CM YS JAGAN MOHAN REDDY CONDUCTED REVIEW MEETING ON JAGANANNA SAMPURNA GRUHA HAKKU SCHEME FULL DETAILS HERE PRN
YS Jagan: వారికి గుడ్ న్యూస్ చెప్పిన సీఎం జగన్.. పది నిముషాల్లోనే రిజిస్ట్రేషన్
వైఎస్ జగన్ (ఫైల్)
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)ప్రభుత్వం (AP Government) ప్రతిష్టాత్మకంగా జగనన్న సంపూర్ణ గృహహక్కు పథకాన్ని అమలు చేస్తోంది. 1983 నుంచి 2011 మధ్య ప్రభుత్వం నుంచి రుణం తీసుకొని ఇళ్లు నిర్మించుకున్నవారికి శాశ్వత హక్కు కల్పిస్తూ వారిపేరిట రిజిస్ట్రేషన్ చేసే కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టింది.
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)ప్రభుత్వం(AP Government) ప్రతిష్టాత్మకంగా జగనన్న సంపూర్ణ గృహహక్కు పథకాన్ని అమలు చేస్తోంది. 1983 నుంచి 2011 మధ్య ప్రభుత్వం నుంచి రుణం తీసుకొని ఇళ్లు నిర్మించుకున్నవారికి శాశ్వత హక్కు కల్పిస్తూ వారిపేరిట రిజిస్ట్రేషన్ చేసే కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టింది. గురువారం ఈ పథకంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (AP CM YS Jagan Mohan Reddy) సమీక్ష జరిపారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఇప్పటివరకూ 52 లక్షల మంది ఈ పథకం కింద నమోదు చేసుకున్నారని.., 45.63 లక్షల లబ్ధిదారుదాల డేటాను ఇప్పటికే సచివాలయాలకు ట్యాగ్ చేసినట్లు అధికారులు వివరించారు. వీటిపై క్షేత్రస్థాయిలో ఎంక్వైరీలు పూర్తిచేస్తున్న చేశామని.. ఎప్పటికప్పుడు దరఖాస్తులు పరిశీలించి అప్రూవల్స్ ఇస్తున్నట్లు వెల్లడించారు.
దరఖాస్తులన్నంటికీ మరో 10 రోజుల్లో పూర్తిస్థాయిలో అప్రూవల్స్ ఇస్తామని అధికారులు సీఎంకు తెలిపారు. జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం లబ్ధిదారులకు క్లియర్ టైటిల్‌తో రిజిస్ట్రేషన్ చేసేలా తగిన చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులను అదేశించారు. ఎప్పటికప్పుడు దరఖాస్తులను పరిశీలించి జాప్యం లేకుండా అప్రూవల్స్ ఇవ్వాలని ఆయన స్పష్టం చేశారు. క్షేత్రస్థాయిలో ఎంక్వైరీలు కూడా నిర్దేశించుకున్న సమయంలోగా పూర్తిచేయాలన్న సీఎం సూచించారు. ఆస్తులపై పూర్తి హక్కులు దఖలు పడతాయని లబ్ధిదారులకు అవగాహన కల్పించాలన్నారు. పథకం అమలుపై దిగువస్థాయి అధికారులకు, లబ్ధిదారులకు అవగాహన కల్పించే కార్యక్రమాలను చేపట్టాలని ఆదేశించారు.
ఇళ్ల రిజిస్ట్రేషన్లకోసం తగినన్ని స్టాంపు పేపర్లను తెప్పించుకున్నామన్న అధికారులు.., 10 నిమిషాల్లో రిజిస్ట్రేషన్ పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. గ్రామ, వార్డు సచివాలయాల్లోనే జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం కింద లబ్ధిదారులకు రిజిస్ట్రేషన్ చేస్తామని తెలిపారు. నవంబర్ 20 నుంచి ప్రారంభమయ్యే రిజిస్ట్రేషన్ ప్రక్రియ డిసెంబర్ 15 వరకూ కొనసాగుతుదని తెలిపారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియలో పూర్తి పారదర్శకత పాటించాలి అధికారులకు సీఎం జగన్ స్పష్టం చేశారు.
ఈ పథకం కింద ఇంటిపై శాశ్వత హక్కు పొందాలంటే గ్రామీణ ప్రాంతాల్లోని లబ్ధిదారులు వారు రూ.10వేలు, మున్సిపాలిటీల్లో రూ.15వేలు, కార్పొరేషన్లలో రూ.20వేలు చెల్లిస్తే పూర్తి యాజమాన్య హక్కులు కల్పిస్తారు. ఐతే ప్రభుత్వం నిర్దేశించిన మొత్తం కన్నా లబ్ధిదారులు చెల్లించాల్సిన రుణం తక్కువగా ఉంటే ఆ మొత్తం చెల్లిస్తే యాజమాన్య హక్కులు కల్పిస్తారు. అలాగే గతంలో ఇల్లు పొందిన లబ్ధిదారుల నుంచి కొనుగోలు చేసి ప్రస్తుతం నివాసముంటున్న వారు, వారి వారసులు వాస్తవ లబ్ధిదారుల కంటే రెట్టింపు మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. ఈ లెక్కన గ్రామీణ ప్రాంతాల్లో రూ.20వేలు, మున్సిపాలిటీల్లో రూ.15వేలు, కార్పొరేషన్లలో రూ.40వేలు ప్రభుత్వానికి చెల్లించాలి.
ఈ సమావేశానికి పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎస్ డాక్టర్ సమీర్ శర్మ, ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ కమిషనర్ నీరబ్ కుమార్ ప్రసాద్, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ స్పెషల్ సీఎస్ వై శ్రీలక్ష్మి, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.
Published by:Purna Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.