కొత్త జిల్లాలపై కమిటీ... ఇసుక కార్పొరేషన్... కీలక నిర్ణయాలు తీసుకున్న ఏపీ కేబినెట్

సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ సమావేశంలో అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

news18-telugu
Updated: July 15, 2020, 3:36 PM IST
కొత్త జిల్లాలపై కమిటీ... ఇసుక కార్పొరేషన్... కీలక నిర్ణయాలు తీసుకున్న ఏపీ కేబినెట్
ఏపీ కేబినెట్ సమావేశం
  • Share this:
సీఎం జగన్ నేతృత్వంలో సమావేశమైన ఏపీ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. మరింత మందికి వైయస్సార్‌ చేయూత అందించాలని కేబినెట్ నిర్ణయించింది. ఇప్పటికే పెన్షన్‌ అందుకుంటున్న వితంతువులు, ఒంటరి మహిళలు, వికలాంగులైన మహిళలు తదితర కేటగిరీ మహిళలకూ చేయూత వర్తించనుంది. నాడు – నేడులో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో చేపడుతున్న మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులకు సంబంధించి జీఓ ఎంఎస్‌ 22కు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. మూడేళ్లలో ప్రభుత్వ పాఠశాలలు, హాస్టల్లు, కాలేజీల్లో నాడు –నేడు కింద అభివృద్ధి పనులు జరగనున్నాయి. జిల్లా పునర్‌వ్యవస్థీకరణపై కమిటీ ఏర్పాటుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో 25 జిల్లాల ఏర్పాటుపై కమిటీ అధ్యయనం చేయనుంది. జిల్లాల ఏర్పాటులో ఖర్చును నియంత్రించడం సహా వివిధ అంశాలను కమిటీ పరిశీలించనుంది. చీఫ్‌ సెక్రటరీ నేతృత్వంలో కమిటీ ఏర్పాటు కానుంది. వీలైనంత త్వరలో కమిటీ నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు.

ఇసుకకు సంబంధించిన వ్యవహారాలకు ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. గతంలో ఏపీఎండీసీ కింద ఇసుక కార్పొరేషన్‌. ఏపీఎండీసీకి పనిభారాన్ని తగ్గించేదిశగా ఇసుక కార్పొరేషన్‌ ఏర్పాటు. ఇసుక మినహా మిగతా ఖనిజాల వ్యవహారాలన్నీ ఏపీఎండీసీ కిందకు రానున్నాయి. ఇసుక కార్పొరేషన్‌పై ముగ్గురు మంత్రుల కమిటీ పర్యవేక్షణ ఉండనుంది. ఎప్పటికప్పుడు ఇసుక వ్యవహారాలను పర్యవేక్షించేందుకు మంత్రుల కమిటీ. తగిన సూచనలు, సలహాలు ఇవ్వనున్న మంత్రుల కమిటీ. మంత్రుల కమిటీలో కొడాలి నాని, పేర్ని నాని, బుగ్గన రాజేంద్రనాథ్‌ సభ్యులుగా ఉండనున్నారు. దేశ చరిత్రలోనే తొలిసారి భారీ ఎత్తున వైద్యుల పోస్టుల నియామకాలకు ఆమోదం తెలపనుంది. ఇంత పెద్ద ఎత్తున పోస్టుల భర్తీ చేయడం ఇదే ప్రథమం. 9712 పోస్టుల భర్తీకి కేబినెట్ నిర్ణయం తీసుకుంది. 5701 కొత్త పోస్టుల భర్తీతోపాటు చాలా కాలంగా భర్తీ కాకుండా ఉన్న 4011 పోస్టులనూ భర్తీ చేయాలని నిర్ణయం తీసుకుంది.

10వేల మెగావాట్ల సోలార్‌ పవర్‌ప్లాంట్‌ ఏర్పాటు దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. రైతులకు పగిటిపూట ఉచిత కరెంటు ఇచ్చే ప్రయత్నాల్లో భాగంగా ఈ కీలక ప్రాజెక్టులను తీసుకొస్తున్న ప్రభుత్వం.. తక్కువ ఖర్చుకు కరెంటు వచ్చేలా, వీలైనంత ప్రభుత్వంమీద ఆర్థిక భారం తగ్గేలా ఒప్పందానికి ఆమోదం తెలిపింది. 25 ఏళ్లకు పీపీఏ కుదుర్చుకోవాలని నిర్ణయం తీసుకుంది. రాయలసీమ ప్రాజెక్టుల సామర్థ్యం పెంపు, కాల్వల విస్తరణ పనులకోసం స్పెషల్‌ పర్పస్‌ వెహికల్‌కు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. గండికోట ప్రాజెక్టు నిర్వాసితుల కోసం రూ.145.94 కోట్ల రూపాయలను విడుదల చేసింది. దీనికి ఆమోదం తెలిపిన మంత్రివర్గం.. గండికోటలో 27 టీఎంసీల నీటిని నిల్వచేసేందుకు సత్వర చర్యలను ప్రభుత్వం చేపట్టనుంది.

రూ.2వేల కోట్ల రుణం తెచ్చుకునేందుకు ఏపీఐఐసీకి అనుమతి ఇచ్చింది ఏపీ కేబినెట్. ప్రభుత్వం గ్యారెంటీ ఇచ్చేందుకు కేబినెట్‌ ఓకే చెప్పింది. గుంటూరులో ముస్లిం యువకులపై పెట్టిన కేసులు ఉపసంహరణకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. 31 స్టేషన్‌ ఫైర్‌ ఆఫీసర్ల పోస్టులను అసిస్టెంట్‌ డిస్ట్రిక్‌ ఫైర్‌ ఆఫీసర్లుగా అప్‌గ్రేడ్‌కు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. సీపీఎస్‌ ఉద్యమంలో భాగంగా టీచర్లు, ఇతర ఉద్యోగలుపై పెట్టిన కేసులను ఉప సంహరించాలని కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. సీఐడీలో 10 జూనియర్‌ అసిస్టెంట్లు, 10 స్టెనో పోస్టుల మంజూరుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది.
Published by: Kishore Akkaladevi
First published: July 15, 2020, 3:36 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading