హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

అసెంబ్లీ ముందుకు సీఆర్డీయే బిల్లు... జగన్ సర్కార్ మరో కీలక నిర్ణయం

అసెంబ్లీ ముందుకు సీఆర్డీయే బిల్లు... జగన్ సర్కార్ మరో కీలక నిర్ణయం

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఏపీ సీఎం

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఏపీ సీఎం

రాజధాని వికేంద్రీకరణకు సంబంధించిన బిల్లును ఏపీ ప్రభుత్వం మరోసారి అసెంబ్లీలో ప్రవేశపెట్టనుందని తెలుస్తోంది.

    ఏపీలో మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని గతంలో నిర్ణయం తీసుకుని అసెంబ్లీలో తీర్మానం కూడా ప్రవేశపెట్టిన ఏపీ ప్రభుత్వం... శాసనమండలిలో మాత్రం ఆ బిల్లును గట్టెక్కించుకోలేకపోయింది. అయితే ఈ బిల్లుపై శాసనమండలి 90 రోజులు పూర్తయినా ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో... మరోసారి అసెంబ్లీలో ఈ బిల్లును ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. దీనిపై ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి స్పందించారు. దీనిపై బీఏసీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని అన్నారు. తమ ప్రభుత్వానికి అన్ని ప్రాంతాలు సమానమే అని ఆయన వ్యాఖ్యానించారు. అసెంబ్లీలో ప్రవేశపెట్టడానికి బడ్జెట్ సహా 8 అంశాల్లో సీర్డీయే రద్దు అంశం కూడా ఉన్నట్టు తెలుస్తోంది.

    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, Crda

    ఉత్తమ కథలు