CM YS JAGAN IF ACTING MOVIE WE MUST CELEBRATES 1000 FAYS CELEBRATIONS MINSTER NARAYANSWAMY COMMENTS NGS
CM YS Jagan: ఏపీ సీఎం వైఎస్ జగన్ హీరోగా సినిమా..? వెయ్యి రోజుల ఫంక్షన్ జరుపుకుంటామంటున్నమంత్రి
సీఎం జగన్ (ఫైల్)
CM YS Jagan: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు సినిమా చుట్టు తిరుగుతున్నాయి.. ముఖ్యంగా మొన్నటి వరకు ప్రభుత్వం వర్సెస్ టాలీవుడ్ గా ఉన్న పరిస్థితి.. పర్స్తుతం సర్కార్ వర్సెస్ భీమ్లానాయక్ గా మారింది.. ఆ వివాదం మరింత ముదిరింది. ఇలాంటి సమయంలో సీఎం జగన్ సినిమా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి నారాయణ స్వామి..
CM YS Jagan: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాల్లో ప్రస్తుతం భీమ్లా నాయక్ సినిమా (Bheemla Nayak Movie) వివాదం హైలెట్ అతోంది. ప్రతి పార్టీ నోటి వెంట అదే మాట వినిపిస్తోంది. సినిమా రిలీజ్ ముందు రోజు మొదలైన వివాదం.. నాలుగు రోజులగా కొనసాగుతూనే ఉంది. దీంతో ప్రస్తుతం ఏపీలో పరిస్తితి భీమ్లా నాయక్ వర్సెస్ ఏపీ ప్రభుత్వం (AP Government) అన్నట్టు మారింది. ముఖ్యంగా విపక్షాలన్నీ ఏకతాటిపైకి వచ్చి.. ప్రభుత్వం తీరును తప్పు పడుతున్నాయి కేవలం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) పై పగతోనే ప్రభుత్వం ఇలా వ్యవహరిస్తోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే మంత్రులు, వైసీపీ నేతలు మాత్రం పవన్ ను తొక్కేయాల్సిన అవసరం తమేకేముందు అంటున్నారు. సినిమాలపై తమ విధానం ఒకటే అంటున్నారు. కమిటీ రిపోర్ట్ వచ్చినంత వరకు ఆగకుండా సినిమాను ఎందుకు రిలీజ్ చేశారంటూ ఎదురు ప్రశ్నిస్తున్నారు కూడా.. అయితే జనసేన వాదన మాత్రం వేరేలా ఉంది. భీమ్లా నాయక్ కన్నా ముందు చాలా సినిమాలు వచ్చాయని.. కానీ ఏ సినిమాపై లేని ఆంక్షలు.. పర్యవేక్షణ.. ఆదేశాలు ఈ సినిమాకే ఎందుకు గుర్తుకు వచ్చాయని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ అధికారులను థియేటర్ల ముందు కాపలా ఎందుకు కాయిస్తున్నారని ఆరోపిస్తున్నారు..
తాజాగా ఏపీ ప్రభుత్వం తీరుపై మెగా బ్రదర్స్ నాగబాబు వరుస సంచలన ఆరోపణలు చేస్తున్నారు. చిరంజీవికి తమను దూరం చేయడం కోసం ప్రభుత్వం కుట్రలు చేస్తోందని ఆరోపించారు. అంతకుముందు కూడా ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేవలం ఏపీ ప్రభుత్వం పవన్ కల్యాణ్ పై పగతోనే ఇలా ప్రవర్తిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. మొదట వకీల్ సాబ్.. ఇప్పుడు భీమ్లా నాయక్.. రెండు సినిమాలు పవన్ వి కావడంతో.. నిబంధనల పేరుతో నియంతలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ ఏమైనా ఉత్తర కొరియా అనుకుంటున్నారా అని ఆయన ప్రశ్నించారు.
తాజా వివాదంపై మంత్రి నారాయణ స్వామి తనదైనన స్టైల్లో స్పందించారు. సాధరణంగానే సీఎం జగన్ భజన చేసి.. స్వామి భక్తి చాటుకునే ఆయన.. అంతా సీఎంపై విమర్శలు చేస్తుండడంతో ఇలా స్పందించారు. పవన్ కళ్యాణ్ సినిమాపై చంద్రబాబు అనవసర రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు.
అఖండ, పుష్ప, బంగార్రాజు లాంటి సినిమాలు కూడా హిట్టయ్యాయని ఆయన తెలిపారు. సినిమా దెబ్బతింటే హీరోలు నిర్మాతలను ఆదుకోవడం లేదని ఆయన మండిపడ్డారు. హీరోలు ఎవ్వరూ పేదలను ఆదుకుంది లేదని ఆయన వ్యాఖ్యానించారు. సినిమావాళ్లంతా కేవలం రీల్ హీరోలు అని.. సీఎం జగన్ మాత్రమే రియల్ హీరో అన్నారు. అక్కడితోనే ఆగలేదు. జగన్ హీరోగా పెట్టి సినిమా తీస్తే... వెయ్యి రోజులు తప్పక ఆడుతుందని జోస్యం చెప్పారు.
Published by:Nagabushan Paina
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.