ఏపీ రాజ్యసభ ఎన్నికలు.. జగన్ ఓటు ఎవరికంటే..

సీఎం జగన్

అసెంబ్లీ లో సంఖ్యా బలం ప్రకారం నాలుగు స్థానాలు వైసీపీకే దక్కనున్నాయి.

  • Share this:
    ఏపీలో ఖాళీ అవుతున్న నాలుగు రాజ్యసభ స్థానాలకు మరికాసేపట్లో ఎన్నికలు జరగనున్నాయి. అసెంబ్లీ లో సంఖ్యా బలం ప్రకారం నాలుగు స్థానాలు వైసీపీకే దక్కనున్నాయి. అయితే టీడీపీ తమ పార్టీ తరపున అభ్యర్థిని బరిలోకి నిలపడంతో... ఎన్నిక అనివార్యమైంది. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 4 వరకు పోలింగ్ జరగనుండగా... ఆ తర్వాత రెండు గంటల్లోపే కౌంటింగ్ జరిపి ఫలితాలు వెల్లడిస్తారు. వైసీపీ తరపున రాజ్యసభ అభ్యర్థులుగా మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్, అయోధ్య రామిరెడ్డి, పరిమల్ నత్వానీ బరిలో ఉన్నారు. టీడీపీ నుంచి ఆ పార్టీ సీనియర్ నేత వర్ల రామయ్య బరిలో ఉన్నారు. ఉదయం 9 గంటలకు అసెంబ్లీలో సీఎం జగన్ ఓటు వేయనున్నారు.

    ఇదిలా ఉంటే ఈ ఎన్నికల్లో ఏపీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఓటు ఎవరికి వేస్తారనే దానిపై ఆసక్తి నెలకొంది. అయితే సీఎం జగన్ ఓటును బరిలో ఉన్న పిల్లి సుభాష్ చంద్రబోస్‌కు కేటాయించినట్టు సమాచారం. సీఎం జగన్ స్వయంగా దీన్ని ఎంపిక చేసుకున్నట్టు తెలుస్తోంది. నిన్న వైసీపీ శాసనసభాపక్ష కార్యాలయంలో దీనిపై మాక్ పోలింగ్ నిర్వహించారు. ఇందులో ఆళ్ల అయోధ్యరామిరెడ్డికి 37 మంది ఎమ్మెల్యేల ఓట్లు కేటాయించగా, మిగతా ముగ్గురు అభ్యర్థులకు 38 ఓట్లను కేటాయించారు. ఇక ఏపీకి చెందిన 175 మంది ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కును వినియోగించుకుంటే... ఒక్కో అభ్యర్థి రాజ్యసభకు ఎన్నికయ్యేందుకు 36 తొలి ప్రాధాన్యత ఓట్లు అవసరమవుతాయని తెలుస్తోంది.

    Published by:Kishore Akkaladevi
    First published: