మండలి రద్దు తీర్మానాన్ని ప్రవేశపెట్టిన సీఎం జగన్

మండలి రద్దు తీర్మానాన్ని సీఎం జగన్ ఏపీ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. దీనిపై చర్చ మొదలైంది.

news18-telugu
Updated: January 27, 2020, 12:15 PM IST
మండలి రద్దు తీర్మానాన్ని ప్రవేశపెట్టిన సీఎం జగన్
అసెంబ్లీలో సీఎం జగన్
  • Share this:
బీఏసీ సమావేశం తర్వాత ఏపీ అసెంబ్లీ తిరిగి ప్రారంభమయ్యింది.  మండలి రద్దు తీర్మానాన్ని అసెంబ్లీలో సీఎం జగన్ ప్రవేశపెట్టారు. అనంతరం ఈ తీర్మానంపై చర్చను స్పీకర్ తమ్మినేని చేపట్టారు.  మంత్రి ఆళ్ల నాని చర్చను ప్రారంభించి మాట్లాడారు.  మండలి రద్దు తీర్మానంపై సుదీర్ఘ చర్చ జరగనుంది. మండలి రద్దుకు దారితీసిన పరిస్థితులను ప్రభుత్వం సభకు వివరించనుంది.  ప్రజా శ్రేయస్సు కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు అడ్డుతగులుతున్నందునే మండలిని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు వైసీపీ సభ్యులు చెబుతున్నారు.   అంతకు ముందు సమావేశమైన బీఏసీ...మండలి రద్దుపై చర్చించేందుకు సోమవారం ఒక్క రోజు సమావేశాన్ని నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది.

మండలి రద్దు తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టిన సీఎం జగన్


సోమవారం ఉదయం అసెంబ్లీ ప్రారంభంకావడానికి ముందు సమావేశమైన ఏపీ కేబినెట్...మండలిని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోవడం తెలిసిందే.

First published: January 27, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు