హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Vizag Gas Leak | మృతుల కుటుంబాలకు రూ. కోటి పరిహారం... అప్పుడే చర్యలు ఉంటాయన్న సీఎం జగన్

Vizag Gas Leak | మృతుల కుటుంబాలకు రూ. కోటి పరిహారం... అప్పుడే చర్యలు ఉంటాయన్న సీఎం జగన్

8 జిల్లాల్లోని కోవిడ్‌ ఆస్పత్రుల్లో ప్రస్తుతమున్న ఐసోలేషన్‌ పడకలు, ఆక్సిజన్‌ సదుపాయం ఉన్న పడకల సంఖ్యను మరింత పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని సీఎం తెలిపారు. వైరస్‌ సోకడం తప్పేమీ కాదని, నేరం అంతకన్నా కాదని అభిప్రాయపడ్డారు. అలాగే కోవిడ్‌ పట్ల ప్రజల్లో ఉన్న భయాందోళనలను తొలగించాలని అధికారులకు సూచించారు.

విశాఖ గ్యాస్ లీకేజీ ఘటన బాధాకరమని సీఎం జగన్ అన్నారు. దీనిపై కలెక్టర్, పోలీస్ కమిషనర్ సహా పలువురు ఉన్నతాధికారులతో కమిటీ వేశామని తెలిపారు.

విశాఖ గ్యాస్ లీకేజీ ఘటన బాధాకరమని సీఎం జగన్ అన్నారు. దీనిపై కలెక్టర్, పోలీస్ కమిషనర్ సహా పలువురు ఉన్నతాధికారులతో కమిటీ వేశామని తెలిపారు. వారు నివేదిక ఇచ్చిన తరువాత బాధితులపై తదుపరి చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఈ ఘటనలో 9 మంది చనిపోయారని... వారికి ఒక్కొక్కరికి రూ. కోటి రూపాయల సాయం అందిస్తామని సీఎం జగన్ ప్రకటించారు. కంపెనీ నుంచి పరిహారం వచ్చేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. హాస్పిటల్‌లో ప్రాథమిక చికిత్స తీసుకున్న వారికి రూ. 25000, రెండు మూడు రోజులు ఆస్పత్రిలో ఉండేవారికి లక్ష రూపాయలు, వెంటిలేటర్‌పై చికిత్స పొందే వారికి పది లక్షల రూపాయల ఆర్థిక సాయం అందిస్తామని సీఎం జగన్ తెలిపారు. ఎలాంటి ఖర్చు లేకుండా చికిత్స చేయించిన తరువాతే ఈ మొత్తం వారికి అందిస్తామని సీఎం జగన్ స్పష్టం చేశారు.

ఈ ఘటన కారణంగా చుట్టుపక్కల ఉన్న గ్రామాల ప్రజలపై కొంత ఒత్తిడి ఉండే అవకాశం ఉందన్న సీఎం జగన్... అలాంటి ప్రమాదం ఉన్న ఐదు గ్రామాలు గుర్తించామని తెలిపారు. ఆ ఐదు గ్రామాల్లోని 15 వేల మంది ప్రజలకు ఒక్కొక్కరికి రూ. 10 వేల ఆర్థిక సాయం చేస్తామని అన్నారు. ఆ గ్రామాల్లో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేస్తామని అన్నారు. వారిలో రికవర్ అయిన వారికి ఎల్‌జీ కంపెనీలోనే ఉద్యోగాలు ఇప్పించేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. గ్యాస్ లీక్ కారణంగా కొన్ని జంతువులు కూడా చనిపోయాయన్న సీఎం జగన్... బాధితులకు మళ్లీ పశువులను కొనిస్తామని... దాంతో పాటు రూ. 20 వేల సాయం అందిస్తామని తెలిపారు. ఘటన జరిగిన వెంటనే పోలీసులు, అధికారులు వేగంగా స్పందించి చర్యలు తీసుకున్నారని...వారిని అభినందిస్తున్నారని అన్నారు. సీఎస్ నీలం సాహ్నితో పాటు పలువురు అధికారులు, మంత్రులు రెండు మూడు రోజుల పాటు ఇక్కడే ఉండి సహాయ చర్యలను పర్యవేక్షిస్తారని సీఎం జగన్ తెలిపారు.

First published:

Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, Vizag gas leak

ఉత్తమ కథలు