుల స్థితిగతులపై క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. వివిధ ప్రభుత్వ విభాగాల్లోని కాంట్రాక్టు ఉద్యోగులు, వారి జీతాలు, స్థితిగతులపై ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ విభాగాలు, సొసైటీలు, యూనివర్సిటీల్లో పని చేస్తున్న సుమారు 54 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులకు గత ప్రభుత్వం చేసింది ఏమీ లేదనే అంశం సమావేశంలో ప్రస్తావనకు వచ్చింది.

ఎన్నికలకు ముందు మినిమం టైం స్కేల్‌పై హడావిడిగా జీవో జారీ చేసిందని.. అయినా అమలు చేసే బాధ్యతను ఈ ప్రభుత్వం తీసుకుందని సమావేశంలో చర్చకు వచ్చింది. సీఎం జగన్ బాధ్యతలు చేపట్టిన తర్వాత 2019 జూలై నుంచి మినిమం టైం స్కేల్‌ అమలు చేస్తున్నట్లు సమావేశం పేర్కొంది. దీని వల్ల రాష్ట్ర ఖజానాపై రూ.1000 కోట్ల భారాన్ని ఈ ప్రభుత్వం తీసుకుంటోందని అధికారులు వెల్లడించారు. రెగ్యులర్‌ ఉద్యోగుల్లానే, సకాలంలో కాంట్రాక్టు ఉద్యోగులకు జీతాలు అందించాలని సీఎం జగన్‌ ఆదేశాలు జారీ చేశారు. గ్రీన్‌ ఛానల్లో పెట్టి వారికి నిర్ణీత సమయానికి జీతాలు అందించాలన్నారు. పర్మినెంట్‌ ఉద్యోగుల్లానే సామాజిక, ఆరోగ్య భద్రత కల్పించే దిశగా అధ్యయనం చేయాలని, దీనికి సంబంధించి పూర్తి వివరాలు తనకు అందించాలని సీఎం ఆదేశాలిచ్చారు.
Published by: Kishore Akkaladevi
First published: July 13, 2020, 2:42 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading