హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

YS Jagan: త్వరలో ఆ ఉద్యోగాల భర్తీకి చర్యలు.. అధికారులకు సీఎం జగన్ ఆదేశం..

YS Jagan: త్వరలో ఆ ఉద్యోగాల భర్తీకి చర్యలు.. అధికారులకు సీఎం జగన్ ఆదేశం..

ఇంత పెద్ద సంఖ్యలో ఉద్యోగులు విజయవాడ చేరుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా బల ప్రదర్శన చేయడాన్ని పోలీసు వైఫల్యంగానే జగన్ పరిగణించారని చెబుతున్నారు. ఈ వైఫల్యానికి బాధ్యులను గుర్తించాలని కూడా జగన్ కోరినట్లు తెలిసింది. మరోవైపు దీనిపై మరికాసేపట్లో జగన్ సమీక్ష చేయనున్నారని తెలుస్తోంది.

ఇంత పెద్ద సంఖ్యలో ఉద్యోగులు విజయవాడ చేరుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా బల ప్రదర్శన చేయడాన్ని పోలీసు వైఫల్యంగానే జగన్ పరిగణించారని చెబుతున్నారు. ఈ వైఫల్యానికి బాధ్యులను గుర్తించాలని కూడా జగన్ కోరినట్లు తెలిసింది. మరోవైపు దీనిపై మరికాసేపట్లో జగన్ సమీక్ష చేయనున్నారని తెలుస్తోంది.

గ్రామ, వార్డు సచివాలయాల (Village Ward Secretariats) పై క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్ (AP CM YS Jagan) సమీక్ష నిర్వహించారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీచేయడంపై దృష్టిపెట్టాలని సీఎం అధికారులను ఆదేశించారు

గ్రామ, వార్డు సచివాలయాల (Village Ward Secretariats) పై క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్ (AP CM YS Jagan) సమీక్ష నిర్వహించారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీచేయడంపై దృష్టిపెట్టాలని సీఎం అధికారులను ఆదేశించారు. అలాగే ఆధార్‌ సేవలను (Aadhar Services) అందించడానికి అవసరమైన సాంకేతిక పరికరాలను కొనుగోలు చేయాలని సూచించారు. మే నాటికి గ్రామ, వార్డు సచివాలయాల్లో పూర్తిగా ఆధార్‌ సేవలు అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఉగాది సందర్భంగా ఉత్తమ సేవలందిస్తున్న వాలంటీర్లను సత్కరించి, వారికి ప్రోత్సాహకాలు ఇచ్చే కార్యక్రమంపై దృష్టిపెట్టాలన్నారు. అలాగే ఉగాది నాటికి గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది అందరికీ కూడా యూనిఫామ్స్‌ ఇవ్వాలన్నారు. హార్డ్‌ వేర్‌ ఎప్పటికప్పుడు సక్రమంగా ఉండేలా చూసుకోవాలన్న సీఎం.., ప్రతినెలకోసారి గ్రామ, వార్డు సచివాలయాల్లో కంప్యూటర్లు, పరికరాల స్థితిగతులపై నివేదికలు తెప్పించుకుని ఆమేరకు అవి సక్రమంగా ఉండేలా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ప్రజలకు మెరుగైన సేవలు అందాలంటే... గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది ఉత్తమ పనితీరు కనబరచాలని సీఎం జగన్ ఆదేశించారు. ప్రజలకు వారు అందించాల్సిన సేవల విషయంలో అనుసరించాల్సిన తీరుపట్ల నిరంతరం వారికి అవగాహన కల్పించాలన్న చెప్పారు. నిర్దేశించిన ఎస్‌ఓపీలను తప్పనిసరిగా అమలు చేయాలన్న సీఎం.., ప్రజలకు అందుబాటులో ఉండడం అన్నది అత్యంత ప్రాధాన్యతా అంశమన్నారు. ఇదివరకే ప్రకటించిన విధంగా గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులను రెగ్యులర్‌ ఉద్యోగులుగా గుర్తించే ప్రక్రియ పూర్తికావాలన్నారు.

ఇది చదవండి: ఏపీలోని ఆ జిల్లాపై మళ్లీ అభ్యంతరం.. వివాదానికి కారణం ఇదే..!


సేవలకోసం ఎవరైనా లంచం అడిగితే.. వెంటనే ఫిర్యాదు చేసేందుకు వీలుగా తగిన వ్యవస్థఉండాలని సీఎం స్పష్టం చేశారు. అలాగే దీనిపై తీసుకున్న చర్యలను కూడా పొందుపరచాలని ఈ మేరకు పోర్టల్‌లో మార్పులు చేర్పులు చేయాలని సూచించారు. సిటిజన్‌ అవుట్‌రీచ్‌ కార్యక్రమం చాలా ముఖ్యమైనదని.., సమర్థవంతగా ఈకార్యక్రమం కొనసాగాలన్నారు. దీనివల్ల ప్రజల నుంచి సమస్యలు, సూచనలు అందుతాయి. ప్రజలకు కూడా మరింత అందుబాటులో ఉన్నామని మనం తెలియజేయడానికి ఒక అవకాశం లభిస్తుందన్నారు.

ఇది చదవండి: సీఎం జగన్ చేతికి పీకే రిపోర్ట్..? ఆ అంశాలపై హెచ్చరించారా..? అసలు నిజం ఇదేనా..?


సచివాలయాల సిబ్బంది మధ్య, ప్రభుత్వ విభాగాలమధ్య నిరంతరం సమన్వయం ఉండాలన్న సీఎం.., దీనికోసం గ్రామ, వార్డు స్థాయిలో, మండల స్థాయిలో, రెవిన్యూ డివిజన్‌స్థాయిలో, జిల్లాల స్థాయిలో సమన్వయ సమావేశాలు ఏర్పాటు చేసుకునేదిశగా ఆలోచన చేయాలని ఆదేశించారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో ఏర్పాటు చేసిన మౌలిక సదుపాయాలను మారుతున్న పరిస్థితులకు, సాంకేతికతకు అనుగుణంగా ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకోవాలన్న సీఎం.., దీనిపై ప్రత్యేక దృష్టిపెట్టాలని ఆదేశించారు.

ఇది చదవండి: నాలుగు జిల్లాలు.. ఎనిమిది మంది ఎంపీలు.. కానీ ఇద్దరే యాక్టివ్.. మిగతా ఎంపీలెక్కడ..!


ఈ సమావేశానికి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పురపాలక, పట్టణాభివృద్దిశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, చీఫ్‌ సెక్రటరీ డాక్టర్‌ సమీర్‌ శర్మ, ఎంఏఅండ్‌యూడీ స్పెషల్‌ సీఎస్‌ వై.శ్రీలక్ష్మి, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

First published:

Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, Ap grama sachivalayam

ఉత్తమ కథలు