Home /News /andhra-pradesh /

CM YS JAGAN MOHAN REDDY INAUGURATED YSR RYTHU BHAROSA PROGRAM IN ANDHRA PRADESH AK

రైతు భరోసా పథకం ప్రారంభం... నగదు రాకపోతే ఇలా చేయాలన్న సీఎం జగన్

8 జిల్లాల్లోని కోవిడ్‌ ఆస్పత్రుల్లో ప్రస్తుతమున్న ఐసోలేషన్‌ పడకలు, ఆక్సిజన్‌ సదుపాయం ఉన్న పడకల సంఖ్యను మరింత పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని సీఎం తెలిపారు. వైరస్‌ సోకడం తప్పేమీ కాదని, నేరం అంతకన్నా కాదని అభిప్రాయపడ్డారు. అలాగే కోవిడ్‌ పట్ల ప్రజల్లో ఉన్న భయాందోళనలను తొలగించాలని అధికారులకు సూచించారు.

8 జిల్లాల్లోని కోవిడ్‌ ఆస్పత్రుల్లో ప్రస్తుతమున్న ఐసోలేషన్‌ పడకలు, ఆక్సిజన్‌ సదుపాయం ఉన్న పడకల సంఖ్యను మరింత పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని సీఎం తెలిపారు. వైరస్‌ సోకడం తప్పేమీ కాదని, నేరం అంతకన్నా కాదని అభిప్రాయపడ్డారు. అలాగే కోవిడ్‌ పట్ల ప్రజల్లో ఉన్న భయాందోళనలను తొలగించాలని అధికారులకు సూచించారు.

రాష్ట్రంలోని 49 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరేలా రైతు భరోసా పథకాన్ని రూపొందించామని సీఎం జగన్ అన్నారు.

    ఏపీలో ‘వైఎస్సార్‌ రైతు భరోసా– పీఎం కిసాన్‌’ పథకం ప్రారంభమైంది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కార్యక్రమాన్ని సీఎం జగన్ ప్రారంభించారు. వైసీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెడుతున్న ఈ పథకం ద్వారా ప్రతి రైతు కుటుంబానికి తొలి విడతగా రూ.7,500 ఖాతాలో జమ కానున్నాయి. పథకాన్ని ప్రారంభించిన అనంతరం మాట్లాడిన సీఎం వైఎస్ జగన్... వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా పథకానికి శ్రీకారం చుట్టడం బాధగా ఉందని వ్యాఖ్యానించారు. సాధారణ పరిస్థితులు ఉంటే రైతులతో కలిసి భారీ సభలో ఈ కార్యక్రమం నిర్వహించేవాళ్లమని సీఎం జగన్ తెలిపారు.

    కరోనా పరిస్థితుల కారణంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతు భరోసాను ప్రారంభిస్తున్నామని అన్నారు. రాష్ట్రంలోని 49 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరేలా ఈ పథకాన్ని రూపొందించామని ఆయన వివరించారు. వ్యవసాయానికి పెట్టుబడి కోసం రైతులు ఇబ్బంది పడకూడదని ఈ పథకం ప్రవేశ పెట్టామని వివరించిన సీఎం జగన్... పెట్టుబడి సాయం అందించేందుకే రైతు భరోసా కింద రూ.13500 ఏటా అందిస్తున్నామని స్పష్టం చేశారు. రైతులు, రైతు కూలీలు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందన్న ఏపీ ముఖ్యమంత్రి... దేశానికి అన్నం పెట్టే రైతన్నలకు ఎంత చేసినా తక్కువే అని అభిప్రాయపడ్డారు.

    అప్పులతో సంబంధం లేకుండా రైతులకు పెట్టుబడి సాయం చేస్తున్నామని సీఎం జగన్ అన్నారు. తమకు ఓటు వేయని రైతులకు కూడా సాయం ఇస్తున్నామని తెలిపారు. ఆగస్టులో రెండో విడత అందిస్తామని... సంక్రాంతికి మూడో విడత రైతు భరోసా అందిస్తామని స్పష్టం చేశారు. రైతుల అకౌంట్లలో నేరుగా నగదు జమచేస్తామని... గ్రామ సచివాలయాల్లో లబ్ధిదారుల జాబితా ఉంచుతున్నామని తెలిపారు. ఎవరైనా పేరు లేకపోతే నమోదు చేయించుకునే అవకాశం కల్పించామని అన్నారు. నగదు బదిలీ కాకుంటే 1902 కాల్ సెంటర్‌కు రైతులు ఫోన్ చేయొచ్చని సూచించారు.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, Ysr rythu bharosa

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు