CM YS JAGAN MOHAN REDDY ISSUES KEY ORDERS ABOUT RAIN AFFECTED DISTRICTS IN ANDHRA PRADESH FULL DETAILS HERE PRN
YS Jagan Review: భారీ వర్షాలపై సీఎం జగన్ సమీక్ష.. వారికి తక్షణమే నగదు సాయం..
వైఎస్ జగన్ (ఫైల్)
వాయుగుండం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లోని దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
వాయుగుండం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లోని దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (CM YS Jagan Mohan Reddy).., ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల కలెక్టర్లు, అధికారులతో క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సమావేశంలో వాతావరణ శాఖ అధికారులు కూడా పాల్గొన్నారు. రాష్ట్రంలో ప్రస్తుత వాతావరణ పరిస్థితులు, భారీ వర్షాలపై సీఎం జగన్ అధికారుల నుంచి సమాచారం అడిగి తెలుసుకున్నారు. ఈ సాయంత్రం చెన్నై వద్ద వాయుగుండం తీరం దాటుతుందని అధికారులు తెలిపారు. అలాగే బంగాళాఖాతంలో ఏర్పడ్డ మరో అల్పపీడనం తుపానుగా మారి దక్షిణకోస్తాంధ్రాలో తీరందాటే అవకాశాలు ఉన్నాయని .. అది ఈనెల 17న తీరం దాటే అవకాశాలున్నాయని ప్రాథమిక అంచనాగా తెలిపారు. దీనివల్ల దక్షిణ కోస్తాంధ్రలో మరో విడత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.
ఈ సందర్భంగా సీఎం జగన్ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం భారీ వర్షాలు కురుస్తున్నందున వరద ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ముఖ్యంగా నెల్లూరు, చిత్తూరు జిల్లాల కలెక్టర్లు, అధికారులు అత్యంత అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇప్పటికే ఎస్డీఆర్ఎఫ్ బృందాలు రాష్ట్రానికి చేరుకున్నాయని.., నెల్లూరు, చిత్తూరు, కర్నూలు జిల్లాలకు రెండు బృందాల చొప్పున చేరుకున్నాయని.. మంగళగిరిలో కూడా అదనపు బృందాలను సిద్ధంచేసినట్లు తెలిపారు. పరిస్థితులను బట్టి వారి సేవలను వినియోగించుకోవచ్చన్నారు.
అవసరమైన చోట సహాయ శిబిరాలు తెరవాలని.. శిబిరాల్లో ఉన్నవారికి అన్ని ఆహారం మంచి ఆహారం అందించాలన్నారు. అలాగే బాధితులకు వేయి రూపాయల చొప్పున తక్షణే సాయంమందించాలని ఆదేశించారు. బాధితులకోసం ఒక ఫోన్ నంబర్‌ను అందుబాటులో ఉంచి.. వివిధ విభాగాలతో సమన్వయం చేసుకోవాలన్నారు.
ఎస్ఓపీల ప్రకారం అన్నిరకాల చర్యలను తీసుకోవాలని.., ముంపు ప్రాంతాలనుంచి ప్రజలను తరలించేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. అవసరమైన మందులను సరిపడా అందుబాటులో ఉంచుకోవాలన్నారు. పీహెచ్‌సీల్లో, ఏరియా ఆస్పత్రుల్లో, జిల్లా ఆస్పత్రుల్లో అన్నిరకాల మందులను ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. వర్షాల అనంతరం పారిశుద్ధ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలని.., అత్యవసర సేవలకు అంతరాయం రాకుండా జనరేటర్లను అందుబాటులో ఉంచాలన్నారు. విద్యుత్‌స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు దెబ్బతింటే.. వెంటనే వాటిని ఏర్పాటు చేసేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకునేలా విద్యుత్‌శాఖ అధికారులు సిద్ధంగా ఉండాలన్నారు సీఎం జగన్. బాధిత ప్రాంతాల్లో పంపిణీ చేసేందుకు ఆహారం, తాగునీటి ప్యాకెట్లను సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు.
భారీ వర్షాల కారణంగా రిజర్వాయర్లు, చెరువులు, గండ్లు పడకుండా తగిన చర్యలు తీసుకోవాలన్న జగన్.., నీటి పారుదల శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎప్పటికప్పుడు వర్షాలను, నీటి ప్రవాహాలను అంచనా వేసుకుంటూ.. ప్రమాదాలకు ఆస్కారం లేకుండా నీటిని విడుదల చేయలని జగన్ సూచించారు. రోడ్లు ఇతరత్రా మౌలిక సదుపాయాలకు ఎక్కడ నష్టం వాటిల్లినా వెంటనే మరమ్మతులు చేపట్టేలా చర్యలు ఉండాలని సీఎం అన్నారు. ఎప్పటికప్పుడు ఫోన్‌కాల్‌కు మేం అందుబాటులో ఉంటామన్న జగన్.., ఇంకా ఏం కావాలన్నా వెంటనే తెలియజేయాలని అధికారులకు సీఎం జగన్ దిశా నిర్దేశం చేశారు.
Published by:Purna Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.