బాలకృష్ణకు జగన్ బర్త్ డే గిఫ్ట్... హిందూపురంలో...

నందమూరి బాలకృష్ణ 60వ పుట్టినరోజు సందర్భంగా హిందూపురం అభివృద్ధిలో మరో కీలక ముందడుగు పడింది.

news18-telugu
Updated: June 10, 2020, 1:54 PM IST
బాలకృష్ణకు జగన్ బర్త్ డే గిఫ్ట్... హిందూపురంలో...
దీనిపై గతంలో సోషల్ మీడియాలోనూ అనేక ఊహాగానాలు వచ్చాయి. వాటికి వైసీపీ క్లారిటీ కూడా ఇచ్చింది.
  • Share this:
నందమూరి బాలకృష్ణ 60వ పుట్టినరోజు సందర్భంగా హిందూపురం అభివృద్ధిలో మరో కీలక ముందడుగు పడింది. సీఎం జగన్‌ను నిర్వహించిన వీడియో కాన్ఫిరెన్స్‌లో పాల్గొన్న అనంతపురం జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు... జిల్లాకు సంబంధించిన అనేక అంశాలను ముఖ్యమంత్రికి వివరించారు. ఈ సందర్భంగా మెడికల్ కాలేజీల ఏర్పాటుకు స్థలాల గుర్తింపు విషయంపై సమీక్షలో భాగంగా జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు హిందూపురంలో మెడికల్ కాలేజీ ఏర్పాటుకు అవసరమైన 51.20 ఎకరాల స్థలాన్ని గుర్తించామని సీఎం జగన్‌కు వివరించారు. గుర్తించిన భూమికి సంబంధించిన వివరాలతో కూడిన ప్రతిపాదనలను వెంటనే ప్రభుత్వానికి పంపిస్తామని సీఎం జగన్‌కు తెలిపారు. బాలకృష్ణ పుట్టినరోజు నాడే ఇందుకు సంబంధించిన ప్రతిపాదనను జిల్లా కలెక్టర్ సీఎం దృష్టికి తీసుకురావడం విశేషం. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా ఎస్పీ సత్య ఏసుబాబు, జాయింట్ కలెక్టర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Published by: Kishore Akkaladevi
First published: June 10, 2020, 1:54 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading