రోజాకు సరికొత్త ఉత్సాహం అందించిన సీఎం జగన్

బుధవారం ఏపీ కేబినెట్ భేటీలో సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం రోజాకు సరికొత్త ఉత్సాహాన్ని ఇచ్చిందని వైసీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

news18-telugu
Updated: July 16, 2020, 6:53 PM IST
రోజాకు సరికొత్త ఉత్సాహం అందించిన సీఎం జగన్
రోజా (ఫైల్ ఫోటో)
  • Share this:
ఏపీ కేబినెట్‌లో చోటు కోసం ఎదురుచూసి చివరకు ఏపీఐఐసీ చైర్‌పర్సన్ పోస్టుతో సరిపెట్టుకున్న వైసీపీ ఫైర్ బ్రాండ్, ఆ పార్టీ మహిళా ఎమ్మెల్యే రోజా... ప్రస్తుతం నగరి పాలిటిక్స్ మీదే ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. తన రియాల్టీ షో కమిట్‌మెంట్స్‌ను చూసుకుంటూనే... ఏ మాత్రం సమయం దొరికినా వెంటనే నగరిలో వాలిపోతున్నారు రోజా. అయితే రోజాకు ఏపీ ప్రభుత్వం ఇచ్చిన ఏపీఐఐసీ చైర్‌పర్సన్ పదవిపై చాలాకాలం నుంచి ఓ అపవాదు ఉంది. ఈ కార్పొరేషన్‌కు నిధులు లేవని... అందుకే రోజా చేపట్టిన బాధ్యతలకు పెద్దగా ప్రాధాన్యత లేదనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి.

అయితే తాజాగా బుధవారం ఏపీ కేబినెట్ భేటీలో సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం రోజాకు సరికొత్త ఉత్సాహాన్ని ఇచ్చిందని వైసీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. బుధవారం జరిగిన కేబినెట్ సమావేశంలో అనేక కీలక నిర్ణయాలు తీసుకున్న ఏపీ ప్రభుత్వం... ఏపీఐఐసీ కార్పొరేషన్ విషయంలోనూ కీలక నిర్ణయం తీసుకుంది. రూ. 2 వేల కోట్ల రుణం తెచ్చుకునేందుకు ఏపీఐఐసీకి ఏపీ మంత్రివర్గం అనుమతి ఇచ్చింది. ఈ రుణానికి ఏపీ ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చేందుకు కేబినెట్‌ ఓకే చెప్పింది. ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో ఏపీఐఐసీ మరింత క్రియాశీలకంగా మారనుందని.. సీఎం జగన్ తీసుకున్న ఈ నిర్ణయం రోజాలో కొత్త ఉత్సాహం నింపడం ఖాయమనే వాదనలు వినిపిస్తున్నాయి.
Published by: Kishore Akkaladevi
First published: July 16, 2020, 6:53 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading