తిరుపతి (Tirupati) రుయా ఆస్పత్రిలో జరిగిన ఘటన ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. వ్యవహారంపై ప్రతిపక్షాలతో పాటు ప్రజల్లోనూ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో సీఎం జగన్ (CM YS Jagan) అధికారులకు కీలక ఆదేశాలిచ్చారు. ఘటనపై సీఎం జగన్ స్పందించిన జగన్.. ఇలాంటి ఘటనలు రిపీట్ అవడానికి వీల్లేదని స్పష్టం చేశారు. కొవిడ్ నివారణపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ కు హాజరైన సీఎం జగన్.. అనంతరం వైద్య, ఆరోగ్య శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. కోవిడ్ నివారణా చర్యలను సమర్థవంతంగా అమలు చేయాలని ఆయన స్పష్టం చేశారు.
అలాగే రుయా ఆస్పత్రిలో జరిగిన ఘటనలు తిరిగి పునరావృతం కాకూడదని సీఎం జగన్ ఆదేశించారు. ఆస్పత్రుల్లో ఫిర్యాదు నంబర్లు అందరికీ కనిపించేలా ఉండాలని చెప్పారు. అలాగే ఆరోగ్యమిత్రల కియోస్క్‌ల వద్ద ఈ నంబర్లు స్పష్టంగా డిస్‌ప్లే అయ్యేలా చూడాలన్నారు. ఇక ఆస్పత్రుల్లో 108, 104, తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ లాంటి వాహనాలమీద ఫిర్యాదు నంబర్లు కనిపించేలా ఉండేలా చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ ఆదేశించారు. దీనివల్ల ఎలాంటి సమస్య ఎదుర్కొన్నా వెంటనే ఆ నంబర్లకు ఫిర్యాదు చేసే అవకాశం ఉంటుందన్నారు. ఒకటి రెండు ఘటనల వల్ల మొత్తం వ్యవస్థకే చెడ్డపేరు వస్తుందని., అలాంటి పరిస్థితి రాకూడదని తెలిపారు.
ఇలాంటివి పునరావృతం కాకుండా సమర్థవంతమైన ప్రోటోకాల్ ఉండాలని సీఎం సూచించారు. విజయవాడ ఆస్పత్రి లాంటి ఘటనలు మరలా జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. పోలీసులు మరింత విజిలెంట్‌గా, అప్రమత్తంగా ఉండాలి.., అలసత్వం వహించారనే ఆరోపణలపైనే సీఐ, ఎస్పైలపై చర్యలు తీసుకున్నారని తెలిపారు. ప్రభుత్వం అంటే.. మనల్ని నమ్ముకున్న ప్రజలకు మనం అన్నివేళలా మంచిచేయాలని., దీనికోసం అన్నిరకాల చర్యలు తీసుకోవాలి. కట్టుదిట్టంగా ఉండాలన్నారు.
విద్య, వైద్యం-ఆరోగ్యం, వ్యవసాయం, పోలీసు విభాగాలు సమర్థవంతంగా పనిచేయాలన్న సీఎం.., ప్రభుత్వ ప్రాధాన్యతలు కూడా ఇవేనని అధికారులుకు సీఎం స్పష్టం చేశారు. ఈ సమావేశంలో హోంశాఖ మంత్రి తానేటి వనిత, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజని, సీఎస్ సమీర్ శర్మ, డీజీపీ కె వి రాజేంద్రనాథ్‌రెడ్డి, ముఖ్యమంత్రి స్పెషల్ సీఎస్ కే ఎస్ జవహర్ రెడ్డి, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ముద్దాడ రవిచంద్ర, హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజీత్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, Ap government