• HOME
  • »
  • NEWS
  • »
  • ANDHRA-PRADESH
  • »
  • CM YS JAGAN MOHAN REDDY DISCUSSED MUHURTHAM WITH SWAROOPANANDENDRA FOR CAPITAL SHIFITING TO VISAKHAPATNAM AK

YS Jagan: త్వరలోనే విశాఖకు సీఎం జగన్.. మరో ముహూర్తం ఖరారు..

YS Jagan: త్వరలోనే విశాఖకు సీఎం జగన్.. మరో ముహూర్తం ఖరారు..

వైఎస్ జగన్, స్వరూపానందేంద్ర (ఫైల్ ఫోటో)

YS Jagan: రాజధాని తరలింపు అంశంతో పాటు హిందూ ధార్మిక పరిషత్ ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని సీఎం జగన్ వద్ద స్వరూపానందేంద్ర స్వామి ప్రస్తావించినట్టు తెలుస్తోంది.

  • Share this:
    అధికారంలోకి వచ్చిన కొత్తలోనే ఏపీ పరిపాలన రాజధానిని విశాఖకు తరలించాలని నిర్ణయించిన వైసీపీ ప్రభుత్వం.. ఆ దిశగా కొంతమేర ఏర్పాట్లు కూడా చేసింది. అయితే ఆ తరువాత ఇందుకు సంబంధించి న్యాయపరమైన ఇబ్బందులు ఎదురుకావడంతో ఈ ప్రక్రియలో జాప్యం జరుగుతోంది. ప్రస్తుతం ఉన్న అమరావతిని శాసన రాజధానిగా, కర్నూలును న్యాయరాజధానిగా మార్చాలని నిర్ణయించిన వైసీపీ ప్రభుత్వం.. కీలకమైన పరిపాలన రాజధానిని కచ్చితంగా విశాఖకు తరలించాల్సిందే అని నిర్ణయించుకుంది. ఈ క్రమంలోనే తాజాగా నేడు విశాఖ పర్యటనకు వచ్చిన సీఎం జగన్... ఈ అంశంపై శారద పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామితో చర్చలు జరిపారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

    విశాఖ శారదా పీఠంలో జరిగిన పలు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొన్న సీఎం జగన్.. స్వరూపానందేంద్ర సరస్వతి, స్వాత్మానందేంద్ర స్వామిలతో కలిసి గోపూజ, శమీవృక్షం ప్రదక్షిణలో పాల్గొన్నారు. అనంతరం శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి-సీఎం జగన్ మధ్య కీలక అంశాలపై చర్చ జరిగినట్టు తెలుస్తోంది. విశాఖకు రాజధాని తరలించడానికి మంచి ముహూర్తం చూడాలని సీఎం జగన్ ఆయనను కోరారని.. ఇందుకు సంబంధించి ఆయన ఓ మహూర్తాన్ని కూడా సూచించారని సమాచారం. స్వరూపానందేంద్ర సూచించిన ముహూర్తానికి న్యాయపరమైన చిక్కులు తొలిగితే.. సాధ్యమైనంత తొందరగా విశాఖకు పరిపాలన రాజధానిని తరలించాలని సీఎం జగన్ కృతనిశ్చయంతో ఉన్నట్టు తెలుస్తోంది.

    రాజధాని తరలింపు అంశంతో పాటు హిందూ ధార్మిక పరిషత్ ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని సీఎం జగన్ వద్ద స్వరూపానందేంద్ర స్వామి ప్రస్తావించినట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో దేవాలయాలపై ఇటీవల కాలంలో చోటు చేసుకున్న పరిణామాలపై కూడా చర్చించినట్టుగా సమాచారం. దేవాదాయశాఖ ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి పీఠాధిపతుల సమావేశాన్ని నిర్వహించాలని సీఎం జగన్‌కు స్వరూపానందేంద్ర సూచించినట్టు తెలుస్తోంది. స్వరూపానందేంద్ర స్వామి సూచనలపై సీఎం జగన్ సానుకూలంగా స్పందించినట్టు సమాచారం.
    Published by:Kishore Akkaladevi
    First published:

    అగ్ర కథనాలు