Home /News /andhra-pradesh /

CM YS JAGAN LAUNCHED ACB APP TO MAKE COMPLAINTS ON CORRUPTION IN ANDHRA PRADESH FULL DETAILS HERE PRN GNT

ACB App in AP: ఏపీలో అవినీతి పరులకు హెచ్చరిక.. ఇకపై యాప్ లోనే కంప్లైట్ చేయవచ్చు..

సీఎం జగన్ (పాత ఫొటో)

సీఎం జగన్ (పాత ఫొటో)

ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) లో అవినీతి నిరోధానికి రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేసింది. ఇప్పటికే అవినీతిపై ఫిర్యాదుల కోసం కాల్ సెంటర్ ప్రారంభించిన జగన్ సర్కార్.. ఇప్పుడు యాప్ ను రూపొందించి అందుబాటులోకి తెచ్చింది.

    ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో అవినీతి నిరోధానికి రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేసింది. ఇప్పటికే అవినీతిపై ఫిర్యాదుల కోసం కాల్ సెంటర్ ప్రారంభించిన జగన్ సర్కార్.. ఇప్పుడు యాప్ ను రూపొందించి అందుబాటులోకి తెచ్చింది. ‘ఏసీబీ 14400’ పేరుతో యాప్‌ రూపొందించిన యాప్ ను సీఎం జగన్ (CM YS Jagan) ప్రారంభించారు. ఈ సందర్భంగా జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. చరిత్రలో ఎప్పుడూలేని విధంగా, దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా రూ.1.41లక్షల కోట్ల మొత్తాన్ని లాంటి అవినీతి లేకుండా, పక్షపాతం లేకుండా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి పారదర్శకంగా జమ చేస్తున్నామని ఆయన అన్నారు. తమ ప్రభుత్వం అవినీతికి అస్కారమే లేదని.. ఎవరైనా గీతదాటితే వేటు తప్పదని ఘాటుగా హెచ్చరించారు.

    ఎక్కడైనా, ఎవరైనా కూడా.. కలెక్టరేట్‌ అయినా, ఆర్డీఓ కార్యాలయం అయినా, సబ్‌రిజిస్ట్రార్‌ ఆఫీసు అయినా, మండల కార్యాలయం అయినా, పోలీస్‌స్టేషన్‌ అయినా, వాలంటీర్, సచివాలయం, 108, 104 సర్వీసులు అయినా.. ఎవరైనా ఎక్కడైనా కూడా లంచం అడిగితే.. ఎవరైనా చేయాల్సింది ఒక్కటేనని జగన్ అన్నారు.

    ఇది చదవండి: ఏపీలో పాగా వేసేందుకు బీజేపీ వ్యూహం.. గోదావరి గర్జనకు సిద్ధం..


    ప్రతిఒక్కరూ తమ చేతుల్లోని ఫోన్‌లోకి ఏసీబీ 14400 యాప్‌ను డౌన్లోడ్‌ చేసి... బటన్‌ ప్రెస్‌ చేసి వీడియో ద్వారా కాని, ఆడియోద్వారా కాని సంభాషణను రికార్డు చేయాలి.. ఆ డేటా నేరుగా ఏసీబీకి చేరుతుందని జగన్ వివరించారు. అవినీతిని నిరోధించడానికి మరో విప్లవాత్మకమైన మార్పును తీసుకు వస్తున్నామని.., దీనిపై ఏసీబీ నేరుగా సీఎంఓకు నివేదిస్తుందన్నారు సీఎం.

    ఇది చదవండి: వివేకా కేసులో ఊహించని ట్విస్ట్.. అల్లుడు, కూతురిపై కేసు


    ప్రతి కలెక్టర్, ఎస్పీకి అవినీతి నిరోధంలో బాధ్యత ఉందని.., అవినీతిపై ఎలాంటి ఫిర్యాదు వచ్చినా వెంటనే స్పందించి అంకిత భావంతో అవినీతిని ఏరిపారేయాల్సిన అవసరం ఉందని జగన్ అన్నారు. మన స్థాయిలో అనుకుంటే.. 50 శాతం అవినీతి అంతం అవుతుందని సీఎం అభిప్రాయపడ్డారు. మిగిలిన స్థాయిలో కూడా అవినీతిని ఏరిపారేయాల్సిన అవసరం ఉందన్నారు. అవినీతి లేని పాలన అందించడం అందరి లక్ష్యమన్న ఆయన.., ఎవరైనా పట్టుబడితే.. కచ్చితంగా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

    ఇది చదవండి: విశాఖపై టీడీపీ కీలక నిర్ణయం..? ప్లేస్ మారనున్న బాలయ్య చిన్నల్లుడు..?


    యాప్‌ ఎలా పనిచేస్తుంది..?
    ప్రజలు నేరుగా యాప్ ద్వారా ఫిర్యాదు చేసే అవకాశముంటుంది. గూగుల్‌ ప్లే స్టోర్‌లో యాప్‌ డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.. డౌన్ లోడ్ చేసిన వెంటనే.. మొబైల్ నెంబర్ కు ఓటీపీ వస్తుంది. ఓటీపీ రిజిస్టర్‌ చేయగానే యాప్ ను వినియోగించవచ్చు. యాప్‌లో 2 కీలక ఫీచర్లను అందుబాటులో ఉంచారు. యాప్‌ ద్వారా అవినీతి వ్యవహారానికి సంబంధించిన ఆడియో, వీడియో, ఫొటోలను నేరుగా లైవ్‌రిపోర్ట్‌ ఫీచర్‌ను వాడుకుని అక్కడికక్కడే ఫిర్యాదు చేసే అవకాశం ఉంటుంది. లాడ్జ్‌ కంప్లైంట్‌ ఫీచర్‌ ద్వారా అవినీతి వ్యవహారానికి సంబంధించి ఫిర్యాదు, డాక్యుమెంట్లను, వీడియో, ఆడియో, ఫొటో ఆధారాలను ఏసీబీకి పంపించే అవకాశం ఉంటుంది. ఫిర్యాదు రిజిస్టర్‌ చేయగానే మొబైల్‌ ఫోన్‌కు రిఫరెన్స్‌ నంబరు వస్తుంది. త్వరలో ఐఓఎస్‌ వెర్షన్‌లోనూ యాప్ ను అందుబాటులోకి తెచ్చేందుకు ఏసీబీ కసరత్తు చేస్తోంది.
    Published by:Purna Chandra
    First published:

    Tags: ACB, Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు