ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు పునాదిరాయి పడింది. కర్నూలు జిల్లా (Kurnool District) ఓర్వకల్లు మండలం గుమ్మితం తండాలో ప్రపంచంలోనే తొలి ఇంటిగ్రేటెడ్ పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుసు సీఎం జగన్ (AP CM YS Jagan) శంకుస్థాపన చేశారు. అక్కడే ఏర్పాటు చేసిన పైలాన్ ను ఆవిష్కరించారు. గ్రీన్ ఎనర్జీతో పర్యావరణానికి ఎలాంటి ముప్పు ఉండదని సీఎం జగన్ అన్నారు. భవిష్యత్తులో పునరుత్పాక విద్యుత్ చాలా అవసరమవుతుందన్నారు. ప్రపంచంలోనే తొలి ప్రాజెక్టును ఏపీలో ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని సీఎం తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా ఆంధ్రప్రదేశ్ దేశానికే ఆదర్శంగా నిలవనుందని.. ఇతర రాష్ట్రాలకు స్ఫూర్తినిచ్చేలా ప్రాజెక్టును చేపట్టినట్లు అభిప్రాయపడ్డారు. ఈ ప్రాజెక్ట్ ఖచ్చితంగా గేమ్ ఛేంజర్ అవుతుందని.. గ్రీన్ పవర్ కంపెనీలకు ఏపీ ప్రభుత్వం స్వాగతం పలుకుతోందన్నారు.
ప్రాజెక్టు విషయానికి వస్తే.. ఈ సంస్తలో మొత్తం 5,410 మెగా వాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసి నేషనల్ గ్రిడ్‌కు అనుసంధానించి ఓరక్వల్లు పీజీసీఐఎల్/సీటీయూ విద్యుత్ సబ్ స్టేషన్ ద్వారా దేశంలోని డిస్కంలు, పరిశ్రమలకు విద్యుత్ సరఫరా చేయనున్నారు. ఐదేళ్లలో ప్రాజెక్టును పూర్తి చేసి గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తిని ప్రారంభించనున్నారు. మొత్తం 15వేల కోట్ల పెట్టుబడితో స్థాపించే సంస్థ ప్రత్యక్షంగా, పరోక్షంగా 23వేల మందికి ఉపాధి కల్పించనున్నారు.
గ్రీన్‌కో ఎనర్జీస్ లిమిటెడ్ ఏర్పాటు చేస్తున్న ఇంటిగ్రేటెడ్ రెన్యువబల్ ఎనర్జీ ప్రాజెక్టు ప్రపంచంలోనే అత్యధిక విద్యుత్ ను ఉత్పత్తి చేయనుంది. ప్రాజెక్ట్ కోసం ఏపీ ప్రభుత్వం మొత్తం 4,766.28 ఎకరాల భూమిని కేటాయించి.. ఇప్పటికే 2,800 ఎకరాలను కంపెనీకి అప్పగించింది. ఈ ప్రాజెక్టులో భాగంగా 3000 మెగావాట్ల సోలార్ విద్యుత్, 550 యూనిట్ల విండ్ పవర్, 1860 మెగావాట్ల హైడర్ పవర్ ను ఉత్పత్తి చేయనున్నారు.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో విద్యుత్ సంక్షోభం నెలకొన్న సంగతి తెలిసిందే. ఇదే సమయంలో పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్టును ఏర్పాటు చేయడం ఒక మంచి పరిణామంగా చెప్పవచ్చు. వేసవి కావడంతో దాదాపు నెలరోజులుగా రాష్ట్రంలో కరెంట్ కోతలు అమలవుతున్నాయి. ఈ ప్రాజెక్టు ద్వారా 5వేల మెగావాట్లకు పైగా విద్యుత్ అందుబాటులోకి రానుంది.
ఇప్పుడు మేము తెచ్చిన కంపెనీ కి రిబ్బన్ కట్ చేసి మాపై నువ్వు చేసిన ఆరోపణలు అన్నీ నీ అవకాశవాద రాజకీయం కోసమే అని స్వయంగా నువ్వే ఒప్పుకున్నందుకు థాంక్స్.(2/2) pic.twitter.com/U1IRcrZSLW
— Lokesh Nara (@naralokesh) May 17, 2022
ఇదిలా ఉంటే తమ ప్రభుత్వం తెచ్చిన ప్రాజెక్టునను జగన్ ప్రారంభించారంటూ టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు మాజీ మంత్రి నారా లోకేష్ ట్విట్టర్ ద్వారా జగన్ పై విమర్శలు చేశారు. "ఎన్ని విమర్శలు చేసినా ఆఖరికి నడవాల్సింది చంద్రన్న బాట లోనే జగన్ రెడ్డి. గ్రీన్ కో లో భారీ అవినీతి అంటూ మా పై బురద వెయ్యాలని ప్రయత్నించావు. ఇప్పుడు మేము తెచ్చిన కంపెనీ కి రిబ్బన్ కట్ చేసి మా పై చేసిన ఆరోపణలు అన్ని అవకాశవాద రాజకీయం కోసమే అని స్వయంగా మీరే ఒప్పుకున్నందుకు" అంటూ లోకేష్ ట్వీట్ చేసారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.